న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ ఇండియా.. యూఎస్ షేల్ చమురు వెంచర్‌లో 20 శాతం వాటా విక్రయించింది. డీల్ విలువ 2.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 187 కోట్లు)కాగా.. తద్వారా వెంచర్ నుంచి బయటపడింది. యూఎస్‌లోని సొంత అనుబంధ సంస్థ ద్వారా నియోబారా షేల్ ఆస్తిలోగల పూర్తివాటాను విక్రయించినట్లు ఆయిల్ ఇండియా వెల్లడించింది. వెరసి గత రెండు నెలల్లో యూఎస్ షేల్ బిజినెస్ నుంచి రెండో దేశీ సంస్థ గుడ్‌బై చెప్పింది.
గతేడాది నవంబర్‌లో టెక్సాస్‌లోని ఈగల్‌ఫోర్డ్ షేల్ ఆస్తుల నుంచి వైదొలగేందుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. కాగా.. నియోబారా షేల్ ఆస్తిలో మరో పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)తో కలిసి 2012 అక్టోబర్‌లో ఆయిల్ ఇండియా 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను క్యారిజో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నుంచి 8.25 కోట్ల డాలర్లకు సొంతం చేసుకుంది. దీనిలో ఆయిల్ ఇండియా వాటా 20 శాతంకాగా.. ఐవోసీ 10 శాతం వాటా తీసుకుంది. ఈ వెంచర్ నిర్వాహక సంస్థ వెర్డాడ్ రీసోర్సెస్‌కు ఆయిల్ ఇండియా వాటాను విక్రయించింది. యూఎస్ వెంచర్ నుంచి ఔట్
Comments
Please login to add a commentAdd a comment