
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు తయారీ సంస్థ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్‌కు భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా రూ.329 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.26,642 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెయిల్ రూ.4,339 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం.
ఆదాయం కూడా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.27,007 కోట్లు గా ఉంది. ప్రధానంగా వ్యయాలు రూ. 21,289 కోట్ల నుంచి రూ.27,201 కోట్లకు పెరిగాయి. 4.30 మిలియన్ టన్నుల స్టీల్‌ను కంపెనీ తయారు చేసింది. క్రితం ఏడాది క్యూ2లో 4.28 మిలియన్ టన్నుల స్టీల్ విక్రయించగా, తాజాగా ముగిసిన త్రైమాసికంలో 4.21 మిలియన్ టన్నులుగా ఉంది.