Balaji nagar
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కడప అర్బన్: నగరంలోని బాలాజీ నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచాల బాబు(43) తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బాలాజీ నగర్‌నుంచి ప్రధాన రోడ్డుపైకి వస్తున్న బాబును రామాంజనేయరెడ్డి అనే వ్యక్తి తన మోటార్ సైకిల్‌తో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాబును ఎర్రముక్కపల్లె ఎస్బీఐ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ డిఎస్పీ భక్తవత్సలం ఆదేశాల మేరకు ఎస్ఐ వెంకటేశ్ గాయపడ్డవ్యక్తిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. -
కరీంనగర్లో భారీ వర్షం: కూలిన వంతెన
కరీంనగర్ : జిల్లాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లోని మెయిన్ డ్రైనేజీ కాలువపై ఉన్న బ్రిడ్జి కూలింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. డ్రైనేజీలో పరిమితికి మించి నీరు ప్రవహిస్తుండటంతో.. వంతెన కూలి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న వలసకూలీలు అప్రమత్తమవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. -
వ్యభిచార కేంద్రంపై దాడి
నెల్లూరు(క్రైమ్) : బాలాజీనగర్ లక్ష్మీనగర్‌లో ఇళ్ల మధ్యలో ఉన్న ఓ వ్యభిచార కేంద్రంపై బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విడవలూరు మండలం పురిణికి చెందిన ఎస్కే భాను రెండునెలల కిందట ఆమె లక్ష్మీనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కొంత కాలంగా యువతులను తీసుకువచ్చి వ్యభిచార కేంద్రం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు ఇద్దరు సెక్స్ వర్కర్లు, మూలాపేటకు చెందిన పి. శివకుమార్, సంతపేటకు చెందిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
బాలాజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూటై ఇళ్లల్లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. ఈ సంఘటన కడప పట్టణంలోని బాలాజీనగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కాలనీలో నివాసముంటున్న వెంటక సుబ్బారెడ్డి ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో.. ఏసీ, ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్లతో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలిపోయింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న సుమారు 10 మంది ఇళ్లల్లో పనిచేస్తున్న మోటర్లు, టీవీలు, కంప్యూటర్లు కాలిపోయాయి. ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ. 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కాగా.. విద్యుత్ తీగల మధ్య గాలిపటం చిక్కుకోవడంతో దాన్ని తీయడానికి ప్రయత్నించడంతో.. రెండు వైర్లు ఒకదానితో ఒకటి తాకడం వల్లే ఇలా జరిగిందని కొందరు వాదిస్తున్నారు. -
పట్టపగలే భారీ చోరీ
పెద్ద వాల్తేర్ : విశాఖ నగరంలో పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సిరిపురం బాలాజీ నగర్‌లోని రైల్వే ఇంజనీర్ బి.శ్రీరామమూర్తి నివాసంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో దొంగలు ఇంటి తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంటి లోపల బీరువాలోని 35 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు. చోరీ సమయంలో శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు షాపింగ్‌కు వెళ్లారు. 1.30 గంటల సమయంలో వారు తిరిగి ఇంటికి రాగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు బద్దలు కొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరచి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీంతో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. -
తిరుమలలో నాగుపాము కలకలం
తిరుమల : తిరుమలలో ఓ పెద్ద నాగు పాము స్థానికులను పరుగులు తీయించింది. బాలాజీనగర్‌లోని ఐదో లైనులో ఓ ఇంటి సమీపంలో శనివారం ఆరడుగుల పొడవున్న నాగుపాము కనిపించింది. దీన్ని చూసిన మహిళలు, పిల్లలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న టీటీడీ ఉద్యోగి భాస్కరనాయుడు అక్కడకు చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకుని తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్సోత్సవాలు
కొడంగల్: కలియుగ వైకుంఠ దైవం.. ఆపదల మొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవారి బ్రహ్సోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కొడంగల్‌లోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతి సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు 11రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగాయి. బుధవారం ఉదయం పల్లకిసేవలో స్వామివారిని ఊరేగించారు. వరహాస్వామి ఆలయ ప్రాంగణంలో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు. సుందర వరద భట్టాచార్యులు, కంకణభట్టు లక్ష్మీకాంతాచార్యులు పలు కార్యక్రమాలు జరిపారు. ఉత్సవమూర్తులకు విశేషపూజలు చేశారు. అభిషేకం, దూపదీప నైవేద్యం సమర్పించారు. పవిత్రజలంతో నింపిన గుండంలో స్వామివార్లకు స్నానం చేయించారు. తిరుమల తిరుపతి నుంచి వచ్చిన సుమారు పాతిక మంది అర్చకులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దొంగలు ముఖాలకు ముసుగులు, మంకి టోపీలు ధరించి ఉన్నట్లు ప్రిన్సిపాల్ కుమార్తె హర్ష, కుమారుడు అభినందన్లు తెలిపారు. షాట్లు ధరించి పైన పంచతో గోచీలు పెట్టుకున్నట్లు, ఒంటికి నూనె రాసుకుని బట్టలు లేకుండా ఉన్నట్లు వివరించారు. తాము అల్లరి చేసే ప్రయత్నం చేస్తే తన 20 రోజుల కుమారుడిపై కత్తిపెట్టి బెదిరించారని హర్ష పేర్కొంది. అదే సమయంలో పోలీసులు సైరన్ ఇవ్వడంతో పారిపోయారని తెలిపింది. దీంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నారు. -
తూకం దగా
సాక్షి, నెల్లూరు: నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన నారాయణ ఏసీ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కిలో రూ.50తో రెండు కిలోల టమోటాలు కొన్నాడు. ఇంటికి వచ్చి కాటాలో పెట్టి చూడగా ఒకటిన్నర కిలో మాత్రమే ఉన్నాయి. తూకంలో అర కిలో తగ్గినట్టు గుర్తించాడు. అతను అక్షరాలా రూ.25 నష్టపోయాడు. వేదాయపాళేనికి చెందిన చెన్నారెడ్డి నగరంలోని డైకస్‌రోడ్డులోని చేపల మార్కెట్‌కు వెళ్లి రూ.300 చెల్లించి రెండు కిలోల చేపలు కొన్నాడు. ఇంటికి వచ్చి తూకం వేయగా ఒకటిన్నర కిలో మాత్రమే వచ్చాయి. అతను రూ.75 నష్టపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలోని 1.29 లక్షల కుటుంబాల వారే కాదు జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబీకులు నిత్యం నిత్యావసర సరుకులు కొంటూ కొలతల్లో మోసాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టం ఏ ఒక్కరోజుకో పరి మితం కాదు. ప్రతిరోజూ ప్రతి కుటుం బం తూనికలు కొలతల మోసాల బారిన పడుతోంది. తీవ్రంగా నష్టపోతోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రోజూ రూ.కోట్లలోనే వినియోగదారులు నష్టపోతున్నట్టు అంచనా. తూనికలు కొలతలశాఖ అధికారులు నామమాత్రపు స్పందనతో సరిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలను అరికట్టే దమ్ము అధికారులకు ఉందా అని జనం ప్రశ్నిస్తున్నారు. అక్రమాలకు అడ్డేలేదు: నగరంలో డైకస్‌రోడ్డు జలపుష్ప చేపలమార్కెట్, సంతపేట మార్కెట్, నగరం నడిబొడ్డున ఉన్న ఏసీ కూరగాయల మార్కెట్, స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధి మార్కెట్, ట్రంకురోడ్డు తదితర ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల తూకాలు, కూరగాయలు, చేపల తూకాలతో పాటు బాలాజీనగర్, ఆత్మకూరు బస్టాండ్, హరనాథపురం, ఫతేఖాన్‌పేట, పొదలకూరురోడ్డు పద్మావతి సెంటర్, వేదాయిపాళెం తదితర ప్రాంతాల్లోని తోపుడుబండ్ల వ్యాపారస్తులు సైతం తప్పుడు తూకాలతో వినియోగదారులను నిత్యం మోసగిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఒకవేళ వినియోగదారులు కాటాలో మోసాలు గుర్తించి నిలదీసినా వ్యాపారులు లెక్కచేయక బాధితులపైనే దౌర్జ్యన్యాలకు దిగుతున్న సందర్భాలనేకం. మోసాలు ఇలా? తూకాలకు ఎలక్ట్రానిక్ కాటాలు, బద్దకాటాలు, స్కేల్కాటాలుంటాయి. ఎలక్ట్రానిక్ కాటా వినియోగంలో టేర్ బటన్ కీలకం. వ్యాపారులు వినియోగదారులకు వస్తువులు కాటా వేసేటప్పుడు వస్తువులు ఉంచే గిన్నెను కాటాపై పెట్టి టేర్ బటన్ ప్రెస్ చేస్తే అది జీరో చూపిస్తుంది. ఆ తర్వాత వినియోగదారుడు వస్తువులు కాటా గిన్నెలో వేసే పనిపై దృష్టి పెడతాడు. ఆ సమయంలో వ్యాపారి తిరిగి టేర్ బటన్ ప్రెస్ చేస్తాడు. కాటాపై ఉంచిన గిన్నె బరువు కూడా తూకంలో కలిసి పోతుంది. వినియోగదారుడు కాటాపై ఉన్న గిన్నె బరువును బట్టి 200 నుంచి 300 గ్రాముల వరకూ నష్టపోతాడు. ఇక ఎలక్ట్రానిక్ మిషన్‌లో జీరో ఫిక్స్ చేసే విధానంలో సైతం అక్రమాలకు పాల్పడతారు. ఇక బద్దకాటా తూకం రాళ్లలో ప్రధానంగా మోసం జరుగుతోంది. కేజీ నుం చి 2కేజీల రాళ్లను వ్యాపారులు అధికంగా వినియోగిస్తారు. వ్యాపారులు ఈ రాళ్లను కిందభాగంలో పూర్తిగా మిషన్‌తో కట్ చేస్తున్నారు. దీంతో రెండుకేజీల రాయి కేవలం ఒకటిన్నర కేజీ మాత్రమే ఉంటుంది. వస్తువులు తూచే పల్లేనికి కింద ఇనుప ముక్కలు, చింతపండు సైతం అతికించి మోసాలకు పాల్పడుతున్న సందర్భాలున్నాయి. మొత్తంగా అటు ఎలక్ట్రానిక్ కాటాల్లోనూ, ఇటు రాళ్ల కాటాలతోనూ విని యోగదారులను వ్యాపారులు వంచిస్తున్నారు. నిత్యం ఇదే జరుగుతోంది. పాటించాల్సిన నిబంధనలు: ప్రతికాటాపైనా తూనికలు కొలతల శాఖ అధికారుల స్టాంప్ ఉండాలి. ప్రతి ఏడాదికొకసారి దీనిని రెన్యువల్ చేయించుకోవాలి. కాటా రాళ్లను ప్రతి రెండేళ్లకొకసారి తూకం వేయించుకుని పెట్టుకోవాలి. బంగారు షాపుల్లో అయితే ఏడాదికొకసారి కాటాలపై స్టాంప్ వేయించుకోవాలి. ఇవేవీ సక్రమంగా జరగడంలేదు. నూటికి 50 శాతం మంది వ్యాపారులు కూడా నిబంధనలు పాటించడంలేదు. ప్యాకింగ్ వస్తువుల నిబంధనలు: ప్యాకేజీ నిబంధనల చట్టం 2011, తూనికలు,కొలతల చట్టం 2009 నిబంధనలను వ్యాపారులు అనుసరించాలి. ప్రతి వస్తువుపై ఎంఆర్పీ రేట్ ముద్రించి ఉండాలి. తయారీ తేదీ ఉండాలి. కంపెనీ వివరాలు పిన్‌కోడ్‌తో సహా ముద్రించాలి. నికర బరువు ముద్రించి ఉండాలి. కస్టమర్ కేర్ నంబర్ ఉండాలి. పట్టించుకోని అధికారులు: అక్రమాలు నిత్యం జరుగుతున్నా అధికారులు ఏ నెలకో,రెండు నెలలకో మొక్కుబడి తనిఖీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. దీంతో వ్యాపారులు తమ అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు చేపల మార్కెట్లో అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించి పదినిమిషాల్లోనే 15 ఎలక్ట్రానిక్ కాటాలను, 50 తప్పుడు తూకం రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. 21 షాపులను సీజ్ చేశారు. దీన్ని బట్టిచూస్తే అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. నిత్యం దాడులు నిర్వహించడంతోపాటు అక్రమ వ్యాపారులను కఠినంగా శిక్షిస్తే తప్ప దోపిడీ ఆగే పరిస్థితి కనిపించడంలేదు.