కెన్యాలో హెలికాప్టర్‌ కూలి 17 మంది సైనికులు మృతి | 17 soldiers killed in helicopter crash near Nairobi | Sakshi
Sakshi News home page

కెన్యాలో హెలికాప్టర్‌ కూలి 17 మంది సైనికులు మృతి

Published Fri, Jun 25 2021 2:56 AM | Last Updated on Fri, Jun 25 2021 2:56 AM

17 soldiers killed in helicopter crash near Nairobi - Sakshi

నైరోబి: కెన్యాలో ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలిన ఘటనలో 17 మంది సైనికులు చనిపోయారు. గురువారం ఉదయం 23 మంది సైనికులతో బయలుదేరిన సైనిక హెలికాప్టర్‌ కజియాడో కౌంటీలోని ఒలె– తెపెసి వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృత్యువాతపడగా తీవ్రంగా గాయాల పాలైన ఆరుగురిని ఆస్పత్రికి తరలిం చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. హెలికాప్టర్‌ కూలిన విషయాన్ని కెన్యా సైన్యం కూడా ధ్రువీకరించింది. వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement