![కూలిన హెలికాప్టర్ : 17 మంది మృతి](/styles/webp/s3/article_images/2017/09/3/51438851290_625x300.jpg.webp?itok=WNuEVEf2)
కూలిన హెలికాప్టర్ : 17 మంది మృతి
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ జబుల్ ప్రావిన్స్లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారని కమాండర్ జనరల్ అబ్దుల్ రజాక్ సిర్జాయి కాబూల్లో వెల్లడించారు. మృతుల్లో 12 మంది సైనికులు, ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.