
చెన్నై: 20 ఏళ్ల యువతిపై అయిదుగురు వ్యక్తులు కలసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. చెన్నై దగ్గర్లోని కాంచిపురంలో ఈ ఘటన జరిగింది. సెల్‌ఫోన్ షాపులో పని చేస్తున్న బాధితురాలికి ఆమెతో పాటే పని చేస్తున్న గుణశీలన్ మత్తు పదార్థం కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది.
గుణశీలన్ సహా మరో నలుగురు కలసి ఆమెను కారులో ఎక్కించి అత్యాచారం చేశారు. బాధితురాలు మెలకువలోకి వచ్చి కేకలు వేయడంతో రోడ్డుపై వెళుతూ పడేశారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు అంబులెన్సుకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద ఈ నెల 9న కేసు నమోదు చేశారు.
(చదవండి: గణేష్ ఉత్సవాల్లో విషాదం: ఉప్పెన సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి)
Comments
Please login to add a commentAdd a comment