
కాలనీలో కూలిన హెలికాప్టర్
న్యూఢిల్లీ: ముంబయిలో హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. ఓ కాలనీపై రాబిన్ సన్ ఆర్ 44 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. నగరంలోని గోరేగావ్ లోని ఆరే కాలనీపై చాపర్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో పైలెట్ తోపాటు ఐదుగురు ప్రయాణీకులు ఉన్నారు. చాపర్ కూలిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలి వద్దకు రెండు అగ్ని మాపక వాహనాలు వెళ్లి మంటలు ఆర్పుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.