Bridge Collapses
-
పెద్దపల్లి జిల్లా ఓడేడులో కూలిన మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి
-
జార్ఖండ్‌లో కూలిన గిర్డర్
జార్ఖండ్: జార్ఖండ్‌లో పెను ప్రమాదం తప్పింది. గిరిధ్ జిల్లాలోని ఆర్గా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన గిర్డర్ ఒకటి కూలిపోయింది. రాష్ట్ర రాజధాని రాంచీకి 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోరీ బ్లాక్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.భారీ వర్షం కారణంగా గిర్డర్ కూలిపోయిందని, పిల్లర్ కూడా వంగిపోయిందని ఈఈ వినయ్‌కుమార్ తెలిపారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన జార్ఖండ్‌లోని గిరిధ్, బిహార్‌లోని జమూయి జిల్లాలను కలుపుతుంది. -
వంతెనలా.. పేకమేడలా..
-
బీహార్ అరారియా జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జి
-
బ్రిడ్జి కింద నలిగిన బతుకులు
కోల్‌కతా/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఘోరం జరిగింది. ఐజ్వాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 100 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణ పనుల్లో ఉన్న కారి్మకుల్లో కనీసం 18 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇంకా కనీసం ఐదుగురి జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో అత్యధికులు పశి్చమ బెంగాల్‌కు చెందిన వారే. ప్రమాద ప్రాంతం సైరంగ్ ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురింగ్ నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పైకి చేర్చే క్రమంలో గాంట్రీ కుప్పకూలడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయ, తరలింపు తదితర చర్యల్లో మిజోరం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మృతుల కుటుంబాల్లోని అర్హులకు రైల్వే శాఖ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress. Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7 — Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023 ఇది కూడా చదవండి: Live Updates: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్–3 -
మహారాష్ట్రలో ఘోరం.. కుప్పకూలిన గిర్డర్ లాంచర్.. 15 మంది మృతి
ముంబై: మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. షాపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక బ్రిడ్జి గిర్డర్ లాంచర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా ముగ్గురు గాయపడ్డారు. మహారాష్ట్ర థానే జిలాలోని షాపూర్ సమీపంలో జరుగుతున్న సమృద్ధి ఎక్స్ ప్రెస్ నిర్మాణం మూడో దశ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రిడ్జిల నిర్మాణానికి ఉపయోగించే గిర్డర్ లాంచర్ సుమారుగా 100 అడుగుల ఎత్తు నుండి కుప్పకూలడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు మాత్రం గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన గురించి తెలుసుకుని పోలీసులు, NDRF, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను, గాయపడినవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతకుముందు ఆదివారం రోజున బుల్దానా జిల్లాలో 6వ నెంబరు జాతీయ రహదారి మీద ఒక ట్రక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడం ఇక్కడి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. #UPDATE | Maharashtra: Two NDRF teams are working at the site after a crane fell on the slab of a bridge in Shahapur tehsil of Thane district. Till now 14 dead bodies have been retrieved and 3 have been injured. Another six are feared to be trapped inside the collapsed… https://t.co/3QiIuUwoIP pic.twitter.com/tptIFDfAfb — ANI (@ANI) August 1, 2023 ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం -
Morbi bridge collapse: మోర్బీ వంతెన ప్రమాదంలో... 134కు పెరిగిన మృతులు
మోర్బీ/న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై బ్రిటిష్ కాలపు తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 134కు పెరిగింది! మరో ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దుర్ఘటన నేపథ్యంలో గుజరాత్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో రోడ్డు షో రద్దు చేసుకోగా కాంగ్రెస్ పరివర్తన్ సంకల్ప యాత్రను వాయిదా వేసుకుంది. గుజరాత్‌లోనే ఉన్న మోదీ ఈ ఘటనపై సోమవారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బాధితులకు అన్ని విధాలా సాయమందించాలని ఆదేశించారు. మంగళవారంఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. మోర్బీ వంతెన ప్రమాదంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ కుటుంబంలో పెను విషాదం వంతెన ప్రమాదానికి గుజరాత్‌లోని రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కల్యాణ్‌జీ కుందారియా కుటుంబంలో ఏకంగా 12 మంది బలయ్యారు! వారంతా ఆయన సోదరుడు, సోదరీమణుల కుటుంబాలకు చెందినవారు. వీరిలో ఐదుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. బ్రిడ్జిని చూసేందుకని వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోయారంటూ ఎంపీ కంటతడి పెట్టారు. ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘అజంతా’కు నిర్వహణ కాంట్రాక్ట్ మోర్బీ వంతెన నిర్వహణ, అపరేషన్ కాంట్రాక్ట్‌ను అజంతా ఒరెవా కంపెనీకి అప్పగించారు. సీఎఫ్ఎల్ బల్బులు, గోడ గడియారాలు, ఎలక్ట్రానిక్ బైక్‌ల తయారీకి అజంతా గ్రూప్ పేరొందింది. ఎల్ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లు, సెరామిక్ ఉత్పత్తులనూ తయారు చేస్తోంది. గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.800 కోట్ల పైమాటే. ‘ఫిట్‌నెట్ సర్టిఫికెట్’ లేకుండానే.. బ్రిడ్జికి ఫిట్‌నెట్ సర్టిఫికెట్ జారీ చేయలేదని మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ చెప్పారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని తెలిపారు. ‘‘వంతెనపైకి 20–25 మందిని ఒక గ్రూప్‌గా అనుమతిస్తుంటారు. కానీ నిర్వాహక సంస్థ అజంతా ఒరెవా నిర్లక్ష్యంగా ఒకేసారి దాదాపు 500 మందిని వెళ్లనిచ్చింది. అదే ఘోర ప్రమాదానికి దారి తీసింది’’ అన్నారు. 9 మంది అరెస్టు ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా 9 మందిని అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు తెలియజేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఐపీసీ సెక్షన్ 304, సెక్షన్ 308 కింద కేసు పెట్టామన్నారు. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడి స్థానంలో అజంతా కంపెనీ పేరు చేర్చామన్నారు. పూర్తి వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించారు. అరెస్టయిన 9 మందిలో అజంతా ఒవెరా గ్రూప్‌నకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టిక్కెట్ బుకింగ్ క్లర్కులు ఉన్నారు. బతుకుతెరువు కోసం వెళ్లి బలయ్యాడు బర్ధమాన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్బ బర్ధమాన్ జిల్లా కేశబ్బతి గ్రామానికి చెందిన 18 ఏళ్ల షేక్ హబీబుల్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని మోర్బీకి చేరుకున్నాడు. నగల దుకాణంలో పనికి కుదిరాడు. గత 10 నెలలుగా అక్కడే పనిచేస్తున్నాడు. ఆదివారం తీగల వంతెన చూసేందుకు వెళ్లాడు. దానిపైకి చేరుకొని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. షేక్ హబీబుల్ మృతితో స్వగ్రామం కేశబ్బతిలో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కలలన్నీ చెదిరిపోయాయని హబీబుల్ తండ్రి మహీబుల్ షేక్ వాపోయాడు. హబీబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కునాల్ ఘోష్ భరోసానిచ్చారు. 675 టికెట్లు అమ్మారా? మోర్బీ వంతెన ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. ప్రమాద సమయంలో 500 మందికిపైగా జనం వంతెనపై ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. బరువు ఎక్కువై కూలిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తీగల సాయంతో వేలాడే ఈ వంతెన సామర్థ్యం కేవలం 150 మంది. అంతకంటే ఎక్కువ మంది వెళితే ఆ బరువును తట్టుకోలేదు. ఈ విషయం తెలిసినప్పటికీ కాంట్రాక్ట్ సంస్థ ‘అజంతా ఒరెవా’ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏకంగా 675 మంది సందర్శకులకు టిక్కెట్లు విక్రయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నా చెల్లెలు కనిపించడం లేదు ప్రమాదంలో చెల్లెలు కనిపించకుండా పోయిందని ఓ యువకుడు రోదిస్తున్నాడు. ‘‘ఆ వంతెనపైకి మొదటిసారి వెళ్లాం. అప్పటికే వందలాది మంది ఉన్నారు. సెల్ఫీలు తీసుకుంటుండగానే కుప్పకూలింది. నేను మాత్రం ఈదుకొచ్చా. చెల్లి కోసం నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నా’’ అన్నాడు. భారీ శబ్దం వినిపించింది ‘‘స్నేహితులతో కలిసి వంతెన సమీపంలోనే కూర్చున్నా. అంతలో భారీ శబ్దం వినిపించింది. వంతెన కూలింది. వెంటనే అక్కడికి పరుగెత్తాం. కొందరు ఈదుతూ, మరికొందరు మునిగిపోతూ కనిపించారు. మేం పైపు సాయంతో 8 మందిని రక్షించాం’’ అని సుభాష్ భాయ్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. నా మిత్రుడు రాజేశ్ ఏమయ్యాడు? తన మిత్రుడు రాజేశ్ గల్లంతయ్యాడంటూ జయేశ్ భాయ్ అనే యువకుడు కంటతడి పెట్టాడు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని వాపోయాడు. 15 మృతదేహాలను బయటకు చేర్చా వంతెనపై 60 మందికి పైగా వేలాడుతూ కనిపించారని రమేశ్ భాయ్ చెప్పాడు. మిత్రులతో కలిసి తాడు సాయంతో 15 మృతదేహాలను బయటకు తెచ్చామన్నాడు. -
మోర్బీ తరహాలో ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన
లక్నో: ఛట్ పూజ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పింది. సూర్యుడికి పూజలు చేసి తిరిగి వస్తుండగా పెద్దకాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. పలువురు చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాకియా మండలం చందౌలీ ప్రాంతంలో సోమవారం జరిగింది. సారయ్య గ్రామ ప్రజలు సూర్యుడి పూజలు నిర్వహించి ఇళ్లకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో కాలువపై ఉన్న వంతెన దాటేందుకు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావటంతో కుప్పకూలింది. స్థానికులు అక్కడకు చేరి నీటమునిగిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోయి 140 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బ్రిడ్జి ప్రమాదాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మోర్బీ తరహాలోనే బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో జనం రావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. #WATCH | UP: A part of a canal culvert carrying many people collapsed in Chandauli's Saraiya village of Chakia Tehsil during #ChhathPooja celebrations earlier today A few bricks of the bridge slipped & fell into the river during #Chhath celebrations, but no one was injured: ASP pic.twitter.com/IQMykWjhrw — ANI (@ANI) October 31, 2022 ఇదీ చదవండి: మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే.. -
జోష్‌లో వంతెన ఓపెనింగ్.. పాపం బొక్కలు విరగ్గొట్టుకున్నారు
Mexican Footbridge Collapses: నేటీకి కొన్ని దేశాల్లో పురాతన కట్టడాలు, బ్రిడ్జీలు, భవనాలు చక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ, నేటి ఇంజనీర్లు కట్టిన కట్టడాలు, బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా ఓ బ్రిడ్జీ కట్టి.. ఓపెనింగ్ చేసిన కాసేపటికే కూలిపోయింది. దీంతో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. క్యూర్నావాకా నగరం కట్టిన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం రోజునే కూలిపోయింది. ఫుట్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేయర్ జోస్ లాయిస్ ఉరియో స్టెగుయ్కు ఊహించని షాక్ తగిలింది. వంతెన ప్రారంభం తర్వాత మేయర్ సహా సిటి కౌన్సిల్ సభ్యులు బ్రిడ్జీపై నడుచుకుంటూ వెళ్లారు. ఇంతో వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో వారందరూ కింద పడిపోయారు. Footbridge collapse during reopening ceremony in Mexico pic.twitter.com/Kn4X554Ydk — Adrian Slabbert (@adrian_slabbert) June 9, 2022 సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బ్రిడ్జీ మీద ఉన్నవారంతా కింద నీటిలో ఉన్న రాళ్లపై పడిపోయారు. ఈ ఘటనలో మేయర్, 20 మంది సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి ఎముకలు విరిగిపోయాయినట్టు స్థానిక మీడియో తెలిపింది. వంతెన ప్రారంభం రోజునే ఇలా జరగడంతో ఇంజనీర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కడప: పోటెత్తిన పాపాగ్ని నది.. కూలిన కమలాపురం బ్రిడ్జి
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాయలసీమ అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కట్టలు తెంచుకొని ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో కడప జిల్లా పాపాగ్ని నది ఉధృతికి కమలాపురం వంతెన కుంగిపోయింది. వెలిగల్లు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెడుతున్నారు. దీంతో రెండు రోజులుగా భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు ప్రవహిస్తోంది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి క్రమ క్రమంగా కూలిపోయింది. చదవండి: ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ యుద్ధ నౌక జల ప్రవేశం బ్రిడ్జి మధ్య భాగంలోని దాదాపు ఆరు స్లాబ్స్ చీలిపోయి లోపలికి కుంగిపోయాయి. దీంతో కమలాపురం- కడప మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కుంగిన బ్రిడ్జిమీదుగా వాహనాలు, పాదచారులు వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. నంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో కడప నుంచి తాడిపత్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. చదవండి: సీఎం చొరవతోనే మీరు ప్రాణాలతో బయటపడ్డారు పాపాగ్ని నది బ్రిడ్జిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సీఎం అంగీకరించారని, సోమవారం నిపుణుల బృందం వస్తోందని పేర్కొన్నారు. త్వరితగతిన కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కడప- బళ్లారి రహదారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాగేరు వంకపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కూడా సీఎం అంగీకరించారని తెలిపారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు. -
కొట్టుకుపోయిన బ్రిడ్జి, షాకింగ్ వీడియో!
భోపాల్: వరద ఉద్ధృతికి మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి మణిఖేడ ఆనకట్ట నుండి ప్రవహిస్తున్న నీటి వేగానికి వంతెన నదిలో ఒక్కసారిగా కుప్పకూలింది. మణిఖేడ డ్యామ్ 10 గేట్లు ఎత్తడంతో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నగరమైన గ్వాలియర్‌కి అనుసంధానించే మూడింటిలో ఈ వంతెన ఒకటి. అయితే ఇప్పటికే బాధిత గ్రామాలను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వరద ప్రభావానికి గురైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తగిన సాయం చేస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్ననేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం సహాయంపై ప్రధాని మోదీతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. 2009లో నిర్మించిన దాతియా-రతన్‌గఢ్ దేవాలయాన్ని కలిపే ఇదే వంతన వద్ద 2013 అక్టోబరులో జరిగిన తొక్కిసలాటలో 115 మంది భక్తులు మరణించారు. కాగా భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలముతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు, గ్వాలియర్ చంబల్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత జిల్లాలలో వైమానిక దళానికి చెందిన అనేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అలాగే శివపురి, ష్యోపూర్, గ్వాలియర్, దాతియా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలోని 1100లకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తొమ్మిదింటికి ఆరెంజ్ అలర్ట్, మరో ఎనిమిది జిల్లాలకు యల్లో అలర్ట్ జారీ చేశారు. సహాయ,రక్షణ బృందాలు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. Scary! Bridge connecting Datia to Ratangarh temple washed away, in flood fury following release of water from Manikheda Dam. Same bridge where in 2013 stampede had killed over 115 devotees @ndtvindia @ndtv @GargiRawat @manishndtv @alok_pandey pic.twitter.com/YTWoq0gr6o — Anurag Dwary (@Anurag_Dwary) August 3, 2021 -
బ్రిడ్జి త్వరలో ప్రారంభం, అంతలోనే..
భోపాల్: భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్‌లోని ఓ బ్రిడ్జి కుప్పకూలింది. వైన్‌గంగా నదిపై సియోని జిల్లాలో 3.7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అధికారికంగా నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన 30, ఆగస్టు 2020 రోజునే బ్రిడ్జి కూలిపోవడం విశేషం. ఇక 150 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు నెల క్రితమే పూర్తి కావడంతో స్థానికులు దాని ద్వారా రాకపోకలు కూడా సాగించారు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో జనం ఇళ్లకే పరిమితమైన వేళ బ్రిడ్జి కూలిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బ్రిడ్జి పిల్లర్లు నదిలోకి కుంగిపోవడంతో అది పేకమేడలా వైన్ గంగలోకి ఒరిగిపోయింది. (చదవండి: కుక్కకు బర్రె వాహనం: భారీ భద్రత!!) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో భాగంగా 1,సెప్టెంబర్ 2018 న దీని పనులు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ హరిదాస్ దర్యాప్తునకు ఆదేశించారు. నిర్మాణంలో లోపాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక బ్రిడ్జి కూలిపోవడంతో సున్వారా, భీంఘర్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ పాల్ సింగ్ ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నర్మదా నదీపరీవాహక ప్రాంతాల్లో కూడా తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదకర స్థాయిలో నర్మద ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో ఇప్పటివరకు రాష్ట్రంలోని 251 రిజర్వాయర్లలో 120 పూర్తిగా నిండిపోయాయి. (చదవండి: ‘వందల కోట్ల బ్రిడ్జి.. 29 రోజుల్లో కూలిపోయింది’) -
‘వందల కోట్లు.. 29రోజుల్లో కూలిపోయింది’
-
