క్వార్టర్స్‌లో తీర్థ-అక్షర జోడి
ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘ఇస్కా సిస్టర్స్’ తీర్థ-అక్షర జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తీర్థ-అక్షర ద్వయం 6-4, 6-1తో ఆశిమా గార్గ్-సృష్టి సలారియా (భారత్) జంటపై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అనుష్క భార్గవ తొలి రౌండ్లో ఓడిపోయింది.
అనుష్క 4-6, 1-6తో రుతుజా భోస్లే (భారత్) చేతిలో ఓటమి పాలైంది. భారత్‌కే చెందిన ప్రేరణ బాంబ్రీ, ప్రార్థన తోంబ్రే, అంకిత రైనా, నటాషా పల్హా, అమృత ముఖర్జీ తొలి రౌండ్లో తమ ప్రత్యర్థులపై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రేరణ బాంబ్రీతో ఇస్కా అక్షర; కాల్వ భువనతో నిధి చిలుముల; ఎమి ముతగుచి (జపాన్)తో సౌజన్య భవిశెట్టి; అమృత ముఖర్జీతో రిషిక సుంకర పోటీపడతారు.