కారు డోర్ లాక్; ఇద్ద‌రు చిన్నారుల మృతి | Two Children Died Ater They Got Locked Inside A Car | Sakshi
Sakshi News home page

డోర్ లాక్ కావ‌డంతో ఇద్ద‌రు చిన్నారుల మృతి

Published Tue, Jun 16 2020 5:01 PM | Last Updated on Tue, Jun 16 2020 6:50 PM

Two Children Died Ater They Got Locked Inside A Car  - Sakshi

ల‌క్నో : కారు డోర్ లాక్ కావ‌డంతో ఊపిరాడ‌క ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. వివ‌రాల ప్ర‌కారం.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి ముందున్న కారు లోప‌లికి వెళ్లారు. దీంతో డోర్ లాక్ అయ్యి ఊపిరాడ‌క ఇద్ద‌రు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా, మిగ‌తా ఇద్ద‌రు చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో మ‌హ‌మ్మ‌ద్ అల్తాఫ్ (5), అబ్ష‌ర్ రాజా (7) ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రిత‌మే వీరి కుటుంబం సెకండ్ హ్యాండ్‌లో కారు కొనుగోలు చేయ‌గా అదే కారులో చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. (ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయన: గడ్కరీ)

ఎంత సేప‌టికి పిల్లలు ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో తల్లిదండ్రులు వెత‌గ్గా, కారులో అప‌స్మారక స్థితిలో క‌న్పించారు. దీంతో వెంటేనే ఆస్పత్రికి త‌ర‌లించగా ఇద్ద‌రు చిన్నారులు చ‌నిపోగా, మిగ‌తా ఇద్ద‌రు చికిత్స పొందుతున్నారు అని మొరాదాబాద్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు. కారు లోప‌లే దాదాపు రెండు గంట‌ల‌కు పైగా ఇరుక్కుపోవ‌డంతో ఊపిరాడక చిన్నారులు చ‌నిపోయిన‌ట్లు పేర్కొన్నారు.  (16 ఏళ్ల బాలిక‌పై అఘాయిత్యం )


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement