
ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ 110సీసీ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలను భారీగా పెంచింది. ఈ స్కూటర్ ఐదు వేరియెంట్లలో లభిస్తుంది. కనిష్ఠంగా రూ.736 పెంచితే, గరిష్టంగా రూ.2,336 పెంచింది. షీట్ మెటల్ వీల్ వేరియెంట్ స్కూటర్ కొత్త ధర ఇప్పుడు ₹65,673, స్టాండర్డ్ మోడల్ స్కూటర్ ధర ₹67,398(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. జడ్ ఎక్స్ డ్రమ్, జడ్ఎక్స్ డిస్క్ ట్రిమ్ స్కూటర్ ధరలు వరుసగా ₹71,973, ₹75,773గా ఉన్నాయి. అయితే, క్లాసిక్ మోడల్ స్కూటర్ ధర ఇప్పుడు ₹75,743గా ఉంది. జూపిటర్ మోడల్ స్కూటర్ కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
TVS Jupiter variant | Revised price |
Sheet metal wheel variant | ₹65,673 |
Standard Variant | ₹67,398 |
ZX Drum | ₹71,973 |
ZX Disc | ₹75,743 |
Classic Variant | ₹75,743 |
టీవీఎస్ జూపిటర్ 109.7సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 7.37బిహెచ్ పీ పవర్, 8.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ స్కూటర్ ఎకోత్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఈటి-ఫై) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల 15 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ జూపిటర్ లో డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. స్కూటర్లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, మొబైల్ ఛార్జర్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇన్ టెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది.