15 Workers Killed After Girder Launching Machine Collapses Near Shahpur In Thane District - Sakshi
Sakshi News home page

Samruddhi Expressway Incident: సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో అపశ్రుతి.. 15 మంది మృతి   

Published Tue, Aug 1 2023 7:18 AM | Last Updated on Tue, Aug 1 2023 11:00 AM

15 Dead After Girder Launcher Collapses In Thane District - Sakshi

ముంబై: మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. షాపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక బ్రిడ్జి  గిర్డర్ లాంచర్ కుప్పకూలింది. ఈ  ప్రమాదంలో 16 మంది మరణించగా ముగ్గురు గాయపడ్డారు.   

మహారాష్ట్ర థానే జిలాలోని షాపూర్ సమీపంలో జరుగుతున్న సమృద్ధి ఎక్స్ ప్రెస్ నిర్మాణం మూడో దశ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రిడ్జిల నిర్మాణానికి ఉపయోగించే గిర్డర్ లాంచర్ సుమారుగా 100 అడుగుల ఎత్తు నుండి కుప్పకూలడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు మాత్రం గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంఘటన గురించి తెలుసుకుని పోలీసులు, NDRF, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  మృతులను, గాయపడినవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. 

అంతకుముందు ఆదివారం రోజున బుల్దానా జిల్లాలో 6వ నెంబరు జాతీయ రహదారి మీద ఒక ట్రక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడం ఇక్కడి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. 

ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement