Steel Authority of India Limited (SAIL)
-
భారీ లాభాల్లో సెయిల్
న్యూఢిల్లీ: మెటల్ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి రూ. 1,306 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,642 కోట్ల నుంచి రూ. 29,858 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 27,201 కోట్ల నుంచి రూ. 27,769 కోట్లకు పెరిగాయి. కంపెనీ మొత్తం స్టీల్ ఉత్పాదక వార్షికం సామర్థ్యం 20 ఎంటీకాగా.. ఈ కాలంలో ముడిస్టీల్ ఉత్పత్తి 4.3 మిలియన్ టన్నుల నుంచి 4.8 ఎంటీకి బలపడింది. అమ్మకాలు 4.21 ఎంటీ నుంచి 4.77 ఎంటీకి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 88 వద్ద ముగిసింది. -
సెయిల్‌కు రూ. 329 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు తయారీ సంస్థ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్‌కు భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా రూ.329 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.26,642 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెయిల్ రూ.4,339 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం కూడా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.27,007 కోట్లు గా ఉంది. ప్రధానంగా వ్యయాలు రూ. 21,289 కోట్ల నుంచి రూ.27,201 కోట్లకు పెరిగాయి. 4.30 మిలియన్ టన్నుల స్టీల్‌ను కంపెనీ తయారు చేసింది. క్రితం ఏడాది క్యూ2లో 4.28 మిలియన్ టన్నుల స్టీల్ విక్రయించగా, తాజాగా ముగిసిన త్రైమాసికంలో 4.21 మిలియన్ టన్నులుగా ఉంది. -
మనసున్న బాస్
దేశంలోని చాలా కంపెనీలు ఇప్పుడు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. వాటిల్లో చాలా కంపెనీలకు మహిళలే కొత్త బాస్‌గా వస్తున్నారు. సోమా మండల్నే చూడండి. జనవరి 1 ఆమె భారత ప్రభుత్వసంస్థ సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 19కి 67 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సెయిల్ చరిత్రలోనే తొలి మహిళా చైర్మన్ సోమ. మొన్నటి వరకు సెయిల్‌కు డైరెక్టర్–కమర్షియల్‌గా ఉన్న సోమ.. చైర్పర్సన్ కాగానే భారత పారిశ్రామిక రంగంలోని దిగ్గజాల కళ్లన్నీ ఆమె ముళ్ల కీరీటం వైపు మళ్లాయి తప్ప, ‘ఐ కెన్’ అని ధీమాగా చెబుతున్నట్లున్న ఆమె చిరునవ్వుకు ఎవ్వరూ పెద్దగా గుర్తింపునివ్వడం లేదు! చైర్‌పర్సన్‌గా ఇప్పుడిక ఆమె చాలా చెయ్యాలి. యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్న సెయిల్ అప్పుల్ని తగ్గించాలి. వచ్చే పదేళ్లలోపు ఏడాదికి కనీసం ఐదు కోట్ల టన్నుల ఉక్కు ఉత్పతిస్థాయికి సంస్థ సామర్థ్యాన్ని పెంచాలి. స్టాక్ మార్కెట్లో సెయిల్ సూచీని శిఖరం వైపు మళ్లించాలి. తక్షణం అయితే ఒకటి చేయాలి. ఏళ్లుగా కదలిక లేకుండా ఉన్న వేతనాలను సవరించి, స్థిరీకరించి సిబ్బందిలోని అసంతృప్తిని పోగొట్టాలి. ఇవన్నీ చేయగలరా? ‘చెయ్యగలను’ అని ఆమె అంటున్నారు. ‘ఆమె చెయ్యగలరు’ అని ప్రభుత్వం నమ్ముతోంది. స్టీల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత దశలో చైర్‌పర్సన్‌గా వచ్చిన సోమా మండల్ సెయిల్‌ను లాభాల్లో నడిపిస్తారనే సెయిల్ ఉద్యోగులు, స్టాక్ హోల్డర్లు ఆశిస్తున్నారు. అందుకు కారణం ఉంది. ∙∙ యాభై ఏడేళ్ల సోమ వ్యాపార వ్యూహాల నిపుణురాలు మాత్రమే కాదు. సోషల్ వర్కర్ కూడా కనుక సెయిల్ కింది స్థాయి సిబ్బందికి అన్నివిధాలా భరోసా లభించినట్లే. పైన మన కష్టం గుర్తెరిగే వారున్నారనే భావన కింది స్థాయి ఉద్యోగులు సంస్థ కోసం పాటు పడేలా చేస్తుంది. కంపెనీకి అది వెలకట్టలేని ఆస్తి. 2017 నుంచి సెయిల్‌లో ఉన్నారు సోమా. ఆ క్రితం వరకు ‘నాల్కో’లో (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) చేశారు. రూర్కెలా నిట్‌లో బీటెక్ చేశాక 1984లో నాల్కోలోనే మేనేజ్మెంట్ ట్రైనీగా చేరారు. సోమా భువనేశ్వర్‌లో జన్మించారు. ఆమె తండ్రి వ్యవసాయ ఆర్థికవేత్త. తన ముగ్గురు సంతానాన్ని డాక్టర్లను చేయాలని ఆశ. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు, ఒక కూతురు డాక్టర్లు అయ్యారు కానీ, సోమ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నారు. సోమకు ముగ్గురు పిల్లలు. భర్త కూడా ఇంజినీరే. యు.టి.ఐ.లో పని చేసేవారు. 2005లో చనిపోయారు. ‘‘నా ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్ టచ్ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోగానే. ‘‘నా ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్ టచ్ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోగానే. -
టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఏపీలోని వైఎస్సార్ జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్ అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ఉక్కు శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2016లో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉక్కు శాఖ పరిధిలోని కేంద్ర పబ్లిక్ సెక్టార్ సంస్థ మెకాన్ ఉన్నాయని వివరించింది. ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలత, రోడ్‌మ్యాప్ తయారీ చేపట్టేందుకు టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోందని పేర్కొంది. ప్లాంటు ఏర్పాటు సాధ్యత నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలు మెకాన్‌కు అందజేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపింది. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్లు యోగ్యత కలిగి ఉండేందుకు వీలుగా తాము పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో ప్లాంట్ల ఏర్పాటుకు చట్టం చేసిన 6 నెలల్లోపు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫీజిబులిటీ నివేదిక అందజేయాల్సి ఉందని, ఆ నివేదిక ప్రకారం ఆర్థికంగా ఆయా ప్లాంట్లకు యోగ్యత లేదని కేంద్రం ఈ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాతే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. -
7సంస్థలు.. రూ. 34,000 కోట్లు
ఐవోసీ, సెయిల్ తదితర సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్!∙∙ మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఏడు దిగ్గజ సంస్థల్లో వాటాల విక్రయానికి కసరత్తు మొదలైంది. ఇందుకు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) వెల్లడించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తదితర బ్లూచిప్ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.34,000 కోట్లు రావొచ్చని అంచనా. డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), ఎన్ఎల్సీ ఇండియా కూడా ఉన్నాయి. వాటాల విక్రయానికి నిర్దిష్ట గడువేదీ పెట్టుకోలేదని, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ .. మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక కోసం మాత్రమే నిర్ణయం తీసుకున్నామని దీపం కార్యదర్శి నీరజ్ గుప్తా చెప్పారు. ‘ఇది డిజిన్వెస్ట్‌మెంట్ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియలో భాగం మాత్రమే. కచ్చితంగా ఈ పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ జరుగుతుందనేమీ లేదు‘ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇప్పటికే 12 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్మెంట్కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన సంస్థల్లో వాటాల విక్రయ అంశం ముందుకు కదలడానికి మరికాస్త సమయం పట్టొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2017–18 బడ్జెట్ ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 46,500 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 2016–17లో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 46,247 కోట్లు సమీకరించింది. ఎన్టీపీసీ, పీఎఫ్‌సీల్లో 10 శాతం వాటాలు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రకారం... కేంద్రం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 3 శాతం, సెయిల్.. ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, పీఎఫ్‌సీల్లో 10 శాతం చొప్పున వాటాలు విక్రయించాలని భావిస్తోంది. అలాగే ఎన్ఎల్సీ ఇండియా (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్)లో 15 శాతం, ఆర్ఈసీలో 5 శాతం మేర డిజిన్వెస్ట్‌మెంట్ యోచన ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే.. ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 34,000 కోట్లు దఖలు పడే అవకాశం ఉంది. ఇందులో ఎన్టీపీసీ నుంచి రూ. 13,000 కోట్లు, ఐవోసీ నుంచి రూ. 6,000 కోట్లు, సెయిల్ నుంచి రూ. 2,500 కోట్లు రావొచ్చు. అలాగే పీఎఫ్‌సీలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 4,000 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ. 3,000 కోట్లు, ఎన్ఎల్సీ (రూ. 2,000 కోట్లు), ఆర్ఈసీ (రూ. 1,000 కోట్లు) రావొచ్చని అంచనా. కేంద్రానికి ఐవోసీలో 58.28%, ఎన్టీపీసీలో 69.74%, సెయిల్‌లో 75%, ఎన్‌హెచ్‌పీసీలో 74.50%, ఎన్ఎల్సీ ఇండియాలో 90%, పీఎఫ్‌సీలో 67.80%, ఆర్ఈసీ 60.64% వాటాలు ఉన్నాయి. -
‘బయ్యారం ఉక్కు’ మరింత ఆలస్యం
బయ్యారంలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగారం ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్ర స్థాయి సర్వే నత్తనడకన సాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాలివీ.. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఖమ్మం జిల్లా బయ్యారంలో మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ద్యం కలిగిన సమీకృత ఉక్కు కర్మాగారం స్థాపనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) సుముఖత వ్యక్తం చేసింది. అయితే 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉంటేనే కర్మాగారం ఏర్పాటు సాధ్యమని సెయిల్ స్పష్టీకరించింది. దీనిపై ఏర్పాటైన జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ.. తన నివేదికలో 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం లభించడం అసాధ్యమని ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ముడి ఖనిజం లభ్యతపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. నత్తనడకన జీఎస్ఐ సర్వే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 13 బ్లాకుల పరిధిలో 340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం ఉందని మైనింగ్ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో.. 240.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణకు సరిహద్దులు నిర్ణయిస్తూ సర్వేకు అనుమతి ఇచ్చింది. మొత్తం 13 బ్లాకులుగా ఇనుప ముడి ఖనిజం లభ్యత కలిగిన ప్రాంతాలను విభజించి.. బయ్యారంలోని రెండు బ్లాకుల్లో జీఎస్ఐ క్షేత్ర స్థాయి సర్వేను పూర్తి చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు బ్లాకులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇస్తామని జీఎస్ఐ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మిగతా 11 బ్లాకుల్లో సర్వే పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2016 మార్చి నాటికే సర్వే పూర్తి చేయాల్సి ఉండగా.. తుది నివేదిక మాత్రం 2017 మార్చికి అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటులో జీఎస్ఐ నివేదికే కీలకం కావడంతో.. ప్రతిపాదనలు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. -
ఓ మైగాడ్.. అతడు బతికాడు!
బీజింగ్: దురదృష్టం వెంటాడితే కాలు జారినా కాటికి పోతాం. అదృష్టముంటే ఆకాశం నుంచి పడినా ఆయువు తీరదు. చైనాకు చెందిన 46 వ్యక్తి మృత్యుముఖంలోంచి బయటపడ్డాడు. 1.5 మీటర్ల ఇనుప ఊచ దేహంలోకి దూసుకుపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు. షాన్ డాంగ్ ప్రావిన్స్ లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న జాంగ్ అనే ఇంటి పేరు కలిగిన వ్యక్తి పనిచేస్తూ 5 మీటర్ల ఎత్తు నుంచి ఇనుప ఊచలపై పడిపోయాడు. ఈనెల 14న ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఇనుప ఊచలను కత్తిరించి అతడిని జినాన్ లోని షాన్ డాంగ్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి శరీరంలోకి చొచ్చుకుపోయిన 1.5 మీటర్ల ఇనుప రాడ్ ను డాక్టర్లు ఎంతో శ్రమించి బయటకు తీశారు. 7 గంటలకు పైగా శ్రమించి అతడి ప్రాణాలను నిలిపారు. కపాలం, శ్వాసనాళం, గుండె, గళధమని, కాలేయం పక్కనుంచి ఇనుపరాడ్ చొచ్చుకుపోయినట్టు ఎక్స్ రేలో కనబడింది. ప్రధాన అవయవాలకు ఏమాత్రం గాయం అయినా అతడి ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు వారాల పాటు అతడి జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందన్నారు. -
టాటాస్టీల్ అమ్మకాల ‘కోరస్’..!
♦ విక్రయానికి బ్రిటన్ వ్యాపారం ♦ క్షీణించిన ఆర్థిక పరిస్థితులే కారణం ♦ జాతీయం చేయాలని ఉద్యోగుల డిమాండ్ ♦ ప్రత్యామ్నాయాల పరిశీలనలో బ్రిటన్... లండన్/ముంబై: దాదాపు దశాబ్దం క్రితం బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి మరీ బ్రిటన్‌లో దక్కించుకున్న ఉక్కు వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది దేశీ దిగ్గజం టాటా స్టీల్. ఉక్కుకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోవడం, ఆర్థిక పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తుండటమే ఇందుకు కారణం. ముంబై ప్రధాన కార్యాలయంలో బోర్డు సుదీర్ఘ సమావేశం అనంతరం టాటా స్టీల్ బుధవారం ఈ మేరకు ప్రకటన చేసింది. గడిచిన ఏడాది కాలంగా అనుబంధ సంస్థ టాటా స్టీల్ యూకే ఆర్థిక పనితీరు దిగజారుతుండటంతో కంపెనీని పూర్తిగా లే దా విభాగాల వారీగా విక్రయించడం సహా ఇతర పునర్వ్యవస్థీకరణ అవకాశాలన్నింటినీ పరిశీలించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ మేరకు టాటా స్టీల్ యూరప్‌నకు తగు సూచనలు ఇచ్చినట్లు తెలిపింది. ‘అంతర్జాతీయంగా ఉక్కు సరఫరా పెరిగిపోవడం, యూరప్‌లోకి వర్థమాన దేశాల నుంచి దిగుమతులు ఎక్కువ కావడం, తయారీ వ్యయాలు భారీగా పెరగడంతో పాటు దేశీయంగా ఉక్కు డిమాండ్ తగ్గడం, కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైనవి ప్రస్తుత నిర్ణయానికి కారణం. భవిష్యత్‌లోనూ ఇవి కొనసాగే అవకాశముంది. ఇటీవలి కాలంలో పరిస్థితిని మెరుగుపర్చేందుకు యాజమాన్యం, సిబ్బంది కలసి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది’ అని టాటా స్టీల్ పేర్కొంది. గడిచిన నాలుగు త్రైమాసికాల్లో బ్రిటన్ కార్యకలాపాల బుక్ వేల్యూ సున్నా స్థాయిలోనే ఉందని టాటా గ్రూప్ ఈడీ (ఫైనాన్స్) కౌశిక్ చటర్జీ చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నామన్నారు. మరోవైపు, టాటా స్టీల్ యూకే వ్యాపారాన్ని అమ్మకానికి ఉం చినా.. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులెవరూ ముందుకు రాకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. టాటా స్టీల్ విక్రయ పరిణామాలపై చర్చించేందుకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కుటుంబంతో కలసి విదేశాల్లో సెల వులు గడుపుతున్న కామెరాన్.. తన ట్రిప్‌ను మధ్యలోనే ముగించుకుని, తిరిగి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరం.. తాజా పరిణామంతో టాటా స్టీల్ యూకే వ్యాపార విభాగంలో పనిచేస్తున్న వేలకొద్దీ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుంది. దీంతో అక్కడి కార్మిక సంఘాలు సంస్థను జాతీయం చేయాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. యూకే, ఐర్లాండ్‌లో కలిపి టాటా స్టీల్‌కు మూడు ప్లాంట్లు (పోర్ట్ టాల్బోట్, రోథర్హామ్, స్కన్‌థోర్ప్) ఉన్నాయి. వీటి వార్షికోత్పత్తి సామర్థ్యం సుమారు 11 మిలియన్ టన్నులు. బ్రిటన్‌లోని స్టీల్ ప్లాంట్లలో దాదాపు 15,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. వారి ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తగిన కొనుగోలుదారును అన్వేషిస్తామని పేర్కొంది. వేల కొద్దీ ఉద్యోగులను కాపాడేందుకు అవసరమైతే టాటా స్టీల్ యూకేలో భాగమైన పోర్ట్ టాల్బోట్ ప్లాంటులో తాత్కాలికంగా కొన్ని వాటాలు కొనుగోలు చేయడం సహా జాతీయకరణ తదితర ప్రత్యామ్నాయ అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ వాణిజ్య మంత్రి ఆనా సోబ్రీ పేర్కొన్నారు. కంపెనీకి సానుకూలం: రేటింగ్ ఏజెన్సీలు బ్రిటన్ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకోవాలన్న నిర్ణయం టాటా స్టీల్ రుణ పరపతి మెరుగుపడటానికి సానుకూలాంశమని రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ తెలిపింది. అయితే, పూర్తి ప్రణాళిక సిద్ధమయ్యే దాకా రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయలేమని పేర్కొంది. బ్రిటన్ వ్యాపారం అమ్మక ప్రతిపాదన వార్తలతో బీఎస్ఈలో టాటాస్టీల్ షేరు ధర 6.75% ఎగసి రూ. 324 వద్ద ముగిసింది. కోరస్‌తో ఎంట్రీ.. 2007లో ఆంగ్లో-డచ్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను కొనుగోలు చేయడం ద్వారా టాటా గ్రూప్ బ్రిటన్ ఉక్కు రంగంలో అడుగుపెట్టింది. అప్పట్లో బ్రెజిల్‌కి చెందిన సీఎస్ఎన్ సంస్థతో నెలల తరబడి హోరాహోరీగా పోటీపడి సుమారు 14 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి మరీ కోరస్‌ను టేకోవర్ చేసింది. దీనికోసం సమీకరించిన భారీ రుణాలే కంపెనీని వెన్నాడుతున్నాయి. మొత్తం మీద 25 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద స్టీల్ తయారీ సంస్థగా టాటా స్టీల్ ఆవిర్భవించింది. అలాగే ఫార్చూన్ 500 బహుళ జాతి సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీగా నిల్చింది. ఉక్కుకు డిమాండ్ కొనసాగిన పక్షంలో కంపెనీ గట్టిగానే నిలదొక్కుకునేది. కానీ, ఆ తర్వాత ఏడాదే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పరిస్థితులు నానాటికీ దిగజారుతూ వస్తున్నాయి. గత అయిదేళ్లలో టాటా గ్రూప్ దాదాపు 2 బిలియన్ పౌండ్ల మేర నష్టపోయింది. -
ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర !
* త్వరలో నిర్ణయించనున్న కేంద్రం * దేశీయ స్టీలు కంపెనీలకు పెద్ద ఊరట * ఒకే పోర్టుకు దిగుమతులు పరిమితం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఉక్కు (స్టీలు) రంగ కంపెనీలకు తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లో స్టీలు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర (ఎంఐపీ) నిర్ణయించనుంది. కేంద్ర వాణిజ్య శాఖతోపాటు ఉక్కు శాఖ సంయుక్తంగా 30-35 రకాల స్టీలు ఉత్పత్తులకు ఎంఐపీని నేడోరేపో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎంఐపీ కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల దిగుమతులకు చెక్ పెడతారు. దీంతో భారత్‌కు ప్రధాన ఎగుమతిదారైన చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, రష్యా తదితర దేశాల చవక ఉత్పత్తులకు అడ్డుకట్ట పడనుంది. మరోవైపు గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయం నుంచి మాత్రమే ఉక్కు ఉత్పత్తులను అనుమతించేలా నిబంధన రానుంది. చైనా, యూఎస్ తర్వాత అతిపెద్ద స్టీల్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఇన్ఫ్రా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రానుండడంతో ఇక్కడి విపణిపై సానుకూల పవనాలు వీస్తున్నాయి. పెద్ద కంపెనీలకూ కష్టాలు: చవక దిగుమతుల కారణంగా భారతీయ కంపెనీలు మార్కెట్లో పోటీపడలేకపోతున్నాయి. లాభాలు కుచించుకుపోతున్నాయని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్ తదితర దిగ్గజ కంపెనీలు కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశాయి. భారతీయ స్టీలు కంపెనీల తయారీ వ్యయం టన్ను స్టీలుకు సుమారు రూ.23 వేలుంటే, దిగుమతైన స్టీలు ధర రూ.16 వేలుంటోంది. ప్లాంట్ల సామర్థ్యం 20 శాతానికి మించడం లేదని, చాలా ప్లాంట్లు మూతపడ్డాయని ముంబైకి చెందిన ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఓఎన్జీసీ సైతం చైనా పైపులను దిగుమతి చేసుకుంటోందని వెల్లడించారు. పరిశ్రమను కాపాడాలంటే దిగుమతులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని పలు స్టీలు కంపెనీలను నిర్వహిస్తున్న కామినేని గ్రూప్ చైర్మన్ కామినేని సూర్యనారాయణ సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. లక్షల కోట్లలో పెట్టుబడులు.. దేశీయ స్టీలు కంపెనీలు విస్తరణకుగాను కోట్లాది రూపాయలను వెచ్చించాయి. ఇందుకోసం భారీగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల వద్ద నిరర్దక ఆస్తులు రూ.3.09 లక్షల కోట్లకు ఎగిశాయి. ఇందులో అత్యధిక వాటా స్టీల్ పరిశ్రమదేనని సమాచారం. కోల్డ్ రోల్డ్ ఫ్లాట్ స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం యాంటీ డంపింగ్ సుంకాన్ని రకాన్నిబట్టి 57.4 శాతం వరకు విధించింది. సీమ్‌లెస్ పైపులపైనా యాంటీ డంపింగ్ సుంకం విధించాలని మహారాష్ట్రకు చెందిన ఒక కంపెనీ ఎండీ తెలిపారు. భారత సీమ్‌లెస్ పైప్ మార్కెట్ రూ.15,000 కోట్లుగా ఉన్నప్పటికీ, ఒక్క భారతీయ సీమ్‌లెస్ పైప్ కంపెనీ కూడా ఆర్డరు పొందకపోవడం గమనార్హం. -
ఉద్యోగ సమాచారం
భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో వివిధ పోస్టులు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు చెందిన భిలాయ్ స్టీల్ ప్లాంట్.. సర్వేయర్ (ఖాళీలు-3), మైనింగ్ మేట్ (ఖాళీలు-11), బ్లాస్టర్ (ఖాళీలు-3) విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 12. వివరాలకు www.sailcareers.com/bhilaiచూడొచ్చు. సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థలో పలు పోస్టులు చండీగఢ్‌లోని సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ... సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ).. వివిధ విభాగాల్లో ప్రాజె క్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, సీనియర్ రీసెర్చ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 13. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 8, 9. వివరాలకు www.csio.res.inచూడొచ్చు. కొచ్చిన్ ఎయిర్ పోర్టలో జూనియర్ అసిస్టెంట్, అటెండెంట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట లిమిటెడ్ (సీఐఏఎల్).. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -3 ట్రైనీ (ఖాళీలు -11), జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 5 ట్రైనీ (ఖాళీలు-10) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 5. వివరాలకు www.career.cial.aeroచూడొచ్చు. కాన్పూర్ ఐఐటీలో ఆర్ఈఓలు కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో రీసెర్చ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ (ఆర్ఈఓ) గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 4. వివరాలకు www.iitk.ac.in/ infocell/RnD_Recruitmentచూడొచ్చు. రైస్ రీసెర్ చ ఇన్స్టిట్యూట్లో పలు ఖాళీలు కటక్‌లోని నేషనల్ రైస్ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఖాళీలు-3), స్కిల్డ్ హెల్ప్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి నవంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.crri.nic.inచూడొచ్చు. ఆయిల్ ఇండియాలో హెచ్ఎస్ఈ ఆఫీసర్లు ఆయిల్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో హెచ్ఎస్ఈ ఆఫీసర్స (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 30, డిసెంబర్ 1. వివరాలకు www.oilindia.comచూడొచ్చు. -
9 శాతం పెరిగిన సెయిల్ నికర లాభం
* ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది * 17.5 శాతం డివిడెండ్ * సెయిల్ చైర్మన్ సి. ఎస్. వర్మ న్యూఢిల్లీ: దేశీయ ఉక్కు దిగ్గజం, స్టీల్ అధారిటీ ఆప్ ఇండియా (సెయిల్) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో రూ.579 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3 నికర లాభం(రూ.533 కోట్లు)తో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని సెయిల్ చైర్మన్ సి.ఎస్, వర్మ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ ధరలు క్షీణించడం, దీంతో పాటు ముడి పదార్ధాల ధరలు కూడా తగ్గడం వల్ల నికర లాభం వృద్ధి చెందిందని వివరించారు. అయితే టర్నోవర్ మాత్రం 3 శాతం తగ్గి రూ.12,291కు క్షీణించిందని పేర్కొన్నారు.పస్తుత ఆర్థిక సంవత్సరానికి 17.5 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వాలని డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ భారం డివిడెండ్ ట్యాక్స్‌తో కలిపి రూ.870 కోట్ల వరకూ ఉంటుందని తెలిపారు. కేంద్ర విధానాల వల్ల రానున్న కాలంలో ఉక్కుకు డిమాండ్ పెరగగలదని చెప్పారు. రూ.72,000 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపధ్యంలో సెయిల్ షేరు బీఎస్ఈలో 2.45 శాతం పెరుగుదలతో రూ.75.25 వద్ద ముగిసింది. -
ఉద్యోగాలు
సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆపరేటర్ కం టెక్నీషియన్ - ట్రైనీ విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్. అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. అటెండెంట్ కం టెక్నీషియన్ విభాగాలు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్. అర్హతలు: పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 26 వెబ్సైట్: www.sail.co.in నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ పుణేలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. లైబ్రరీ ట్రైనీ పోస్టుల సంఖ్య: 2 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయసు: 26 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: అక్టోబర్ 8 వెబ్సైట్: www.niapune.com -
మందగమనానికి బ్రేక్ పడినట్లే!
న్యూఢిల్లీ: దేశీ స్టీల్ రంగంలో మందగమన పరిస్థితులకు ఫుల్స్టాప్ పడినట్లేనని ప్రభుత్వ రంగ దిగ్గజం సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ పేర్కొన్నారు. తయారీ రంగంతోపాటు, స్మార్ట్ సిటీలు, పోర్ట్‌లు, విద్యుత్ ప్లాంట్లు, పారిశ్రామిక వాడలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టడంతో స్టీల్‌కు డిమాండ్ పుంజుకోనుందని చెప్పారు. కంపెనీ 42వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా మాట్లాడుతూ వాటాదారులకు భవిష్యత్ వ్యూహాలను వెల్లడించారు. పెరగనున్న స్టీల్ డిమాండ్‌కు అనుగుణంగా ఆధునీకరణ, నాణ్యత, సాంకేతికత వంటి అంశాలకు పెద్దపీట వేయడం ద్వారా అదుపును చేపట్టినట్లు వివరించారు. వీటికితోడు ఉత్పత్తులను మెరుగుపరచడం, పనితీరును పటిష్టపరచడం వంటి చర్యలకు తెరలేపినట్లు తెలిపారు. బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తయారీసహా మరిన్ని రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశమివ్వడం ద్వారా ప్రభుత్వం వృద్ధికి బాటలు వేస్తున్నదని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటపడితే స్టీల్‌కు డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. వెరసి రానున్న కాలంలో దేశీయంగా స్టీల్ వినియోగం ఊపందుకోనుందని అంచనా వేశారు. విజన్ 2025లో భాగంగా... ప్రస్తుతం చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు కాకుండా విజన్ 2025 ప్రణాళిక అమలుకు సిద్ధపడుతున్నట్లు వర్మ చెప్పారు. ప్రణాళికలో భాగంగా రూ. 1,50,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా హాట్‌మెటల్ సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచుకోనున్నట్లు వెల్లడించారు. మహారత్న కంపెనీ అయిన సెయిల్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2013-14) 21% అధికంగా రూ. 2,616 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడంతోపాటు, వాటాదారులకు 20.20% డివిడెండ్‌ను చెల్లించినట్లు వివరించారు. అంతేకాకుండా కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 51,866 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు తెలిపారు. ఈ బాటలో 8.6% వృద్ధితో 12.09 మిలియన్ టన్నుల స్టీల్‌ను విక్రయించినట్లు తెలిపారు. -
నెలాఖర్లో సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: ఈ నెల 24-26 మధ్య ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ జరిగే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనిలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపారు. బీఎస్ఈలో మంగళవారంనాటి ముగింపు ధర రూ. 77.15 ప్రకారం చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లు లభించే అవకాశముంది. ఇందుకు ఇప్పటికే రోడ్‌షోలు పూర్తయినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వెరసి సెయిల్ ద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపునివ్వనున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సెయిల్‌లో 10.82% వాటాను విక్రయించేందుకు 2012 జూలైలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా 2013 మార్చిలో తొలి దశకింద 5.82% వాటాను అమ్మివేసింది కూడా. లక్ష్యంవైపు చూపు ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూలు) వాటాల విక్రయం ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిలో 30% వరకూ అంటే రూ. 18,000 కోట్లను ఒక్క ఓఎన్జీసీ ఇష్యూ ద్వారానే సమకరించేందుకు అవకాశముంది. కాగా, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం సెయిల్, ఓఎన్‌జీసీలతోపాటు, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, పీఎఫ్సీ, ఆర్‌ఈసీలలో వాటాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు ఓఎఫ్ఎస్ మార్గాన్ని ఎంచుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అధిక అవకాశాలను కల్పించే బాటలో ప్రభుత్వం రిటైల్ కోటాను పెంచడమేకాకుండా ఆఫర్ ధరలో డిస్కౌంట్‌ను సైతం అందిస్తోంది. సాధారణంగా ఓఎఫ్‌ఎస్‌కు ధరను ఒక రోజు ముందు మాత్రమే ప్రకటిస్తోంది. ఇక ఇష్యూ తేదీని రెండు రోజుల ముందు ప్రకటించనుంది. సెబీ ఓకే ఓఎఫ్ఎస్ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టేందుకు టాప్-100 కంపెనీలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2013 జనవరిలో అనుమతించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా లిస్టెడ్ కంపెనీలు షేర్ల అమ్మకాన్ని వేలం ద్వారా నిర్వహిస్తాయి. మరోవైపు పబ్లిక్కు కనీసం 25% వాటా కల్పించేందుకు వీలుగా ఓఎఫ్ఎస్ను చేప్టేందుకు పీఎస్‌యూలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్) పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్-సి: 1 ప్రాజెక్ట్ సైంటిస్ట్- సి/బి: 2 ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి: 3 ప్రాజెక్ట్ అసిస్టెంట్: 3 ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్: 1 ఆఫీస్ అసిస్టెంట్: 2 ప్రాజెక్ట్ అసిస్టెంట్(హిందీ ట్రాన్స్‌లేటర్): 2 అభ్యర్థులకు నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్లైన్లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి, పోస్టు ద్వారా పంపాలి. చివరి తేది: జూలై 31 వెబ్సైట్: www.incois.gov.in స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) పోస్టులు: కన్సల్టెంట్/స్పెషలిస్ట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ నర్సింగ్ సిస్టర్(ట్రైనీ) నర్సింగ్ బ్రదర్(ట్రైనీ) అభ్యర్థులకు నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు, వయోపరిమితి ఉండాలి. ఎంపిక: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ, నర్సింగ్ విభాగం పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా చివరి తేది: ఆగస్టు 9 వెబ్సైట్: www.sail.co.in కోయర్ బోర్డ్-కోచీ పోస్టులు: సైంటిఫిక్ అసిస్టెంట్ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జూనియర్ ఆడిటర్ లోయర్ డివిజన్ క్లర్క్ హిందీ టైపిస్ట్ ట్రైనింగ్ అసిస్టెంట్ మెకానిక్ ఆపరేటర్ హెల్పర్ ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దర ఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి. చివరి తేది: ఆగస్టు 7 వెబ్సైట్: www.coirboard.gov.in సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్- ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ కోర్సులు: ఎంఈ (మెకానికల్-క్యాడ్/క్యామ్) ఎంఈ (టూల్ డిజైన్) ఎంఈ (డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్) ఎంటెక్ (మెకట్రానిక్స్) ఎంఈ (టూల్ డిజైన్-పార్ట్‌టైమ్) ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 4 వెబ్సైట్: www.citdindia.org -
వైఎస్ఆర్ జిల్లాకు సెయిల్ నిపుణుల కమిటీ
కడప : భారత ఉక్కు సంస్థ బృందం శనివారం కడప చేరుకున్నారు. సెయిల్ బృందం సభ్యులు తొమ్మిదిమంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాలను సెయిల్ బృందం పరిశీలించనుంది. కాగా రాష్ట్ర విభజనలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్న ప్రకటన అందరిలోనూ ఆశలు రేకెత్తిస్తోంది. -
ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఆమోదం
ఇల్లెందు, న్యూస్‌లైన్: జిల్లాలో 30వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు పరిశ్రమ (స్టీల్ ప్లాంట్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆయన గురువారం కొత్తగూడెం, ఇల్లెందు, బయ్యారం మండలాల్లో పర్యటించారు. అనంతరం, ఇల్లెందులోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించేందుకు న్యూఢిల్లీ నుంచి తొమ్మిదిమందితో కూడిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిందని అన్నారు. బయ్యారం మండలంలోని ధర్మాపురం (నామాలపాడు), పాల్వంచ మండలంలోని మూడు ప్రాంతాలను, కొత్తగూడెం మండలంలో ఒక ప్రాంతాన్ని ఈ బృందం పరిశీలించిందన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2500 ఎకరాలు... టౌన్షిప్ కోసం మరో 500 ఎకరాల స్థలం అవసరమవుతుందని జేసీ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు 1.5 టీఎంసీ నీరు కావాల్సుంటుందని చెప్పారు. దీని కోసం కిన్నెరసాని, గోదావరి, బయ్యారం పెద్ద చెరువులను సెయిల్ బృందానికి చూపినట్టు చెప్పారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన సున్నపు రాయిని మన పక్కనున్న నల్గొండ జిల్లా నుంచి తెప్పించవచ్చని అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై మైనింగ్, రెవిన్యూ, ఇరిగేషన్, సింగరేణి, పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్, జెన్కో అధికారులతో బుధవారం ఖమ్మంలో చర్చించినట్టు చెప్పారు. సెయిల్ బృందం సర్వే అనంతరం నివేదికను డిల్లీకి పంపిస్తామన్నారు. ఆ తర్వాత, ప్లాంటు నిర్మాణ ప్రదేశంపై స్పష్టత వస్తుందన్నారు. -
క్షేత్రస్థాయిలో.. ‘సెయిల్’ పర్యటన
కొత్తగూడెం/బయ్యారం, న్యూస్‌లైన్ : బయ్యారం మండలంలో ఉన్న ఐరన్‌ఓర్‌ను వినియోగించి జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) బృందం గురువారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ నేతృత్వంలో సెయిల్ బృందం సభ్యులు కొత్తగూడెం, పాల్వంచ, బయ్యారం మండలాల్లోని భూములను పరిశీలించారు. తొలుత కొత్తగూడెం మండలంలోని రేగళ్ల పంచాయతీ కూనారం, పాల్వంచ మండలంలోని చంద్రాలగూడెం ప్రాంతాలలో పర్యటించారు. కిన్నెరసాని జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కారేగట్టు, ఉల్వనూరు, చంద్రాలగూడెం ప్రాంతాలలో పర్యటించి తొమ్మిది వేల ఎకరాల అటవీ, అసైన్డ్ భూములకు సంబంధించిన మ్యాప్‌లు పరిశీలించారు. అయితే ఇక్కడి నుంచి పాండురంగాపురం రైల్వే ట్రాక్, విద్యుదుత్పత్తి చేసే కేటీపీఎస్, భద్రాచలం గోదావరి ఎంత దూరం ఉంటాయనే వివరాలను సెయిల్ బృందం సభ్యులు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉల్వనూరు వద్ద 21 వేల ఎకరాలు, చంద్రాలగూడెం వద్ద 8.50 వేల ఎకరాల భూములను పరిశీలించారు. ఆ తర్వాత కొత్తగూడెం మండలం రేగళ్ల పంచాయతీ కూనారంలోని 839 ఎకరాల అంబసత్రం భూములు, 4,300 ఎకరాల అటవీశాఖ భూముల మ్యాప్‌లను తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ 4 కి.మీ. దూరంలో ఉంటుందని, గోదావరి నది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అటవీ అధికారులు సెయిల్ బృందానికి వివరించారు. అనంతరం బయ్యారం మండలం ధర్మాపురం పరిధిలోని 4028 ఎకరాల భూములకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే లభ్యమయ్యే వనరుల గురించి జేసీ సురేంద్రమోహన్ సెయిల్ బృందానికి వివరించారు. ఆ తర్వాత బయ్యారం పెద్ద చెరువును సందర్శించి నీటివనరుల గురించి చర్చించారు. ఈ బృందంలో జేసీ వెంట సెయిల్ అధికారులు ఎ.మేథి, వి.సర్కార్, కుమార్, కె.ఎస్.సవారి, బెనర్జీ, డి.సాహు, సోమేశ్వరసింగ్, ఎ.కె.జా, డీజీఎం (ఐరన్) రాజన్కుమార్సిన్హా ఉన్నారు. -
రేపు సెయిల్ అధికారుల రాక
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈనెల 24, 25తేదీలలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) అధికారుల బృందం జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి.గోపాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 9 మంది నిపుణులతో కూడిన సెయిల్ బృందం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్నట్లు తెలిపారు. ఈనెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగే సమావేశంలో మైన్స్, ఇరిగేషన్, విద్యుత్, పొల్యూషన్ కంట్రోల్ సంబంధిత శాఖల అధికారులతో సెయిల్‌బృందం సమావేశమై చర్చిస్తుందన్నారు. 25వ తేదీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని ఆయన వివరించారు. -
బయ్యారం.. బంగారం
ఖమ్మం: బయ్యారం తెలంగాణ కొంగు బంగారం కానుందా..? తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా..? నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకనుందా..? అవుననే చెబుతోంది.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నిపుణుల బృందం ఖమ్మం జిల్లా పర్యటన. ఈ బృందం జిల్లాలో పర్యటించి స్టీల్ కర్మాగారం ఎక్కడ నిర్మాణం చేపట్టాలన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు మంగళవారం 8 మందితో కూడిన సెయిల్ కమిటీ బృందం కలెక్టరేట్లో జేసీ సురేంద్రమోహన్, పరిశ్రమలు, ట్రాన్స్‌కో, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చింది. ఖనిజ వనరులు నిక్షిప్తమై ఉన్న ప్రాంతానికి సమీపంలో విద్యుత్, నీరు, ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన భూమి ఎక్కడ అనువుగా ఉందో వాటిపైనే ఆయా అధికారుల నుంచి సమాచారం సేకరించింది. ఈ వనరుల్లో ఎక్కువగా ఏవి ఒకేచోట ఉంటాయో అక్కడే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు ఈ కమిటీలోని వివిధ విభాగాల సాంకేతిక నిపుణులు సమాచారం తీసుకున్నారు. బయ్యారానికే అవకాశం.. సెయిల్ కమిటీ అధ్యయన బృందం ఇటు బయ్యారం, అటు కొత్తగూడెం మండలాల్లో కర్మాగారం నిర్మాణానికి భూమి అన్వేషణ చేస్తున్నా.. బయ్యారంలోనే ఫ్యాక్టరీ నిర్మాణం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెంలో బొగ్గు, కిన్నెరసాని నీటి వనరులున్నా అక్కడ అంతా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండడంతో ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణంపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ. 30 వేల కోట్లతో భారీఎత్తున ఫ్యాక్టరీ నిర్మా ణం చేపడుతుండడంతో అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్న చోట భవిష్యత్‌లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే నిర్మాణ వ్యయమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం ప్రాంతమంతా అండర్‌గ్రౌండ్ మైన్లు ఉండడంతో ఇక్కడ భూమి అన్వేషణ చేసినా.. నిర్మాణానికి మాత్రం బయ్యారం ప్రాంతం సేఫ్ జోన్‌గా జీఎస్ఐ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బయ్యారంలో ఓవైపు ముడి ఇనుప ఖనిజం తీసినా.. మరోవైపు సేఫ్ జోన్‌గా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనువైన భూమి ఉండడం, రఘునాథపాలెం పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్, పెద్ద చెరువు లేదా మున్నేరు నుంచి నీరు వినియోగించుకునే సౌకర్యం ఉండడంతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపైనే సెయిల్ అధికారులు పూర్తిస్థాయి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. అందుబాటులో వనరులు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. బయ్యారంలో 25,700 హెక్టార్లు, గార్లలో 18,330 హెక్టార్లు, నేలకొండపల్లిలో 12,660 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజం ఉంది. కారేపల్లి మండలం మాదారంలో 20 కిలోమీటర్ల మేరకు డోలమైట్ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇక్కడినుంచి ఈ ఖనిజం విశాఖలోని స్టీల్ ప్లాంట్‌కు రవాణా అవుతోంది. అలాగే నల్లగొండ జిల్లాలో సున్నపురాయి (లైమ్ స్టోన్) అందుబాటులో ఉందని.. బయ్యారం నుంచి ఇక్కడి గనులకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. అలాగే బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు రైలుమార్గం 11 కిలోమీటర్లలో దూరంలో ఉందని వివరించారు. బొగ్గు గనులు, విద్యుత్, రవాణా సౌకర్యాలు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి థర్మల్ శక్తి పుష్కలంగా ఉన్నట్లు అధికారులు కమిటీకి వివరించారు. సింగరేణి కాలరీస్ పరిధిలోని ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం, కొత్తగూడెం, మణుగూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓపెన్‌కాస్టు, అండర్‌గ్రౌండ్ మైన్స్ నుంచి బొగ్గు రానుందని చెప్పారు. అలాగే బయ్యారానికి 30 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వస్తున్న 220కేవీఏ/400 కేవీ గ్రిడ్ అందుబాటులో ఉంది. ఇక స్టీల్ కర్మాగారానికి సెయిల్ నిబంధనల ప్రకారం 2,500 ఎకరాలు అవసరం. అయితే, బయ్యారం మండలం ధర్మాపురం గ్రామంలో సర్వే నంబర్ 452లో సుమారు 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇందులో 2 వేల ఎకరాలు అసైన్డ్ భూమి. కొత్తగూడెం మండలం కూనారం గ్రామంలో సర్వే నెంబర్ 13లో సుమారు 4,300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇక రవాణ సౌకర్యాల విషయానికొస్తే.. రైలు మార్గమైతే వరంగల్ జిల్లా గుండ్రాతిమడుగు స్టేషన్ నుంచి బయ్యారానికి 3 కిలోమీటర్లు, అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ (కాజీపేట) బయ్యారానికి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం అయితే ఇల్లెందు నుంచి బయ్యారానికి 23 కిలోమీటర్లు. అలాగే ఖమ్మం బస్టాండ్ కూడా సమీపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక కొత్తగూడెం మండలం కూనారం చేరుకోవాలంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్, బేతంపుడి (భద్రాచలం రోడ్డు), రైల్వే స్టేషన్లు సమీపంలోనే ఉన్నాయి. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గం ద్వారా కూనారం నుంచి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను కూడా చేరుకోవచ్చునని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇన్ని అవకాశాలుండడంతో బయ్యారంలోనే స్టీల్ కర్మాగారం ఏర్పాటునకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘ఉక్కు’ సంకల్పంతో..
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను అన్వేషించేందుకు సెయిల్ బృందం( స్టీల్ఆధారిటీఆఫ్ ఇండియా) బుధవారం ఇక్కడకు వచ్చింది. తొమ్మిది మందితో కూడిన ఈ బృందం జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌తో కలెక్టరేట్లో సమావేశం అయింది. స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూములు, వనరులు, ఖనిజ నిక్షేపాలు, నీరు, విద్యుత్, రవాణా తదితర వసతులు, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను కూలంకషంగా చర్చించింది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనుండటం గర్వకారణమని జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ వ్యాఖ్యానించారు. అధికారులందరూ ఈ బృందానికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని ఆదేశించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... ‘ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2,500 ఎకరాల స్థలం అవసరం. దీనికి బయ్యారం, కొత్తగూడెం మండలం కూనారం చుట్టుపక్కల భూములను పరిశీలించాం. బయ్యారం మండలం ధర్మాపురంలోని 452 సర్వేనంబర్‌లో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో రెండువేల ఎకరాలు అసైన్డ్ భూమి. పాల్వంచ మండలం ఉల్వనూరులో 318 సర్వే నెంబర్లో 21,960 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఐదువేల ఎకరాలు అసైన్డ్ భూమి. మిగిలింది రిజర్వ్ ఫారెస్ట్ భూమి. కొత్తగూడెం మండలం కూనారంలో4,300 ఎకరాల ప్రభుత్వ భూమి 3/3 సర్వే నంబర్లో ఉంది. పాల్వంచ మండలం కారేగట్టు అనే గ్రామంలో 38 సర్వేలో 9,111 ఎకరాలు,చంచులగూడెంలో 95/1 సర్వే నంబర్లో 9,680 ఎకరాల భూమి ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అనువైన వాటిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇనుప ఖనిజం నిక్షేపాలు జిల్లాలో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో అపారంగా ఉన్నాయి. ఈ ఇనుప ఖనిజాలు హెమటైట్ క్వార్ట్లైట్స్తో కలిసి ఉన్నాయి. ఈప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నాయి. బయ్యారానికి 20 కిలోమీటర్ల దూరంలోని మాధారంలో డోలమైట్ యూనిట్ ఉంది. 90 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ జిల్లాలో సున్నపురాయి అపారంగా ఉంది.’ అని జేసీ వివరించారు. బయ్యారంలో మండలంలో 230 హెక్టార్లలో ఒక చోట, 318 హెక్టార్లలో మరో చోట ఇనుప ఖనిజం ఉందని ఏపీఎండీసీ పీఓ శివకుమార్ పేర్కొన్నారు. సెయిల్‌బృందం మాటల్లో... ఉక్కు పరిశ్రమ నెలకొల్పుటకు ఇనుపఖనిజం, మాగ్నైట్, హెమటైట్ ఖనిజాలు అవసరమని సెయిల్ బృందం తెలిపింది. సున్నపురాయి వంటి ముడిసరుకు పక్కజిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు అంది. ఇల్లెందు మండలం కాంచనపల్లిలో బొగ్గుగనులు పుష్కలంగా ఉన్నాయని సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ జీవీ రెడ్డి తెలిపారు. ఉక్కుపరిశ్రమకు రోజుకు 49 క్యూసెక్కుల నీరు అవసరమని జేసీ తెలిపారు. ఈ నీటిని బయ్యారం పెదచెరువు, మున్నేరు, కిన్నెరసాని, గోదావరి నుంచి తరలించవచ్చన్నారు. 550 మెగావాట్ల విద్యుత్ అవసరమని, దీనికి 220 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్య నియంత్రణబోర్డు పరిమితులకు లోబడి వ్యవహరించాలని జేసీ సూచించారు. ఈ సమావేశంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు ఎ. మేథీ, లే అవుట్ డెప్యూటీ జనరల్ మేనేజర్ బి.సర్కార్, డీఎం కుమార్, సీనియర్ మేనేజర్ కేఎస్ సవారి, అసిస్టెంట్ మేనేజర్ బెనర్జీ, డి.సాహూ, డీజీఎం సోమేశ్వర్సింగ్, ఏకే జా, డీజీఎం (ఐరన్) రాజన్‌కుమార్ సిన్హా, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ శ్రీనివాస్‌నాయక్, మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ తిరుమలరావు పాల్గొన్నారు. నేటి పర్యటన ఇలా.... స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం జిల్లాలో క్షేత్ర పర్యటన చేస్తారు. ఉదయం కిన్నెరసాని, పాల్వంచ, కొత్తగూడెం, బయ్యారం తదితర ప్రాంత్లాలో పర్యటించి వనరులు, పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తారు. -
‘సెయిల్’ సార్లొస్తున్నారు..
* బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అధ్యయన కమిటీ రాక *నేడు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ రేపు క్షేత్ర సందర్శన * రూ. 30 వేల కోట్ల వ్యయం * 2,500 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన * సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వనున్న కమిటీ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నిపుణుల బృందం నేడు జిల్లాకు రానుంది. బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ను పరిశీలించేందుకు వస్తున్న ఎనిమిది మంది సభ్యుల బృందం రెండు రోజుల పాటు జిల్లాలోనే ఉంటుంది. సెయిల్ నిపుణుడు అశోక్‌కుమార్ ఝా నేతృత్వంలోని ఈ బృందం తొలిరోజు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చర్చించనుంది. రెండో రోజున జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ నేతృత్వంలో బయ్యారం వెళ్లి క్షేత్ర సందర్శన చేస్తుంది. అనంతరం ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే భారీ ప్రాజెక్టు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో స్టీలు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో స్టీలు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు ఆరునెలల్లోపు కమిటీ అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా పేర్కొన్నారు. ఈ మేరకు కమిటీ ప్రతి నిధులు రాష్ట్రానికి వచ్చారు. మంగళవారం వీరంతా పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమిషనర్లను కలిసి ఫ్యాక్టరీ ప్రతిపాదనలను తెలుసుకున్నారు. మొత్తం రూ.30 వేల కోట్ల వ్యయంతో, 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమల అధికారులు తెలియజేశారు. అయితే, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గాను అవసరమైన భూసేకరణ, నీటి వసతి, రవాణా(రోడ్డు, రైలు మార్గాలు), విద్యుత్ తదితర సౌకర్యాలపై ఈ కమిటీ జిల్లా ఉన్నతాధికారులతో బుధవారం చర్చించనుంది. కాగా, పరిశ్రమ కు అవసరమయ్యే ముడి ఖనిజాలైన డోల మైట్, ఇనుము, బొగ్గు జిల్లాలోనే అందుబాటులోనే ఉన్నాయి. వీటితో పాటు అవసరమ య్యే సున్నపురాయి (లైమ్‌స్టోన్) నిక్షేపాలు మాత్రం అందుబాటులో లేవు. ఈ నేపథ్యం లో పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పరిసరాల నుంచి లైమ్‌స్టోన్‌ను తెచ్చుకోవాలని జిల్లా అధికారులు యోచిస్తున్నా రు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై చర్చించి పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సెయి ల్ ప్రతినిధి బృందం కేంద్రానికి నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది!
వివిధ శాఖల అధికారులతో సెయిల్ నిపుణుల సమాలోచనలు నేటి నుంచి ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) లిమిటెడ్ బృందం అధ్యయనం ప్రారంభించింది. ఇందులో భాగంగా సెయిల్ అధికారి అశోక్ కుమార్ ఝా నేతృత్వంలోని సాంకేతిక బృందం పరిశ్రమలశాఖ కమిషనర్ రజత్‌కుమార్‌తో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ అధికారులతో పాటు మైనింగ్, విద్యుత్, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో ఏయే ప్రాంతాల్లో బొగ్గు నిల్వలు ఉన్నాయి? ఎంత మేర ఉన్నాయి? అక్కడ ఉన్న భూమి వివరాలతోపాటు విద్యుత్ డిమాండ్, సరఫరా అంశాలను ఈ సందర్భంగా అధికారులతో సెయిల్ బృందం చర్చించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఆరు నెలల్లోగా సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని సెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం-2014లో కేంద్రం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా సెయిల్ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ఖమ్మంలో పర్యటన సెయిల్ సాంకేతిక బృందం ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో వరుసగా పర్యటించనుంది. ముందుగా ఈ నెల 21, 22 తేదీల్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనుంది. అనంతరం 23, 24 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనుందని తెలిసింది. సుమారు 15 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను ఈ బృందం అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. -
దాల్మియా సిమెంట్ చేతికి బొకారో జేపీ
న్యూఢిల్లీ: రుణభారం తగ్గించుకునే దిశగా ఇన్ఫ్రా దిగ్గజం జైప్రకాశ్ అసోసియేట్స్.. బొకారో జేపీ సిమెంట్‌లో తనకున్న మొత్తం 74 శాతం వాటాలను దాల్మియా సిమెంట్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 690 కోట్లుగా ఉండనుంది. దీని ద్వారా వచ్చే నిధులను జేపీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ఉక్కు దిగ్గజం సెయిల్‌తో కలిసి జేపీ అసోసియేట్స్ ఏర్పాటు చేసిన రెండు జాయింట్ వెంచర్లలో బొకారో జేపీ సిమెంట్ (బీవోజేసీఎల్) కూడా ఒకటి. ఇందులో జేపీ గ్రూప్‌కి 74 శాతం, సెయిల్‌కి 26 శాతం వాటాలు ఉన్నాయి. బీవోజేసీఎల్‌కి జార్ఖండ్‌లోని బొకారోలో 2.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (వార్షిక) గల సిమెంటు ప్లాంటు ఉంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ సారథ్యంలోని ఏసీసీ కూడా బీవోజేసీఎల్ కోసం పోటీపడినప్పటికీ.. దాల్మియా మెరుగైన ఆఫర్ ఇవ్వడంతో దాని వైపు మొగ్గు చూపినట్లు జేపీ అసోసియేట్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి దాల్మియా సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సోమవారం కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. సెయిల్‌తో మరో జాయింట్ వెంచర్ అయిన భిలాయ్ ప్లాంటు (2.2 మిలియన్ టన్నుల సామర్థ్యం) విషయంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. సిమెంటు తయారీ రంగంలో జేపీ సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద కంపెనీ. రియల్ ఎస్టేట్, విద్యుత్ తదితర రంగాల్లో కూడా గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. ప్రస్తుతం బీవోజేసీఎల్‌లో 74 శాతం వాటాల కింద 9.89 కోట్ల షేర్లను జేపీ అసోసియేట్స్ (జేఏఎల్) విక్రయిస్తోంది. రూ. 18.57 విలువ చేసే ఒక్కో షేరును దాదాపు రూ. 69.74 ధరకి విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. భాగస్వామ్య సంస్థ సెయిల్‌తో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి విక్రయం జరుగుతుందని వివరించింది. భిలాయ్ జాయింట్ వెంచర్ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. సెయిల్‌తో ఉన్న రెండు జాయింట్ వెంచర్ సిమెంట్ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను జేపీ గ్రూప్.. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోనుంది. జేపీ గ్రూప్ గతేడాది 4.8 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యమున్న సిమెంట్ ప్లాంటును ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌కి విక్రయించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులను విక్రయించే దిశగా అబుధాబి నేషనల్ ఎనర్జీ కంపెనీతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బోర్డ్ మీటింగ్ నేపథ్యంలో జైప్రకాశ్ అసోసియేట్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో సోమవారం 1.34% లాభపడి రూ.49.05 వద్ద ముగిసింది.