Inside Car
-
సహోద్యోగికి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి దారుణం
చెన్నై: 20 ఏళ్ల యువతిపై అయిదుగురు వ్యక్తులు కలసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. చెన్నై దగ్గర్లోని కాంచిపురంలో ఈ ఘటన జరిగింది. సెల్‌ఫోన్ షాపులో పని చేస్తున్న బాధితురాలికి ఆమెతో పాటే పని చేస్తున్న గుణశీలన్ మత్తు పదార్థం కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. గుణశీలన్ సహా మరో నలుగురు కలసి ఆమెను కారులో ఎక్కించి అత్యాచారం చేశారు. బాధితురాలు మెలకువలోకి వచ్చి కేకలు వేయడంతో రోడ్డుపై వెళుతూ పడేశారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు అంబులెన్సుకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద ఈ నెల 9న కేసు నమోదు చేశారు. (చదవండి: గణేష్ ఉత్సవాల్లో విషాదం: ఉప్పెన సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి) -
కారు డోర్ లాక్; ఇద్దరు చిన్నారుల మృతి
లక్నో : కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి ముందున్న కారు లోపలికి వెళ్లారు. దీంతో డోర్ లాక్ అయ్యి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా, మిగతా ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో మహమ్మద్ అల్తాఫ్ (5), అబ్షర్ రాజా (7) ఉన్నారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితమే వీరి కుటుంబం సెకండ్ హ్యాండ్లో కారు కొనుగోలు చేయగా అదే కారులో చిన్నారులు మృత్యువాత పడ్డారు. (ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయన: గడ్కరీ) ఎంత సేపటికి పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతగ్గా, కారులో అపస్మారక స్థితిలో కన్పించారు. దీంతో వెంటేనే ఆస్పత్రికి తరలించగా ఇద్దరు చిన్నారులు చనిపోగా, మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు అని మొరాదాబాద్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు. కారు లోపలే దాదాపు రెండు గంటలకు పైగా ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చిన్నారులు చనిపోయినట్లు పేర్కొన్నారు. (16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం ) -
కారులో రూ. 1000 నోట్ల కట్టలు స్వాధీనం
ముంబై: ఇద్దరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల నుంచి ముంబై పోలీసులు కోటి రూపాయల విలువైన పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో 1000 రూపాయల నోట్లను తీసుకెళ్తుండగా క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకుని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు రద్దయిన పాత నోట్లను మార్చుకుని కొత్త 2000 రూపాయల నోట్లు తీసుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తామని, ఇందుకోసం 30 శాతం కమిషన్ ఇవ్వాలని వీరిద్దరూ ఏజెంట్లకు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ప్రసాద్ పాటిల్, హరిశ్చంద్ర షిండే, ప్రమోద్ పదాలె, అవివాష్ జైన్‌లుగా గుర్తించారు.