ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ael) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్రైన్‌మ్యాన్ సంస్థను కొనుగోలు చేసింది. సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇదే అంశంపై స్పష్టత ఇచ్చింది.
ఏఈఎల్‌కి చెందిన అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. స్టార్క్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఈపీఎల్) 100 శాతం స్టేక్ కొనుగోలు చేసిందని.. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు వెల్లడించింది. అయితే, ఎంత మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందనే ఆర్ధిక పరమైన అంశాల గురించి ప్రస్తావించలేదు.
ఉత్తరాఖండ్ ఐఐటీ - రూర్కీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వినీత్ చిరానియా, కరణ్‌కుమార్‌లు గురుగావ్ కేంద్రంగా ఐఆర్‌సీటీసీ గుర్తింపుతో ట్రైన్ టికెట్ సేవల్ని అందించేలా ఎస్‌ఈపీఎల్‌ను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ట్రైన్‌మ్యాన్ యాప్ ప్రయాణికులు సులభంగా ట్రైన్ టికెట్‌లతో పాటు ఇతర సౌకర్యాల్ని అందిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థనే అదానీ గ్రూప్‌ను సొంతం చేసుకుంది.
ఇటీవల, ఎస్‌ఈపీఎల్ కార్యకలాపాల నిమిత్తం 1 మిలియన్ డాలర్లను అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. ఇక, పెట్టుబడి పెట్టిన సంస్థల్లో గుడ్‌వాటర్ కేపిటల్, హెమ్ ఏంజెల్స్ వంటి సంస్థలున్నాయి. ఈ క్రమంలో రైల్వే సేవల్ని అందించే స్టార్టప్‌ను అదానీ గ్రూప్ కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది.
చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా?
Comments
Please login to add a commentAdd a comment