‘వందల కోట్ల బ్రిడ్జి.. 29 రోజుల్లో కూలిపోయింది’
పట్నా: గత నాలుగు రోజులుగా బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద తాకిడికి ఓ వంతెన కొట్టుకుపోయింది. దీనిలో పెద్ద విశేషం ఏం ఉంది అనుకుంటున్నారా. ఉంది.. ఏంటంటే ఈ వంతెన ప్రారంభమయ్యి సరిగా నెల రోజులు కూడా కాలేదు. నేటికి కేవలం 29 రోజులు మాత్రమే. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గండక్ నదిపై బ్రిడ్జిని నిర్మించారు. స్వయంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వంతెనను ప్రారంభించారు. ఇది జరిగిన 29 రోజులకే గోపాల్‌గంజ్‌లోని సత్తర్‌ఘాట్ ప్రాంతంలో వంతెనలో కొంత భాగం నదిలో కూలిపోయింది. దీని గురించి అధికారులను ప్రశ్నించగా.. ‘వంతెనను.. రహదారిని అనుసంధానిస్తూ నిర్మించిన కల్వర్టులు పెరుగుతున్న నీటి మట్టాన్ని తట్టుకోలేకపోయాయి. దాంతో వంతెన కూలిపోయింది’ అని సెలవిచ్చారు. (‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’) ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్.. ‘రూ. 263 కోట్లు ఖర్చు చేసి.. ఎనిమిదేళ్లు కష్టపడి నిర్మించిన బ్రిడ్జి కేవలం 29 రోజుల్లో కూలిపోయింది. ఈ అవినీతి గురించి భీష్మా పితామహుడు వంటి నితీష్ జీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బిహార్‌లో ప్రతి చోటా ఇలాంటి దోపిడి ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్ జిల్లాలను కలిపే సత్తర్‌ఘాట్ వంతెన పొడవు 1.4 కి.మీ. దీనిని జూన్ 16న ప్రజల రవాణా కోసం సీఎం ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణాన్ని ఎనిమిదేళ్ల క్రితం బీహార్ రాజ్య పుల్ నిర్మన్ నిగం లిమిటెడ్ ప్రారంభించింది. -
ఇటలీ: కుప్పకూలిన పురాతన వంతెన
-
నిడదవోలులో కూలిన తొంభై ఏళ్ల నాటి బ్రిడ్జి
-
చంబాలో కుప్పకూలిన బ్రిడ్జి
-
చంబాలో కుప్పకూలిన బ్రిడ్జి
చంబా : హిమాచల్ ప్రదేశ్ చంబాలో కాంక్రీట్ బ్రిడ్జి కూలి ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబా ప్రాంతాన్ని కలిపే ఈ వంతెన గురువారం కూలిపోవడంతో.. దానిపై ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జవహర్ లాల్ నెహ్రు మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుదేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...నిర్మించేటప్పుడు నాసిరకం మెటీరియల్ వాడడం వల్లే బ్రిడ్జి కూలిపోయినట్టు భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే బ్రిడ్జి నిర్మాణపు మ్యాప్‌లో లోపాలు కూడా ప్రమాదానికి కారణం కావచ్చని, దీనిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై కారు, మిని ట్రక్‌తో పాటు ద్విచక్ర వాహనం వెళుతున్నాయి, అయితే ఒక్కసారిగా బ్రిడ్జి కూలడంతో బైక్ నదిలో పడిపోతే, కారు, మిని ట్రక్ చిక్కుకు పోయాయి. కాగా 15 ఏళ్ల క్రితం నాబార్డు నిధుల కింద ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అలసత్వం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
కరీంనగర్లో భారీ వర్షం: కూలిన వంతెన
కరీంనగర్ : జిల్లాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లోని మెయిన్ డ్రైనేజీ కాలువపై ఉన్న బ్రిడ్జి కూలింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. డ్రైనేజీలో పరిమితికి మించి నీరు ప్రవహిస్తుండటంతో.. వంతెన కూలి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న వలసకూలీలు అప్రమత్తమవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. -
కూలిన బ్రిడ్జ్ : బస్సు, కార్లు గల్లంతు
ముంబై: మహారాష్ట్రలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో మహద్ వద్ద ముంబై - గోవా జాతీయ రహదారిపై బ్రిడ్జి కుప్పకూలింది. ఈ వరద ధాటికి నాలుగు బస్సులు, రెండు కార్లు గల్లంతయ్యాయి. అయితే సదరు బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి... సహాయక చర్యలు చేపట్టాయి. ముంబై - గోవా జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు.