చెన్నై: తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలి, తీవ్ర విషాదాన్ని మిగిలి్చన ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. సాంకేతికంగా అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్‌గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఇదే అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్ నుంచే అభివృద్ధి చేశారు. ఎంఐ–8 ఎయిర్ ఫ్రేమ్‌పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌లో ఉపయోగిస్తున్నారు.
MI 17 V5 హెలికాప్టర్ అన్నింటిలో టాప్
ఎయిర్‌క్రాఫ్ట్ రకం
సైనిక రవాణా హెలికాప్టర్. సైనిక ఆపరేషన్లు, ప్రకృతి విపత్తుల్లోనూ సేవలందించగలదు.
డిజైన్ చేసిందెవరు?
రష్యాలోని మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్
రూపొందించింది?
రష్యా హెలికాప్టర్ల సంస్థకు అనుబంధ సంస్థ కజాన్
ఉత్పత్తి నుంచి భారత్‌కు చేరిందిలా
► 1975లో తొలి ఎంఐ–17 హెలికాప్టర్ తయారీ ఎగుమతికి ఉద్దేశించిన హెలికాప్టర్లను ఎంఐ–17గా వ్యవహరిస్తారు. రష్యా సైనిక దళాలు మాత్రం వీటిని ఎంఐ–8ఎంటీ హెలికాప్టర్లుగా పిలుస్తాయి.
► 2008 ఎంఐ–17వీ5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
► 2011 భారత వైమానిక దళానికి అందజేత ప్రారంభం. 2012 నుండి సేవలు.
చదవండి: హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంట్‌లో ప్రకటన
ముఖ్యాంశాలు..
► ఎంఐ–17వీ5.. హెలికాప్టర్ ప్రపంచంలో అత్యాధునిక రవాణా హెలికాప్టర్. సరుకులు, ఆయుధాల రవాణా కోసం డిజైన్ చేశారు.
► సైనికులను కూడా చేరవేయవచ్చు. అగ్ని మాపక సిబ్బందికి సాయపడుతుంది. కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్‌కు, గాలింపునకు, సహాయక చర్యల్లోనూ
సేవలందిస్తాయి.
► ప్రపంచవ్యాప్తంగా ఈ హెలికాప్టర్లను 60 దేశాలు వినియోగిస్తున్నాయి.
చదవండి: ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్‌లో ప్రమాణించింది వీరే..
MI 17 V5 ప్రత్యేకతలు
► ఎంఐ–17వీ5 మధ్యశ్రేణి హెలికాప్టర్‌లో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించే రాడార్, రాత్రిపూట సైతం వీక్షించే పరికరాలు ఉన్నాయి.
► గరిష్టంగా 13,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఎక్కడా ఆగకుండా 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
► 36 మంది సైనికులను లేదా 4,000 కిలోల పేలోడును తరలించగలదు.
► రాత్రి, పగలు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట కూడా ల్యాండింగ్ చేయొచ్చు.
► గత పదేళ్లలో ఐఎం–17వీ5 హెలికాప్టర్లు కొన్ని ప్రమాదాలకు గురయ్యాయి.
► కొన్ని రోజుల క్రితం తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఇద్దరు పైలట్లు, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
► 2018 ఏప్రిల్ 3న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కూలిపోయింది. ఇందులోని ఆరుగురు ప్రాణాలతో తప్పించుకోగలిగారు.
► 2017 అక్టోబర్ 7న చైనా సరిహద్దు వైపు వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో నేలకూలింది. మొత్తం ఏడుగురు మృతిచెందారు.
► 2013 జూన్ 15న ఉత్తరాఖండ్‌లో వరద సహాయక చర్యల్లో పాల్గొని కేదార్‌నాథ్ నుంచి తిరిగి వస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు.
► 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు ఎంఐ–17వీ5 హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి.
9 మంది వైమానిక దళం
జవాన్లు మరణించారు.
చదవండి: బిపిన్‌రావత్ ఇంటికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment