oil india
-
కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లు
ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2040 నాటికి తన ఉత్పత్తుల తయారీలో ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా ప్రయత్నాలు చేపట్టింది. అందుకోసం రూ.25,000 కోట్ల పెట్టుబడితో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ రంజిత్ రాత్ తెలిపారు.ఈ సందర్భంగా రంజిత్ రాత్ మాట్లాడుతూ..‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలున్నాయి. దాంతో నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేశాం. 2025-26 నాటికి ఇది 90 లక్షల టన్నులకు చేరుతుంది. అస్సాంలోని రవాణా, పరిశ్రమలకు ఉపయోగపడే ద్రవ ఇంధనాల స్థానంలో సహజ వాయువులు వాడేందుకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 80 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అస్సాంలో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో మరో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు పెంపు..?ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అన్ని విభాగాల్లో 2046 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారైన ఓఎన్జీసీ 2038 నాటికి అదే లక్ష్యాన్ని సాధించడానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), గెయిల్ ఇండియా లిమిటెడ్ తమ కార్యకలాపాల్లో నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించడానికి 2040 లక్ష్యంగా పెట్టుకున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 2046 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. -
2040కల్లా కర్బనరహితం
న్యూఢిల్లీ: పూర్తికర్బనరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు చమురు రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ ఇండియా తాజాగా పేర్కొంది. 2040కల్లా కర్బన ఉద్గారాల నెట్‌జీరో కంపెనీగా నిలిచేందుకు రూ. 25,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా గ్యాస్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక విద్యుదుత్పాదనకు తెరతీడం, గ్రీన్ హైడ్రోజన్, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ రంజిత్ రథ్ వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సామ్కు సహజవాయు సరఫరాకుగాను 80 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. తద్వారా లిక్విడ్ ఇంధనాల రవాణా కాలుష్యానికి చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ముడిచమురు రవాణాకు ఏర్పాటు చేసిన కొన్ని పైప్లైన్లను గ్యాస్ పంపిణీకి అనువుగా మార్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులు ఇలా నెట్‌జీరో పెట్టుబడుల్లో రూ. 9,000 కోట్లను 1,800 మెగావాట్ల సోలార్, ఆన్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించనుండగా.. మరో రూ. 3,000 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుపై వెచి్చంచనున్నట్లు రంజిత్ తెలియజేశారు. ఈ బాటలో రూ. 1,000 కోట్లు కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్, స్టోరేజీ(సీసీయూఎస్) ప్రాజెక్టులకు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కంపెనీ అస్సామ్‌లో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ప్రణాళికలు వేసింది. వెరసి నెట్‌జీరో లక్ష్యాన్ని ముందుగానే అంటే 2038కల్లా సాధించాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. -
రూ.5,000 కోట్లతో రష్యా చమురు కొనుగోలు
న్యూఢిల్లీ: రష్యా వద్ద నిలిచిపోయిన 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5వేల కోట్లు) డివిడెండ్‌తో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఉన్నాయి. రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన డివిడెండ్ ఆదాయం ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ విదేశ్ రావాల్సి ఉంది. రష్యా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం ఉండిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పశి్చమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత చమురు సంస్థలు రష్యా బ్యాంకుల నుంచి డివిడెండ్ నిధులను తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో న్యాయపరమైన, ఆర్థిక పరమైన చిక్కుల గురించి అధ్యయనం చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రష్యాలోని ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో భారత కంపెనీలు 5.46 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఆయా క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్ విక్రయంపై వచ్చే లాభాల నుంచి తమ వంతు వాటా వీటికి వస్తుంటుంది. రష్యాపై ఆంక్షల తర్వాత అక్కడి నుంచి నిధుల బదిలీకి అవకాశం లేకుండా పోయింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్ పెట్టేందుకు తమ దేశం నుంచి డాలర్లను వెనక్కి తీసుకెళ్లే విషయంలో రష్యా ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణం. రష్యా బ్యాంకుల్లోని ఖాతాల్లో తమకు రావాల్సిన 150 మిలియన్ డాలర్ల డివిడెండ్ ఆదాయం చిక్కుకుపోయినట్టు ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, ఎండీ రంజిత్ రథ్ తెలిపారు. ఐవోసీ, భారత్ పెట్రో రీసోర్సెస్‌తో కలిపితే రావాల్సిన డివిడెండ్ 450 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు. -
ఆయిల్ ఇండియా లాభం రికార్డ్.. షేరుకి రూ.10 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 1,746 కోట్లను అధిగమించింది. ఒక త్రైమాసికంలో ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,245 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ఉత్పత్తి సహా చమురు, గ్యాస్ విక్రయ ధరలు పుంజుకోవడం సహకరించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇప్పటికే రూ. 4.5 చెల్లించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ ప్రతీ బ్యారల్ చమురుకు 88.33 డాలర్ల ధరను పొందింది. గత క్యూ3లో 78.59 డాలర్ల ధర లభించింది. ఇక నేచురల్ గ్యాస్ ఒక్కో బీటీయూకి 8.57 డాలర్ల చొప్పున అందుకుంది. గత క్యూ3లో గ్యాస్ విక్రయ ధర 6.1 డాలర్లుగా నమోదైంది. చమురు ఉత్పత్తి 0.75 మిలియన్ టన్నుల నుంచి 0.81 ఎంటీకి ఎగసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 0.79 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 0.8 బీసీఎంకు పుంజుకుంది. చమురు విక్రయాలు 1.35 ఎంటీ నుంచి 1.41 ఎంటీకి వృద్ధి చూపాయి. మొత్తం టర్నోవర్ 27 శాతం పురోగమించి రూ. 5,982 కోట్లను తాకింది. -
సహజ వాయువు ధరపై నియంత్రణలు
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ధరలు అసాధారంగా పెరిగిపోకుండా కిరీట్ పారిఖ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. లెగసీ క్షేత్రాల నుంచి (నామినేషన్‌పై ప్రభుత్వం కేటాయించిన) ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలకు కనిష్ట, గరిష్ట పరిమితులను సూచించింది. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సహజ వాయువులో రెండొంతులపై (పాత క్షేత్రాల నుంచి) కచ్చితమైన ధరల విధానం ఉంటుందని అభిప్రాయపడింది. తయారీ సంస్థలకు ధరలపై స్పష్టత ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఈ తరహా క్షేత్రాలను నిర్వహిస్తున్నాయి. కేజీ డీ6 తదితర రిలయన్స్, బీపీ ఇతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటికి ఈ ధరల పరిమితి వర్తించదు. తాజా సూచనలతో 70 శాతం మేర పెరిగిపోయిన ధరలు కొంత దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నామినేషన్‌పై ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు, దిగుమతి చేసుకునే గ్యాస్ ధరనే చెల్లించాలని సిఫారసు చేసింది. అంతేకానీ, అంతర్జాతీయ ధరలను చెల్లించొద్దని సూచించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కు కనీసం 4 డాలర్లు, గరిష్టంగా 6.5 డాలర్ల చొప్పున పరిమితులు సూచించింది. దీనికి ఏటా 0.05 డాలర్లను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎంబీటీయూ ధర 8.57 డాలర్లు ఉంది. లోతైన సముద్ర ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే జోన్లకు ప్రస్తుతం భిన్న రేట్ల విధానం అమల్లో ఉంది. వీటికి సంబంధించి సైతం ఎంబీటీయూ గరిష్ట ధర 12.46 డాలర్లు మించకూడదని పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక 2026 జనవరి 1 నుంచి ధరలపై ఎలాంటి పరిమితుల్లేని స్వేచ్ఛా విధానాన్ని సూచించింది. -
సహజ వాయువ ధర రెట్టింపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు రికార్డు స్థాయిలో యూనిట్‌కు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది. ఇప్పటిదాకా ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర (యూనిట్‌కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏటా ఆరు నెలలకోసారి కేంద్రం ఈ ధరలను సవరిస్తుంది. పెరగనున్న ద్రవ్యోల్బణం.. తాజా పరిణామంతో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గత పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తొమ్మిది సార్లు పెంచడంతో ఇంధనాల ధర లీటరుకు రూ. 6.4 స్థాయిలో పెరిగింది. వంట గ్యాస్ ధర కూడా సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెరిగింది. ఇక గ్యాస్ ధర కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత ఎగిసే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. సహజ వాయువును విద్యుత్, ఎరువుల ఉత్పత్తితో పాటు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), గృహాలకు పైపుల ద్వారా సరఫరా చేసే పైప్డ్ గ్యాస్ అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. అయితే, గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నందువల్ల విద్యుదుత్పత్తి వ్యయాలపై అంతగా ప్రభావం పడదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే ఎరువులకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఆ మేరకు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండబోదని పేర్కొన్నాయి. -
ఆయిల్ ఇండియా చీఫ్‌గా రంజిత్ రాత్ ఎంపిక
న్యూఢిల్లీ: దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ– ఆయిల్ ఇండియా చీఫ్‌గా రంజిత్ రాత్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ నియామకాల బోర్డ్ (పీఈఎస్బీ) ఒక ప్రకటన విడుదల చేసింది. 50 సంవత్సరాల రాత్ ప్రస్తుతం మినీరత్న కంపెనీగా గుర్తింపు పొందిన మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ (ఎంఈసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయిల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలకుగాను జరిగిన ఇంటర్వ్యూకు హాజరైన ఐదుగురు అభ్యర్థుల్లో రాత్ ఒకరు. ఆయిల్ ఇండియా ప్రస్తుత సీఎండీగా సుశీల్ చంద్ర మిశ్రా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. అటు తర్వాత రాత్ ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఇందుకు తొలుత ఆయన సచ్చీలతపై సీవీసీ, సీబీఐ వంటి అవినీతి నిరోధక శాఖల నుంచి క్లియరెన్స్‌లు ఇవ్వాలి. అటు తర్వాత రాత్ ఎంపికకు నియామకపు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయాలి. -
ఆయిల్ ఇండియా షేల్ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ ఇండియా.. యూఎస్ షేల్ చమురు వెంచర్లో 20 శాతం వాటా విక్రయించింది. డీల్ విలువ 2.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 187 కోట్లు)కాగా.. తద్వారా వెంచర్ నుంచి బయటపడింది. యూఎస్‌లోని సొంత అనుబంధ సంస్థ ద్వారా నియోబారా షేల్ ఆస్తిలోగల పూర్తివాటాను విక్రయించినట్లు ఆయిల్ ఇండియా వెల్లడించింది. వెరసి గత రెండు నెలల్లో యూఎస్ షేల్ బిజినెస్ నుంచి రెండో దేశీ సంస్థ గుడ్‌బై చెప్పింది. గతేడాది నవంబర్‌లో టెక్సాస్‌లోని ఈగల్ఫోర్డ్ షేల్ ఆస్తుల నుంచి వైదొలగేందుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. కాగా.. నియోబారా షేల్ ఆస్తిలో మరో పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)తో కలిసి 2012 అక్టోబర్‌లో ఆయిల్ ఇండియా 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను క్యారిజో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నుంచి 8.25 కోట్ల డాలర్లకు సొంతం చేసుకుంది. దీనిలో ఆయిల్ ఇండియా వాటా 20 శాతంకాగా.. ఐవోసీ 10 శాతం వాటా తీసుకుంది. ఈ వెంచర్ నిర్వాహక సంస్థ వెర్డాడ్ రీసోర్సెస్‌కు ఆయిల్ ఇండియా వాటాను విక్రయించింది. యూఎస్ వెంచర్ నుంచి ఔట్ -
ఆయిల్ ఇండియాకు లాభాల పంట
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) ప్రభుత్వరంగ ఆయిల్ ఇండియా లిమిటెడ్ మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.504 కోట్లకు చేరింది. షేరువారీ ఆర్జన రూ.4.65గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.239 కోట్లు (షేరువారీ ఆర్జన రూ.2.20)గా ఉండడం గమనార్హం. కంపెనీ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారెల్ ముడి చమురుపై 71.35 డాలర్ల మేర ధర గిట్టుబాటు కావడం లాభాల వృద్ధికి దోహదపడింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యారెల్ ముడిచమురు ధర 43 డాలర్ల స్థాయిలో ఉంది. కంపెనీ చమురు ఉత్పత్తిలో పెద్దగా మార్పు లేకుండా 0.76 మిలియన్ టన్నులుగా ఉంటే, సహజ వాయువు ఉత్పత్తి 2 శాతం మేర పెరిగింది. కంపెనీ ఆదాయం రూ.2,281 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు వృద్ధి చెందింది. ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల్లో కంపెనీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.1,012 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా రూ.1,281 కోట్లుగా ఉంది. -
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్.. జూనియర్ అసిస్టెంట్(క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 120(ఎస్సీ–08, ఎస్టీ–14, ఓబీసీ–32, ఈడబ్ల్యూఎస్–12, అన్రిజర్వ్డ్–54) ► అర్హత: కనీసం 40శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్(10+2)ఉత్తీర్ణతతోపాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా సర్టిఫికేట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్‌పాయింట్, ఎంఎస్ ఎక్స్ఎల్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. ► వయసు: 15.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.26,600 నుంచి రూ.90,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. ► ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్/అవేర్నెస్, ఆయిల్ ఇండియాపై ప్రశ్నలకు 20 శాతం మార్కులు కేటాయిస్తారు. ► రీజనింగ్, అర్థమేటిక్/న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 20శాతం మార్కులు కేటాయిస్తారు. ► డొమైన్/సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్(సంబంధిత పోస్టు విద్యార్హతల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి)కు 60శాతం మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలు మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ లే దు. పరీక్ష ఇంగ్లిష్, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షాసమయం రెండు గంటలు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021 ► వెబ్సైట్: https://www.oil-india.com/Current_openNew.aspx -
‘నుమాలీగఢ్’కు బీపీసీఎల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందుకు పడింది. తాజా పరిణామం ప్రకారం.. ముందుగా అస్సాంలోని నుమాలీగఢ్ రిఫైనరీ (ఎన్ఆర్ఎల్) నుంచి బీపీసీఎల్ వైదొలగనుంది. ఎన్‌ఆర్‌ఎల్‌లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియా కన్సార్షియంనకు విక్రయించనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా ఉండనుంది. అస్సాం శాంతి ఒడంబడిక ప్రకారం ఎన్‌ఆర్‌ఎల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటీకరణ బాటలో ఉన్న బీపీసీఎల్ చేతుల నుంచి ఎన్‌ఆర్‌ఎల్‌ను పక్కకు తప్పించడం ద్వారా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మార్చి 1న జరిగిన బోర్డు సమావేశంలో .. ఎన్‌ఆర్‌ఎల్‌లో బీపీసీఎల్‌కి ఉన్న మొత్తం 445.35 కోట్ల షేర్లను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియాల కన్సార్షియంనకు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బీపీసీఎల్ సోమవారం తెలియజేసింది. ‘ఎన్‌ఆర్‌ఎల్‌లో నియంత్రణాధికారాలను బదలాయించాలని బీపీసీఎల్ బోర్డు నిర్ణయించింది. దీనితో భారత్ పెట్రోలియం ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత పుంజుకుంటుంది’ అని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ను విక్రయించిన తర్వాత బీపీసీఎల్ చేతిలో మూడు రిఫైనరీలు (ముంబై, కొచ్చి, బీనా) మిగులుతాయి. 2021–22 ప్రథమార్ధంలో ప్రైవేటీకరణ.. బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్‌తో పాటు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ తదితర సంస్థలు వీటిని కోనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి. -
చమురు బావిలో మరోసారి భారీ ప్రమాదం
గువాహటి : అసోంలో దాదాపు రెండు నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న చమురుబావిలో బుధవారం మరోమారు ప్రమాదం చోటుచేసుకుంది. తిన్సుకియా జిల్లా బాఘ్జాన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా కంపెనీకి చెందిన ఐదోనెంబర్ చమురు బావిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేయడానికి వచ్చిన ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.(ప్రమాదకరంగా పశ్చిమ బెంగాల్ రవాణా) కాగా, తొలుత మే 27న చమురు బావి నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో అరికట్టడానికి విదేశాల నుంచి నిపుణులను తెప్పించారు. అయితే జూన్9న గ్యాస్‌లీక్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని కిలోమీటర్ల వరకు దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ఐదో నెంబర్ బావి నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. నాటి నుంచి మంటలను అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఈ మంటలను అదుపు చేసే క్రమంలో ఇప్పటికే ఇద్దరు అగ్రిమాక సిబ్బంది మృతిచెందారు. (అమెరికా అధ్యక్షుడిపై ఉద్ధవ్ ఠాక్రే సెటైర్లు) తాజాగా జరిగిన ప్రమాదంలో వీదేశీ నిపుణులకు గాయాలయ్యాయి. మంటలను ఆర్పే బ్లో అవుట్ ప్రివెంటర్‌ను చమురు బావి వద్ద పెట్టడానికి కంటే ముందు బావి స్పూల్ తెరవడానికి వెళుతుండగా మంటలు చెలరేగాయి. తాజా ఘటనతో మంటలను అదుపు చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. -
ఆయిల్, చమురు బ్లాక్‌ల వేలం...
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ఇండియా, ఓఎన్ జీసీతోపాటు అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ తాజాగా ముగిసిన చమురు, గాయ్స్ బ్లాక్‌ల వేలంలో టాప్–3గా నిలిచాయి. రెండో దశ ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) కింద 14 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లు, మూడో దశ ఓఏఎల్‌పీ కింద మరో 18 ఆయిల్, గ్యాస్, 5 కోల్బెడ్ మీథేన్ బ్లాక్‌లను కేంద్రం ప్రభుత్వం వేలానికి ఉంచింది. వీటిల్లో ఆయిల్ ఇండియాకు 12, ఓఎన్ జీసీకి 9, వేదాంతకు తొమ్మిది చొప్పున మొత్తం 30 బ్లాక్‌లు ఈ మూడు కంపెనీలకే దక్కనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్–బీపీ సంయుక్తంగా కృష్టా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్ )లో ఓ బ్లాక్‌ను దక్కించుకోనున్నాయి. ఈ బ్లాక్‌ను ఓఎన్ జీసీ కంటే మించి బిడ్ చేయడం ద్వారా రిలయన్స్–బీపీలు దక్కించుకోవడం విశేషం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స వివిధ కంపెనీలు సమర్పించిన బిడ్లను పరిశీలన పూర్తి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఓఎన్ జీసీ, వేదాంత తొమ్మిది బ్లాకుల్లో టాప్ బిడ్డర్లుగా, 12 బ్లాక్‌ల్లో ఆయిల్ ఇండియా టాప్‌లో ఉన్నట్టు చెప్పాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం అనంతరం విజేతలను ప్రకటించనున్నట్టు తెలిపాయి. 2017 జూలైలో కేంద్రం నూతనంగా ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కంపెనీలు తమంతట తామే ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి విషయంలో ఆసక్తిని తెలియజేయవచ్చు. -
ఆయిల్ ఇండియా షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియా షేర్లను బైబ్యాక్ చేయనున్నది. 4.45 శాతం వాటాకు సమానమైన మొత్తం 5.04 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఆయిల్ ఇండియా పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ.215 ధరకు బైబ్యాక్ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్ విలువ రూ.1,085 కోట్ల వరకూ ఉండొచ్చని వివరించింది. షేర్ల బైబ్యాక్ ద్వారా రూ.5,000 కోట్లు ! ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ప్రభుత్వం నగదు నిల్వలు భారీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసింది. అధిక డివిడెండ్లు చెల్లించాలని, లేదా షేర్ల బైబ్యాక్ చేయాలని ఆయా సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఈ సంస్థల్లో సహజంగానే ప్రభుత్వానికి అధిక వాటా ఉండటంతో డివిడెండ్లు చెల్లించినా, షేర్ల బైబ్యాక్ జరిపినా, కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు రా -
ఆయిల్ ఇండియా లాభం 56% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియా కంపెనీ... ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.703 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.450 కోట్లతో పోలిస్తే 56 శాతం వృద్ధి సాధించామని ఆయిల్ ఇండియా తెలిపింది. చమురు ధరలు పెరగడం కలసివచ్చిందని వెల్లడించింది. ఒక్కో షేర్ పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.450 కోట్లుగా (ఈపీఎస్ రూ.3.84) ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.730.22 కోట్లకు (ఈపీఎస్ రూ.6.20) పెరిగిందని పేర్కొంది. ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.3,390 కోట్లకు చేరింది. ఈ క్యూ1లో ముడి చమురు విక్రయ ఆదాయం 53 శాతం పెరిగి రూ.2,778 కోట్లకు చేరుకుంది. ఈ విభాగం లాభం దాదాపు రెట్టింపై రూ.1,136 కోట్లకు ఎగసింది. సహజ వాయువుకు సంబంధించిన ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.443 కోట్లకు, స్థూల లాభం కూడా 25 శాతం వృద్ధితో రూ.119 కోట్లకు పెరిగాయని కంపెనీ వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఆయిల్ ఇండియా షేర్ 1 శాతం నష్టంతో రూ. 212 వద్ద ముగిసింది. -
16 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్మెంట్కు రెడీ
♦ ఈ ఏడాది విక్రయ జాబితా సిద్ధం చేసిన ఆర్థిక శాఖ ♦ లిస్టులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా ♦ ఖజానాకు రూ.40 వేల కోట్లు వచ్చే అవకాశం న్యూఢిల్లీ: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్)కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం 16 కంపెనీల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో వీటి షేర్ల విలువ ఆధారంగా ఈ వాటా అమ్మకాల ద్వారా రూ. 40 వేల కోట్లు వస్తుందని అంచనా. లిస్టులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్, ఎంఎంటీసీ, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎన్‌హెచ్‌పీసీ, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటిలో చాలా కంపెనీల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ను గత ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టాలని భావించినా.. స్టాక్‌మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా జాప్యం జరిగింది. కొన్ని కంపెనీలకు సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా లభించింది. మరోపక్క, భారీగా నగదు నిల్వలు ఉన్న కంపెనీల నుంచి షేర్ల బైబ్యాక్ ఆప్షన్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 10 శాతం చొప్పున వాటా అమ్మకాల ద్వారా కోల్ ఇండియా నుంచి రూ.18,000 కోట్లు, ఎన్ఎం డీసీ నుంచి రూ.3,800 కోట్లు, నాల్కో నుంచి రూ.1,000 కోట్లు లభించే అవకాశం ఉంది. ఇక ఓఎన్జీసీలో 5% వాటా విక్రయం ద్వారా రూ.9,000 కోట్లు ఖజానాకు సమకూరనుంది. ఈ ఏడాది బడ్జెట్లో 2016-17 డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని కేంద్రం రూ.56,500 కోట్లుగా నిర్ధేశించుకుంది. పీఎస్‌యూల్లో మైనారిటీ వాటా అమ్మకంతో రూ. 36,000 కోట్లు.. లాభాల్లో అదేవిధంగా నష్టజాతక కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయాల రూపంలో రూ.20,500 కోట్లు సమకూర్చుకోవాలనేది ప్రణాళిక. -
ఉద్యోగ సమాచారం
భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో వివిధ పోస్టులు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు చెందిన భిలాయ్ స్టీల్ ప్లాంట్.. సర్వేయర్ (ఖాళీలు-3), మైనింగ్ మేట్ (ఖాళీలు-11), బ్లాస్టర్ (ఖాళీలు-3) విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 12. వివరాలకు www.sailcareers.com/bhilaiచూడొచ్చు. సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థలో పలు పోస్టులు చండీగఢ్‌లోని సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ... సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ).. వివిధ విభాగాల్లో ప్రాజె క్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, సీనియర్ రీసెర్చ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 13. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 8, 9. వివరాలకు www.csio.res.inచూడొచ్చు. కొచ్చిన్ ఎయిర్ పోర్టలో జూనియర్ అసిస్టెంట్, అటెండెంట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట లిమిటెడ్ (సీఐఏఎల్).. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -3 ట్రైనీ (ఖాళీలు -11), జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 5 ట్రైనీ (ఖాళీలు-10) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 5. వివరాలకు www.career.cial.aeroచూడొచ్చు. కాన్పూర్ ఐఐటీలో ఆర్ఈఓలు కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో రీసెర్చ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ (ఆర్ఈఓ) గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 4. వివరాలకు www.iitk.ac.in/ infocell/RnD_Recruitmentచూడొచ్చు. రైస్ రీసెర్ చ ఇన్స్టిట్యూట్లో పలు ఖాళీలు కటక్‌లోని నేషనల్ రైస్ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఖాళీలు-3), స్కిల్డ్ హెల్ప్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి నవంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.crri.nic.inచూడొచ్చు. ఆయిల్ ఇండియాలో హెచ్ఎస్ఈ ఆఫీసర్లు ఆయిల్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో హెచ్ఎస్ఈ ఆఫీసర్స (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 30, డిసెంబర్ 1. వివరాలకు www.oilindia.comచూడొచ్చు. -
చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలు...ఇక ప్రైవేట్ సంస్థల చేతికి
69 క్షేత్రాల వేలానికి కేంద్రం నిర్ణయం ♦ వీటిలో నిక్షేపాల విలువ రూ. 70,000 కోట్లు! ♦ కొత్తగా... ఆదాయాల్లో వాటాల విధానం న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా అప్పగించిన 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించి కొత్త ఫార్ములాను ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇప్పటిదాకా అమల్లో ఉన్న.. ‘లాభాల్లో వాటాల విధానం’ కాకుండా ఇకపై స్థూల ఆదాయాల్లో వాటాలివ్వాలనే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. మరోవైపు, 2006-2011 మధ్య కాలంలో పప్పు ధాన్యాల దిగుమతులపై నాఫెడ్, పీఈసీ, ఎస్టీసీ తదితర సంస్థలకు వాటిల్లిన నష్టానికి సంబంధించి రూ.113.40 కోట్లు రీయింబర్స్ చేసేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇంధన క్షేత్రాల వేలానికి సంబంధించి.. 69 చిన్న క్షేత్రాల్లో ప్రస్తుత రేట్ల ప్రకారం దాదాపు రూ.70,000 కోట్ల విలువ చేసే 89 మిలియన్ టన్నుల మేర చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో పాటించిన లాభాల్లో వాటాల విధానం కారణంగా ప్రైవేటు ఆపరేటర్లు చేసే ప్రతి వ్యయాన్నీ ప్రభుత్వం పట్టి, పట్టి చూడాల్సి వస్తుండటం... జాప్యానికి, వివాదాలకు దారి తీస్తోందని తెలియజేశారు. ఆదాయాల పంపకానికి సంబంధించి కొత్త విధానం వల్ల చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోయినా, గరిష్ట స్థాయికి ఎగిసినా ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉంటాయని ప్రధాన్ వివరించారు. తదుపరి నిర్వహించే లెసైన్సింగ్ రౌండులో కూడా ఇదే విధానాన్ని పాటించే అవకాశాలున్నాయని చెప్పారాయన. మూడు నెలల్లో బిడ్ డాక్యుమెంటు.. వేలంలో ఈ క్షేత్రాలను దక్కించుకునే సంస్థలకు రేటు పరంగాను, మార్కెటింగ్ పరంగానూ పూర్తి స్వేచ్ఛ కల్పిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నియంత్రణ సమస్య లేకుండా ఆయా కంపెనీలు మార్కెట్ రేటుకు ఎవరికైనా విక్రయించుకోవచ్చన్నారు. బిడ్ డాక్యుమెంటు మరో మూడు నెలల్లో సిద్ధమవుతుందని, ఆ తర్వాత వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచడానికి, ఈ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడానికి క్యాబినెట్ నిర్ణయం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ఇంధన అన్వేషణకు ఇదే సరైన సమయం.. చమురు ధరలు ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన తరుణంలో వేలంపై అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనపరుస్తాయా అన్న ప్రశ్నకు.. టెక్నాలజీ సామర్థ్యం గల చిన్న సంస్థలే లక్ష్యంగా వేలం నిర్వహిస్తామని ప్రధాన్ తెలిపారు. చమురు ధర కనిష్టంగా ఉన్నప్పుడు డ్రిల్లింగ్ రిగ్గు సర్వీసులు మొదలైనవి కూడా తక్కువకే లభిస్తాయి కనుక.. ఇంధన అన్వేషణ కార్యకలాపాలకు ఇదే సరైన సమయమన్నారు. ఈ 69 క్షేత్రాల నుంచి ఉత్పత్తి మొదలవడానికి కనీసం మూడేళ్లు పట్టొచ్చని అప్పటికి ధర లు మళ్లీ మెరుగుపడగలవని అంచనా వేస్తున్నట్లు ప్రధాన్ పేర్కొన్నారు. వేలం ప్రక్రియ ఇలా.. నామినేషన్ ప్రాతిపదికన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వద్ద 110 చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలుండేవి. అయితే, భౌగోళిక సంక్లిష్టత, పరిమాణం రీత్యా లాభసాటిగా లేకపోవడం, ప్రభుత్వ నిర్దేశిత రేటు గిట్టుబాటు కాకపోవడం వంటి అంశాల కారణంగా ఉత్పత్తి కుదరకపోవడంతో 63 క్షేత్రాలను ప్రభుత్వానికి కంపెనీ తిరిగి అప్పగించేసింది. ఆయిల్ ఇండియా కూడా ఇదే కారణంగా 6 క్షేత్రాలను వాపసు చేసింది. వీటినే ప్రభుత్వం వేలం వేయబోతోంది. వీటిలో 36 ఆఫ్‌షోర్, 33 ఆన్‌షోర్ క్షేత్రాలున్నాయి. వేలంలో వాటిని దక్కించుకునే కొత్త ఆపరేటరు.. ఇప్పటికే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వాటిపై చేసిన వ్యయాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌షోర్ క్షేత్రాల ఆపరేటర్లు 3 సంవత్సరాల్లో, ఆఫ్‌షోర్ ఆపరేటర్లు నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. ఆయా బ్లాకులపై రాయల్టీ కూడా కట్టాలి. చమురు సెస్సు ఉండదు. లాభాల్లో వాటాల పద్ధతి కాకుండా ప్రభుత్వానికి ఆదాయాల్లో లేదా చమురు, గ్యాస్‌లో ఎంత వాటాలు ఇస్తారన్నది ముందుగా బిడ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. గరిష్ట స్థాయిలో వాటాలు ఇవ్వజూపే సంస్థ.. సదరు క్షేత్రాన్ని దక్కించుకుంటుంది. -
ఆయిల్ ఇండియా తాత్కాలిక చైర్మన్‌గా యు.పి. సింగ్
న్యూఢిల్లీ: ఆయిల్ ఇండియా తాత్కాలిక చైర్మన్‌గా యు.పి. సింగ్‌ను కేంద్రం నియమించింది. చమురు శాఖలో ఆయన సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మంగళవారం పదవీ విరమణ చేస్తున్న ఎస్.కె. శ్రీవాత్సవ స్థానంలో యు.పి. సింగ్ ఆయిల్ ఇండియా సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. కంపెనీలోనే డెరైక్టర్ వ్యవహ రిస్తున్న రూప్శిఖ సైకియా బోరా నియామకం ఇప్పటికే జరిగింది. అయితే ఈ నియామకంపై వివాదం తలెత్తడంతో ‘తాత్కాలిక’ నియామకం అవసరమైంది. -
మొజాంబిక్‌లో మూడు భారత కంపెనీల పెట్టుబడి
600 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్న ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ న్యూఢిల్లీ: మొజాంబిక్ తీరంలోని రొవుమ ఏరియా-1 సహజవాయువు క్షేత్రంలో మూడు భారత ప్రభుత్వ సంస్థలు నాలుగేళ్లలో 600 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఓఎన్జీసీకి చెందిన ఓఎన్జీసీ విదేశ్, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ కంపెనీలు ఈ స్థాయి భారీ పెట్టుబడులు పెట్టనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం చెప్పారు. ఈ క్షేత్రం నుంచి సహజవాయువును ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ-లిక్విఫైడ్ నేచురుల్ గ్యాస్)గా మార్చి భారత్ వంటి దేశాలకు ఎగుమతులు చేస్తాయని పేర్కొన్నారు. ఈ సహజవాయువు క్షేత్రంలో ఈ మూడు కంపెనీలకు 30 శాతం వాటా ఉంది. ఈ క్షేత్రంలో 75 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిక్షేపాలున్నట్లు అంచనా. ఇప్పటికే ఈ క్షేత్రంలో 600 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టామని ప్రధాన్ వివరించారు. ఈ బ్లాక్ నుంచి తొలి ఎల్ఎన్జీ ఉత్పత్తి 2019 మొదట్లో జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల మొజాంబిక్ పర్యటన అనంతరం భారత్ వచ్చిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు. -
చమురు రిటైలర్లకు క్యూ1లో కేంద్రం రూ. 11వేల కోట్లు
ముంబై: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ త్రైమాసికంలో సబ్సిడీలకు సంబంధించి రూ.11,000 కోట్లను కేంద్రం నుంచి పొందనున్నాయి. వీటిలో ఐఓసీ వాటా రూ. 6,076 కోట్లు. బీపీసీఎల్ వాటా రూ.2,407 కోట్లు. హెచ్‌పీసీఎల్ పొందే పరిమాణం రూ.2,517 కోట్లు. ఈ క్వార్టర్లో మూడు చమురు కంపెనీల నష్టం రూ.28,691 కోట్లు. వీటిలో ప్రభుత్వ చెల్లింపులు కాకుండా అప్‌స్ట్రీమ్ సంస్థలు- ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్ 54 శాతం అంటే దాదాపు రూ.15,547 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో నికరంగా ఇంధన విక్రయ రిటైలర్లకు రూ.2,145 కోట్ల నష్టం మిగిలి ఉంటుంది. మూడు ఆయిల్ కంపెనీలు గిట్టుబాటు ధరకన్నా తక్కువకు రిటైల్ విక్రయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. -
ఆయిల్ షేర్లు డీలా
రెండో రోజూ నష్టాలే 44 పాయింట్లు డౌన్ 25,202 వద్దకు సెన్సెక్స్ పలుమార్లు హెచ్చుతగ్గులు ఇరాక్ అంతర్యుద్ధ పరిస్థితులు చల్లబడకపోవడంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు నీరసించాయి. రోజు మొత్తం లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 44 పాయింట్లు క్షీణించి 25,202కు చేరగా, నిఫ్టీ 17 పాయింట్లు తగ్గి 7,541 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 25,426-25,070 పాయింట్ల మధ్య పలుమార్లు ఒడిదుడుకులకు లోనైంది. ఇరాక్ యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 114 డాలర్లను మించడంతో ఆయిల్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఆయిల్ ఇండియా, ఓన్జీసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, ఆర్ఐఎల్, గెయిల్ 6-2% మధ్య పతనమయ్యాయి. అయితే ఐటీ ఇండెక్స్ దాదాపు 2% లాభపడింది. ప్రధానంగా మైండ్‌ట్రీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో 4-1% మధ్య పుంజుకున్నాయి. ప్యాకేజీ ఉపసంహరణ అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతున్నదని, వెరసి సహాయక ప్యాకేజీలో కోతను కొనసాగిస్తామని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడంతో యూఎస్, యూరప్ మార్కెట్లు లాభపడ్డాయి. ఇప్పటికే నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున విధించిన కోత కారణంగా ప్యాకేజీ 35 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. పాలసీ సమీక్షలో భాగంగా రెండు రోజులపాటు ఫెడ్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక దేశీయంగా చూస్తే సెన్సెక్స్ దిగ్గజాలలో మారుతీ, కోల్ ఇండియా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.5-1% మధ్య నీరసించాయి. మరోవైపు ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, ఐటీసీ 1%పైగా పురోగమించాయి. కాగా, డియాజియో ప్రకటించిన ఓపెన్ ఆఫర్ ముగియడంతో యునెటైడ్ స్పిరిట్స్ 8% దిగజారింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1,586 నష్టపోగా, 1,406 లాభపడ్డాయి. -
ఆయిల్ ఇండియా లాభం 26% డౌన్
న్యూఢిల్లీ: గతేడాది(2013-14) క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ ఇండియా నికర లాభం 26% క్షీణించి రూ. 566 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 765 కోట్లను ఆర్జించింది. ఉత్పత్తి మందగించడం, సబ్సిడీ చెల్లింపులు పెరగడం లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ తెలిపింది. సబ్సిడీ చెల్లింపులు రూ. 1,850 కోట్ల నుంచి రూ. 2,348 కోట్లకు ఎగశాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీజిల్, వంటగ్యాస్ విక్రయాలవల్ల వాటిల్లే ఆదా య నష్టాలకుగాను ఆయి ల్ ఉత్పత్తి సంస్థలు 48% వరకూ సబ్సిడీలు చెల్లిస్తాయి. ముడిచమురు ఉత్పత్తికిగాను బ్యారల్‌కు 106.55 డాలర్ల చొప్పున బిల్లింగ్ చేసినప్పటికీ, 69.19 డాలర్లమేర సబ్సిడీ ఇవ్వడంతో నికరంగా 37.36 డాలర్లు మాత్రమే లభించినట్లు కంపెనీ వివరించింది. గతంలో బ్యారల్‌కు 56 డాలర్ల సబ్సిడీ ఇచ్చినప్పటికీ నికరంగా 55.44 డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది. -
వీడియోకాన్ ‘మొజాంబిక్’ డీల్
న్యూఢిల్లీ: మొజాంబిక్‌లోని భారీ గ్యాస్ క్షేత్రంలో వీడియాకాన్ గ్రూప్‌నకు ఉన్న 10% వాటా... ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్) చేతికొచ్చింది. ఓఎన్జీసీ అనుబంధ సంస్థ ఓఎన్జీసీ విదేశ్(ఓవీఎల్), ఓఐఎల్లు సంయుక్తంగా ఈ వాటాను కొనుగోలు చేయడంద్వారా డీల్ ప్రక్రియ పూర్తయింది. ఇందుకోసం ఇరు కంపెనీలు కలిసి మంగళవారం 2.475 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.15,300 కోట్లు)ను వీడియోకాన్‌కు చెల్లించిన ట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రొవూమా ఏరియా-1 అనే పేరుతో పిలిచే ఈ మెగా గ్యాస్ బ్లాక్‌లో మరో 10 శాతం వాటాను ఓవీఎల్ 2.64 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అమెరికా ఇంధన దిగ్గజం అనడార్కో పెట్రోలియం నుంచి ఓవీఎల్ ఈ వాటాను చేజిక్కించుకుంది. దీనికి సబంధించిన చెల్లింపులను ఫిబ్రవరి చివరికల్లా పూర్తి చేసే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఈ గ్యాస్ బ్లాక్‌లో కనీసం 35 ట్రిలియన్ ఘనపు టడుగులు(టీసీఎఫ్-ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు), గరిష్టంగా 65 టీసీఎల్ల గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. రిలయన్స్ కేజీ-డీ6లో నిక్షేపాలతో పోలిస్తే మొజాంబిక్ బ్లాక్‌లో 13 రెట్ల అధిక నిల్వలు ఉన్నట్లు లెక్క. కాగా, వీడియోకాన్ తన 10 శాతం వాటా కోసం 2.8 బిలియన్ డాలర్ల మొత్తాన్ని డిమాండ్ చేసిందని... అయితే, సంప్రతింపుల ద్వారా ఈ మొత్తాన్ని 2.475 బిలియన్ డాలర్లకు తగ్గించగలిగామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే బ్లాక్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)కు చెందిన అనుబంధ సంస్థకు ఇప్పటికే 10 శాతం వాటా ఉండటం గమనార్హం. -
‘డెయిరీ’లోకి ఆయిల్ ఇండియా
గౌహతి: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఆయిల్ ఇండియా కంపెనీ పాల ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా అసోంలోని రెండు జిల్లాల్లో పాల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని కంపెనీ యోచిస్తోంది. గుజరాత్‌లోని అమూల్ తరహాలో అసోంలో పాల వ్యాపారంలోకి ప్రవేశించనున్నామని, కామధేను ప్రాజెక్ట్ పేరుతో ఈ కార్యకలాపాలను చేపట్టనున్నామని ఈ ఏడాది జూలైలోనే కంపెనీ సీఎండీ సునీల్ కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని నిర్వహించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్, ఆనంద్(ఐఆర్ఎంఏ)తో కంపెనీ ఇటీవలనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.