Army Trainer Aircraft Crashes Near Gaya In Bihar, Both Trainee Pilots Safe - Sakshi
Sakshi News home page

Aircraft Crashes: కుప్పకూలిన ఆర్మీ ట్రైనర్​ హెలికాప్టర్​

Published Fri, Jan 28 2022 5:20 PM | Last Updated on Fri, Jan 28 2022 7:31 PM

Army Trainer Aircraft Crashes Near Gaya Occupants Safe - Sakshi

న్యూఢిల్లీ: ఆర్మీ ట్రైనర్​ ఎయిర్​క్రాఫ్ట్​ క్రాష్​కు గురవటం కలకలంగా మారింది.  ఈ ప్రమాదం బిహార్​లోని బోధ్ ​గయా బ్లాక్​లో చోటు చేసుకుంది. కాగా, ఇండియన్​ ఆర్మీ ఆఫీసర్స్​.. ట్రైనింగ్​లో భాగంగా ఇద్దరు ట్రైనీలకు ఎయిర్​క్రాఫ్ట్​లో శిక్షణ నిస్తుంది. దీనిలో భాగంగా వీరు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్​ గయా సమీపంలో కుప్పకూలింది. ట్రైనీ ఉద్యోగులు.. హెలికాప్టర్​ టెకాఫ్​కు ప్రయత్నించిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది.

ఈ క్రమంలో.. హెలికాప్టర్​ అక్కడే ఉన్న పొలాల్లో దూసుకుపోయిందని సీనియర్ అధికారి తెలిపారు. కాగా, హెలికాప్టర్​​ కిందపడటాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే సంఘటన స్థలానికి పరుగున వెళ్లి చేరుకున్నారు. హెలికాప్టర్ చిక్కుకున్న​ వారిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రైనీలకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని ఆర్మీ సిబ్బంది తెలిపారు. హెలికాప్టర్​ క్రాష్​కు గల కారణాలపై విచారణ చేపట్టామని తెలిపారు. 

చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement