ఏడు సంవత్సరాలు.. 67 లక్షల సేల్స్: దూసుకెళ్లిన జుపీటర్ | TVS Jupiter 67 Lakh Sales | Sakshi
Sakshi News home page

ఏడు సంవత్సరాలు.. 67 లక్షల సేల్స్: దూసుకెళ్లిన జుపీటర్

Published Tue, Aug 27 2024 8:52 PM | Last Updated on Wed, Aug 28 2024 9:47 AM

TVS Jupiter 67 Lakh Sales

స్కూటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టీవీఎస్ జుపీటర్.. 2013 సెప్టెంబర్ నుంచి జులై 2024 వరకు 67,39,254 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో 110 సీసీ మోడల్, 125 సీసీ మోడల్ రెండూ ఉన్నాయి.

2024 ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ జుపీటర్ సేల్స్ 8,44,863 యూనిట్లు. హోండా యాక్టివాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటూనే మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్షిస్తోంది. జుపీటర్ ప్రారంభమైన మొదటి రెండు సంవత్సరాల్లో 5 లక్షల స్కూటర్లు మాత్రమే సేల్ అయ్యాయి.

2021 ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల జుపీటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2022 నాటికి 50 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం మీద జుపీటర్ అత్యుత్తమ అమ్మకాలను పొందగలిగింది. ఈ స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement