
రెండు హెలికాప్టర్లు ఢీ: 10 మంది మృతి
పాపులర్ ఫ్రెంచ్ రియాలిటీ టీవీ షో ‘డ్రాప్డ్’ షూటింగ్ కోసం ఫ్రెంచ్ క్రీడాకారులను తీసుకెళుతున్న రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలిపోవడంతో ఇద్దరు ఒలింపిక్ మెడల్ విజేతలు, ఓ సెయిలింగ్ ఛాంపియన్ సహా పదిమంది దుర్మరణం చెందారు. నగరానికి దాదాపు 1150 కిలోమీటర్ల దూరంలోని రియోజా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అర్జెంటీనా పైలట్లు, 8 మంది ఫ్రెంచ్ దేశీయులు అక్కడికక్కడే మరణించారు. గగనతలంలో పొరపాటున రెండు హెలికాప్టర్లు కూలిపోయి ఉండవచ్చని శకలాలను పరిశీలించిన అర్జెంటీనా అధికారులు తెలిపారు. మృతుల్లో స్విమ్మింగ్‌లో ఒలింపిక్ గోల్డ్‌మెడల్ విజేత కమిల్లే మఫత్, బాక్సింగ్‌లో ఒలింపిక్ మెడల్ విజేత బాక్సర్ అలెక్సీ వస్టైన్, సెయిలింగ్ ఛాంపియన్ ఫ్లోరెన్స్ ఆర్థాడ్ ఉన్నారు.