
ప్రతీకాత్మక చిత్రం
టీ.నగర్: తనపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణకు వెళుతున్న సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో సంచలనం ఏర్పడింది. ఈరోడ్ జిల్లాకు చెందిన యువతి(24) చెన్నై సాలిగ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ మూడేళ్లుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అడయార్‌కు చెందిన గణేష్‌తో పరిచయం ఏర్పడింది. తనకు అనేక మంది సినీ దర్శకులు తెలుసని, త్వరలో హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.
అతని స్నేహితులు సైతం ఆమెతో గడిపారు. అయితే సినిమా అవకాశాలు ఇప్పించలేదు. ఇలావుండగా తనపై లైంగికదాడి చేసిన గణేష్ అతని స్నేహితులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల యువతి అడయారు మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం సాయంత్రం విచారణ కోసం పోలీసు స్టేషన్ రావాల్సిందిగా యువతిని మహిళా పోలీసులు కోరారు. దీంతో యువతి తన స్నేహితుడితో కారులో వెళ్లింది.
వడపళని సమీపంలో వెళుతుండగా యువతి హఠాత్తు గా స్పృహ తప్పింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఆమె మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది. ఆమెకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. తన మృతికి గణేష్ కారణమని తెలుపుతూ బ్యాగులో లేఖ దొరికింది. విరుగంబాక్కం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment