రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి ఏడాదికి పైగా కావొస్తోంది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంది. వేలాదిమందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు యుద్ధం బీభత్సానికి బీతిల్లి లక్షలాదిమంది వలసలు వెళ్లిపోయారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉన్నవారందర్నీ ఆ భయం వెన్నాడుతూనే ఉంది. వాళ్లు ఇంకా ఆ సంఘటనల తాలుకా ఆందోళన, ఒత్తిడి కారణంగా చెపుకోలేని మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ శరణార్థులంతా 'సర్వైవర్ సిండ్రోమ్' అనే మానసిక రుగ్మతతో అల్లాడుతున్నారు. ఇంతకీ 'సర్వైవర్ సిండ్రోమ్' అంటే ఏమిటంటే..?
సర్వైవర్ సిండ్రోమ్ అంటే..
ఇతరులు మరణించిన లేదా హాని కలిగించే పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత అపరాధం చేసిన భావనలో ఉండటం. విపత్కర పరిస్థితుల్లోంచి తన వాళ్ల కంటే భిన్నంగా బయటపడిన తర్వాత నుంచి వారిని వేధించే ఒక రకమైన మానసిక ఆవేదన. ఏ తప్పు చేయకపోయినా తమ కారణంగానే వారు దూరమయ్యారని కుంగిపోతుంటారు. ఇందులోంచి వారు బయటపడకపోతే గనుక ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత స్థితికి చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన వెంటనే లిసెట్స్కా అనే మహిళ తన ఏడేళ్ల కొడుకుతో పొరుగున ఉన్న మోల్డోవాకు పారిపోయింది.
ఐతే ఆ సమయంలో ఆమె తన భర్తను, స్నేహితులను వదిలి రోమేనియా సరిహద్దుకు సమీపంలోని నిస్పోరేని వద్ద ఉన్న మోల్డోవన్ శరణార్థి కేంద్రం వద్దకు చేరుకుంది. తన కొడుకుని సురక్షితంగా ఉంచేందుకు ఆమె ఈ ధైర్యం చేయక తప్పలేదు. కానీ ఆ తర్వాత నుంచి తన మాతృభూమికి ద్రోహం చేశానని, తన వాళ్లను మోసం చేశానేమో అనే ఆవేదనతో కుంగిపోవడం ప్రారంబించింది. శరీర స్ప్రుహ లేకుండా తిండి తిప్పలు లేకుండా జీవచ్ఛవంలా మారిపోయింది. ఇలా అక్కడ ఉంటున్న దాదాపు లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులంతా ఇలాంటి మానసిక రుగ్మతతోనే బాధపడుతున్నారు. తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడి గురవ్వుతున్నారు.
ఆయా శరణార్థులకు డాక్టర్స్ ఆఫ్ ది వరల్డ్‌తో సహా దాదాపు 40 ప్రధాన మానవతా సంస్థలు వారికి చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాయి. వారందరికీ ఆర్ట థెరఫీ ఇచ్చి ఆ మానసిక రుగ్మత నుంచి బయటపడేలా చేయడమే గాక వారికి మేమున్నాం అనే భరోసా ఇస్తున్నారు. తాము ఒంటరి అనే భావనను తుడిచిపెట్టి ఇక్కడ ఉన్నవారంతా ఓ కుటుంబంలా.. ఓ కొత్త జీవితానికి నాంది పలకాలంటూ ప్రోత్సహించడంతో ఇప్పుడిప్పుడే వారిలో నెమ్మది నెమ్మదిగా మార్పు రావడం ప్రారంభమైంది. ఆయా శరణార్థుల నైపుణ్యాలను బట్టి వారికి తగిన ఉద్యోగాలివ్వడం, కొందరి చేత పేయింటింగ్ వంటి పనులతో నిమగ్నమయ్యేలా చేశారు. దీంతో వారు ఫేస్ చేస్తున్న మానసిక సమస్యను అధిగమించేలా చేస్తున్నాయి సదరు మానవతా సంస్థలు.
ఈ మేరకు ఆయా మానవతా సంస్థల జనరల్ కోఆర్డినేటర్ లిజ్ డివైన్ మాట్లాడుతూ..మోల్డోవాలోని ఉక్రేనియన్ శరణార్థులలో 86 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు. వారి భర్తలు, కుమారులు, సోదరుడు ఉక్రెయిన్‌లో పోరాడటానికి లేదా ఇతర సహాయ నిమిత్తం అక్కడే ఉన్నారు. దీంతో వారిలో సహజంగా 'ఒంటరి' అనే భావన కలుగుతుంది. ఆ తర్వాత తెలయకుండానే ఆందోళనతో కూడిన ఒత్తిడికి గురై ఈ సర్వైవర్ సిండ్రోమ్‌కి గురవ్వుతారు. అందుకే వారిని ఏదో ఒక పనిలో బిజీ చేసి చుట్టు ఉన్నవాళ్లే తమ వాళ్లుగా స్వీకరించేలా సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు లిజ్ డివైన్.
(చదవండి: వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు! )
Comments
Please login to add a commentAdd a comment