న్యూఢిల్లీ: కరోనా కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు. పైగా పని అయిపోయేంతవరకు నోట్లో ఏదో ఒకటి వేసుకుని నములుతూనే ఉంటారు. ఇది ఎంత అపాయకరమో ఎవరైనా ఆలోచించారా? ఎప్పుడూ తినేంతగానే తింటున్నాం.. అంతకుమించి ఒక్క ముద్ద ఎక్కువగా తినట్లేదు అంటూ మీరు సమాధానమిచ్చినా ప్రమాదం పొంచే ఉంది. ఆ ప్రమాదాన్ని నిలువరించాలంటే మీరు కంప్యూటర్ మీద ఎంతసేపు పని చేసినా శారీరక వ్యాయామం తప్పనిసరి.
ఆఫీసులో ఉంటే కనీసం 5-10 నిమిషాలైనా అటూ ఇటూ నడుస్తూ సహోద్యోగులతో మాట్లాడుతారు. కానీ ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి అంగుళం కూడా కదలట్లేదు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అదిగో.. పై ఫొటోలో ఉన్నట్లుగా మారిపోతారంటోది డైరెక్టీ అప్లై సంస్థ. ఫొటోలో కనిపిస్తున్న మోడల్‌కు 'సుశాన్' అని నామకరణం చేసింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే 25 సంవత్సరాల వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత ఇలా మారిపోతారు అని హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా కింది వ్యాధులు రావడం తథ్యమని చెప్తోంది. (లాప్‌టాప్ ముందు భర్త.. డాన్స్ చేస్తున్న భార్య)
► కంప్యూటర్ విజన్ సిండ్రోమ్
► వెన్నెముక వంగిపోవడం
► రిపిటేటివ్ టైపింగ్ స్ట్రైన్
► జుట్టు రాలిపోవడం
► కంటి కింద మచ్చలు (డార్క్ సర్కిల్స్)
► టెక్ నెక్ (మెడపై అధికభారం, వెన్ను నొప్పి)
► ఇంక్రీజ్‌డ్ వ్రింకిల్స్ (చర్మంపై ముడతలు)
► ఊబకాయం
► చర్మం పొడిబారి, నిర్జీవంగా మారడం ( విటమిన్ డీ, డీ-12 లేకపోవడం వల్ల)
► తీవ్ర ఒత్తిడి
నివారణ కోసం: వీటిని నివారించేందుకు చిన్నపాటి వర్కవుట్లు, నడక, పరుగు, శారీరక శ్రమను కలిగించే పనులు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. అంతేకాకుండా పడకపై పని చేసుకునే దురలవాటుకు ముగింపు పలకాలి. ఎందుకంటే ఇది మీలో గజిబిజిని పెంచి క్రమంగా ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. 6-8 గంటలు మాత్రమే పనికి కేటాయించండి. రోజులో కనీసం ఒక్క గంట అయినా ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు గుడ్‌బై చెప్పండి. ఆ సమయాన్ని కుటుంబంతో కలిసి మాట్లాడేందుకు కేటాయించండి. ఇది మీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. వీటితోపాటు ఎక్సర్‌సైజులు తప్పనిసరి. ముఖ్యంగా ఉదయం పూట చేసే వ్యాయామం మీ శరీరానికే కాకుండా మానసికంగా కూడా ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. రక్తప్రసరణను మెరుగుపర్చడంతోపాటు, మెదడును ఉత్తేజం చేస్తుంది. ముఖ్యంగా 7-8 గంటలపాటు హాయిగా నిద్రించండి. (వర్క్ ఫ్రం హోంకే జై!)
Comments
Please login to add a commentAdd a comment