చెన్నై: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ Mi-17V-5 తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్, కుమార్తె, సిబ్బందితో కలిపి మొత్తం 14 మందితో తమిళనాడులోని సలూన్ నుంచి వెల్లింగ్టన్‌కు వెళ్తుండగా నీలగిరి కొండల్లోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ నుంచి భారీగా మంటలు చెలరేగి కాలిబూడిదైంది.
సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని భారత వాయుసేన విభాగం ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.
చదవండి: హెలికాప్టర్ నుంచి మృతదేహాలు పడటం కళ్లారా చూశా: ప్రత్యక్ష సాక్షి
బిపిన్ రావత్ షెడ్యూల్ ఇలా..
వెల్లింగ్టన్‌లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ఆర్మీ అధికారిక కార్యక్రమంలో మధ్యాహ్నం 2:40 గంటలకు రావత్ మాట్లాడాల్సి ఉంది.
హెలికాప్టర్‌లో ప్రయాణించిన వారి వివరాలు..
1. బిపిన్ రావత్
2.మధులిక రావత్
3. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్
4. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్
5. ఎన్‌కే గురు సేవక్ సింగ్
6. ఎన్‌కే జీతేంద్రకుమార్
7. లాన్స్ నాయక్ వివేక్ కుమార్
8. లాన్స్ నాయక్ సాయి తేజ
9. హవల్దార్ సత్పాల్.. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper.
— ANI (@ANI) December 8, 2021
(Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J
Comments
Please login to add a commentAdd a comment