న్యూఢిల్లీ: బీమా రంగంలో ఉన్న శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 9.99 శాతం వాటాను ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం కేకేఆర్ చేజిక్కించుకుంటోంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌ను శ్రీరామ్ గ్రూప్, ఆఫ్రికాకు చెందిన ఫైనాన్షియల్ సేవల కంపెనీ సన్‌లామ్ ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మేరకు మూడు సంస్థల మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదిరింది.
అంతర్జాతీయంగా బీమా రంగంలో కేకేఆర్‌కు ఉన్న నైపుణ్యం నుం చి ప్రయోజనం పొందేలా చూస్తున్నామని.. భారతీయ కంపెనీలను తదుపరి స్థాయికి తీసుకెళ్లే అనుభవం ఆ సంస్థకు ఉందని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనిల్‌కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలిపారు. 2009 నుంచి ఇప్పటివరకు భారత్‌లో కేకేఆర్ 20కి పైగా పెట్టుబడులు చేసింది. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఉన్నాయి.
చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల మెగా విలీనం... ఆర్థికమంత్రితో ‘హెచ్‌డీఎఫ్‌సీ’ చీఫ్‌ల భేటీ
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో కేకేఆర్
Published Tue, Apr 12 2022 7:59 AM | Last Updated on Tue, Apr 12 2022 8:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment