కూలిన బ్రిడ్జ్‌ : బస్సు, కార్లు గల్లంతు | Bridge On Mumbai-Goa Highway Collapses After Heavy Rain | Sakshi
Sakshi News home page

కూలిన బ్రిడ్జ్‌ : బస్సు, కార్లు గల్లంతు

Published Wed, Aug 3 2016 8:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

కూలిన బ్రిడ్జ్‌ : బస్సు, కార్లు గల్లంతు

కూలిన బ్రిడ్జ్‌ : బస్సు, కార్లు గల్లంతు

ముంబై: మహారాష్ట్రలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో మహద్ వద్ద ముంబై - గోవా జాతీయ రహదారిపై బ్రిడ్జి కుప్పకూలింది. ఈ వరద ధాటికి నాలుగు బస్సులు, రెండు కార్లు గల్లంతయ్యాయి.  అయితే సదరు బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి... సహాయక చర్యలు చేపట్టాయి. ముంబై - గోవా జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement