న్యూఢిల్లీ: ఆయిల్ ఇండియా తాత్కాలిక చైర్మన్‌గా యు.పి. సింగ్‌ను కేంద్రం నియమించింది. చమురు శాఖలో ఆయన సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మంగళవారం పదవీ విరమణ చేస్తున్న ఎస్.కె. శ్రీవాత్సవ స్థానంలో యు.పి. సింగ్ ఆయిల్ ఇండియా సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. కంపెనీలోనే డెరైక్టర్ వ్యవహ రిస్తున్న రూప్‌శిఖ సైకియా బోరా నియామకం ఇప్పటికే జరిగింది. అయితే ఈ నియామకంపై వివాదం తలెత్తడంతో ‘తాత్కాలిక’ నియామకం అవసరమైంది.