helicopter incident
-
ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. అందులో ఒకటి..!
బ్రిస్బెన్: ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్న సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ హెలికాప్టర్‌లోని ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడి సురక్షితంగా ల్యాండింగ్ అవడంతో పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొంది. రాజధాని బ్రిస్బెన్కు 45 కిలోమీటర్ల దూరంలోని గోల్డ్‌కోస్ట్ బీచ్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీకొట్టుకున్నట్లు మీడియా తెలిపింది. ఆ ప్రాంతం అత్యంత ప్రజాదరణ పొందిన పర్యటక ప్రాంతంగా ఉంది. ఆస్ట్రేలియాలో సెలవు దినాలు కావడంతో జనవరిలో భారీగా జనం తరలి వస్తారు. ప్రమాదం జరిగిన క్రమంలో బీచ్‌లోని సీ-వరల్డ్ డ్రైవ్‌ను మూసివేశారు అధికారులు. వైద్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీసు తెలిపింది. #BREAKING: Emergency services are responding after a helicopter crash on the Gold Coast Broadwater at Southport. Three people are believed dead, with two more seriously injured. More details to come. #9News pic.twitter.com/Mmtw1ENscL — 9News Gold Coast (@9NewsGoldCoast) January 2, 2023 ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణించింది వీరే..
చెన్నై: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ Mi-17V-5 తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్, కుమార్తె, సిబ్బందితో కలిపి మొత్తం 14 మందితో తమిళనాడులోని సలూన్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా నీలగిరి కొండల్లోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ నుంచి భారీగా మంటలు చెలరేగి కాలిబూడిదైంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని భారత వాయుసేన విభాగం ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. చదవండి: హెలికాప్టర్ నుంచి మృతదేహాలు పడటం కళ్లారా చూశా: ప్రత్యక్ష సాక్షి బిపిన్ రావత్ షెడ్యూల్ ఇలా.. వెల్లింగ్టన్లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ఆర్మీ అధికారిక కార్యక్రమంలో మధ్యాహ్నం 2:40 గంటలకు రావత్ మాట్లాడాల్సి ఉంది. హెలికాప్టర్లో ప్రయాణించిన వారి వివరాలు.. 1. బిపిన్ రావత్ 2.మధులిక రావత్ 3. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ 4. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ 5. ఎన్కే గురు సేవక్ సింగ్ 6. ఎన్కే జీతేంద్రకుమార్ 7. లాన్స్ నాయక్ వివేక్ కుమార్ 8. లాన్స్ నాయక్ సాయి తేజ 9. హవల్దార్ సత్పాల్.. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. #WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper. (Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J — ANI (@ANI) December 8, 2021 -
కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. సిద్ధారామయ్య బెంగళూరు నుంచి మైసూరు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆయనతో పాటు హెలికాప్టర్లో పౌరసరఫరాల మంత్రితో పాటు అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.