బాలాజీనగర్ లక్ష్మీనగర్‌లో ఇళ్ల మధ్యలో ఉన్న ఓ వ్యభిచార కేంద్రంపై బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు.
నెల్లూరు(క్రైమ్) : బాలాజీనగర్ లక్ష్మీనగర్‌లో ఇళ్ల మధ్యలో ఉన్న ఓ వ్యభిచార కేంద్రంపై బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విడవలూరు మండలం పురిణికి చెందిన ఎస్‌కే భాను రెండునెలల కిందట ఆమె లక్ష్మీనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది.
కొంత కాలంగా యువతులను తీసుకువచ్చి వ్యభిచార కేంద్రం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు ఇద్దరు సెక్స్ వర్కర్లు, మూలాపేటకు చెందిన పి. శివకుమార్, సంతపేటకు చెందిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.