
కరీంనగర్‌లో భారీ వర్షం: కూలిన వంతెన
కరీంనగర్ : జిల్లాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లోని మెయిన్ డ్రైనేజీ కాలువపై ఉన్న బ్రిడ్జి కూలింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
డ్రైనేజీలో పరిమితికి మించి నీరు ప్రవహిస్తుండటంతో.. వంతెన కూలి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న వలసకూలీలు అప్రమత్తమవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.