కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూటై ఇళ్లల్లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. ఈ సంఘటన కడప పట్టణంలోని బాలాజీనగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కాలనీలో నివాసముంటున్న వెంటక సుబ్బారెడ్డి ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో.. ఏసీ, ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్‌లతో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలిపోయింది.
ఇదే సమయంలో పక్కనే ఉన్న సుమారు 10 మంది ఇళ్లల్లో పనిచేస్తున్న మోటర్లు, టీవీలు, కంప్యూటర్లు కాలిపోయాయి. ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ. 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కాగా.. విద్యుత్ తీగల మధ్య గాలిపటం చిక్కుకోవడంతో దాన్ని తీయడానికి ప్రయత్నించడంతో.. రెండు వైర్లు ఒకదానితో ఒకటి తాకడం వల్లే ఇలా జరిగిందని కొందరు వాదిస్తున్నారు.
బాలాజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
Published Sun, Dec 6 2015 11:25 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement