కాబుల్: నాటో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్లో చోటు చేసుకుంది. నాటోకు చెందిన రిసొల్యూట్ సపోర్ట్ మిషన్లో భాగంగా బయలు దేరిన హెలికాప్టర్ సోమవారం ఉదయం కుప్పకూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇందులో ఉన్న ఐదుగురు మృత్యువాతపడ్డారని వారు వివరించారు.