
ఇథియోపియా : అదిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి వెళుతున్న ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలింది. ఆదివారం ఉదయం నైరోబీకి బయలుదేరిన ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలిందని ఇథియోపియా ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణీకులకు ఇథియోపియా ప్రధాని కార్యాలయం ప్రభుత్వం, ప్రజల తరపున తీవ్ర సంతాపం తెలుపుతోందని ప్రధాని అబివ్ అహ్మద్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా, నైరోబీకి వెళుతున్న బోయింగ్ 737 విమానం బిషోపు వద్ద కుప్పకూలిందని, ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 157 మంది ప్రయాణీకులు, సిబ్బంది అందరూ మరణించారని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ నిర్ధారించింది.
Comments
Please login to add a commentAdd a comment