వాషింగ్టన్ : అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ఉగ్రవాదులతో శాంతి చర్చలకై అమెరికా ముందుకొచ్చింది. పెంటగాన్ ప్లాన్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌లో ఉన్నా అమెరికా సైనిక బలగాలన్నింటినీ 2024 వరకు వెనక్కు రప్పిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో తాలిబన్ వేర్పాటువాదులతో చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది.పెంటగాన్ ప్లాన్‌ని అటు అమెరికా, ఇటు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) స్వాగతించాయి. ప్రస్తుతం అమెరికాలో 14 వేల అమెరికన్ బలగాలు, 8600 నాటో బలగాలు ఉన్నాయి. అమెరికా బలగాల్లో సగం వరకు కొద్ది నెలల్లో వెనక్కు రానున్నాయని తెలిపింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇక అఫ్గాన్‌లో ఉన్న 8,600 మంది నాటో సేనలతో ఉగ్ర కార్యకలాపాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అక్కడి మిలటరీకి ట్రెయినింగ్ ఇప్పించనున్నారు. (తాలిబన్ల గురువు మౌలానా హక్ దారుణ హత్య)
తాలిబన్‌లతో శాంతి చర్చలు ప్రతిపాదన దశలోనే ఉన్నాయని పెంటగాన్ అధికార ప్రతినిధి కోన్ ఫాల్కనర్ చెప్తుండగా.. సేనల్ని ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించడం గమనార్హం. ఇదిలాఉండగా.. ఇరు పక్షాల మధ్య ఖతార్ రాజధాని దోహాలో సోమవారం నుంచి అయిదో దఫా చర్చలు జరుగనున్నాయని జింగ్వా వార్తా సంస్థ తెలిపింది. అఫ్గాన్‌లోని అమెరికా రిప్రజంటేటివ్ జాల్మే ఖలీజాబాద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికా, అఫ్గాన్-తాలిబన్ చర్చలు మంచి ఫలితాలనిస్తాయి’ అన్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌పై తాలిబన్ అల్‌ఖైదా తీవ్రవాదులు 2001 సెప్టెంబర్ 11 విమానాలతో దాడిచేశారు. దాంతో అఫ్గాన్ ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. దక్షిణాసియా దేశమైన అఫ్గాన్‌లో సైనిక బలగాలు మోహరించింది. ఇదిలాఉండగా..తాలిబన్ ఉగ్రవాద సంస్థ దాడుల్లో ఇప్పటివరకు 2,400 మంది సైనికులు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment