ఉద్యోగ సమాచారం | Employment Information | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సమాచారం

Published Thu, Nov 19 2015 1:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:37 PM

Employment Information

భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో వివిధ పోస్టులు
 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు చెందిన భిలాయ్ స్టీల్ ప్లాంట్.. సర్వేయర్ (ఖాళీలు-3), మైనింగ్ మేట్ (ఖాళీలు-11), బ్లాస్టర్ (ఖాళీలు-3) విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 12. వివరాలకు www.sailcareers.com/bhilaiచూడొచ్చు.

సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థలో పలు పోస్టులు
 చండీగఢ్‌లోని సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ... సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్‌ఐఓ).. వివిధ విభాగాల్లో ప్రాజె క్ట్  ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, సీనియర్ రీసెర్‌‌చ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 13. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 8, 9. వివరాలకు www.csio.res.inచూడొచ్చు.
కొచ్చిన్ ఎయిర్ పోర్‌‌టలో జూనియర్ అసిస్టెంట్, అటెండెంట్లు
 కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్‌‌ట లిమిటెడ్ (సీఐఏఎల్).. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -3 ట్రైనీ (ఖాళీలు -11), జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 5 ట్రైనీ (ఖాళీలు-10) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 5. వివరాలకు www.career.cial.aeroచూడొచ్చు.

కాన్పూర్ ఐఐటీలో ఆర్‌ఈఓలు
 కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో  రీసెర్‌‌చ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ (ఆర్‌ఈఓ) గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి  దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 4. వివరాలకు www.iitk.ac.in/ infocell/RnD_Recruitmentచూడొచ్చు.

రైస్ రీసెర్ చ ఇన్‌స్టిట్యూట్‌లో పలు ఖాళీలు
 కటక్‌లోని నేషనల్ రైస్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్‌‌చ ఫెలో (ఖాళీలు-3), స్కిల్డ్ హెల్ప్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి నవంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.crri.nic.inచూడొచ్చు.

 ఆయిల్ ఇండియాలో హెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్లు
 ఆయిల్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో హెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్‌‌స (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 30, డిసెంబర్ 1. వివరాలకు www.oilindia.comచూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement