తాము పక్కవారంత తెల్లగా (ఫెయిర్‌గా) లేమంటూ ఎంతగానో ఈర్ష్య పడటాన్నీ, ఎంతెంతో బాధపడటాన్నీ ‘స్నో వైట్ సిండ్రోమ్’గా చెబుతున్నారు వైద్యనిపుణులు. నిజానికి ఈ పదం ‘స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్’ అనే మరో వ్యాధి నుంచి వచ్చిందట. పాశ్చాత్య క్లాసిక్ క్యారెక్టర్లలో ఒకరు సిండరెల్లా అనే అమ్మాయి. సిండరెల్లా అనే ఆ అందమైన అమ్మాయి నిత్యం నిద్రపోతూ ఉంటుంది. ఎవరో అందమైన ఓ రాకుమారుడు ఆమె పెదవుల మీద ముద్దు పెట్టినప్పుడు ఆమె నిద్రనుంచి లేస్తుందట. ఆ కథ చదివి తమను కూడా ఎవరైనా రాకుమారుడి లాంటి హీరో వచ్చి తమకు రారాణి హోదా కల్పిస్తారేమో అనే భావనలో కొందరు అమ్మాయిలు కూరుకుపోయి ఉంటారు. ఇది కొందరు యువతుల బలహీన మనస్తత్వం. దీన్నే ‘స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్’ అంటారు. ఈ సిండ్రోమ్‌కూ ‘స్నో వైట్ సిండ్రోమ్’కూ ఎలాంటి సంబంధం లేకపోయినా... అచ్చం ఆ వ్యాధి పేరు పుట్టినట్టుగానే ‘స్నో వైట్ సిండ్రోమ్’ పేరు కూడా పుట్టిందంట.
ఫెయిర్‌గా లేమని బాధపడే వ్యాధి.. స్నో వైట్ సిండ్రోమ్!
Published Thu, Aug 20 2020 11:17 AM | Last Updated on Thu, Aug 20 2020 11:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment