బ్యాంకులు ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మారాయి. ఎంత ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏదో ఒక పని కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటోంది. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం చాలా అవసరం.
ప్రతి నెలలో ఉన్నట్లుగానే సెప్టెంబరు నెలలోనూ ఆది, రెండు, నాలులో శనివారాలతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇటీవలే గణేష్ చతుర్థి సందర్భంగా చాలా నగరాల్లో బ్యాంకులు మూతపడ్డాయి. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి ఆరు రోజులుపాటు వరుస సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు దేశవ్యాప్తంగా కాక ఆయా ప్రాంతాలను బట్టి ఉన్నాయి.
ఇదీ చదవండి: ‘స్టార్ ధన వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్
ఆర్బీఐ విడుదల చేసిన సెప్టెంబర్ బ్యాంక్ హాలిడే లిస్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 13 నుండి 18 వరకు బ్యాంక్ సెలవులు ఉండబోతున్నాయి. ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ సెలవుందో చూడండి..
» సెప్టెంబర్ 13 రామ్‌దేవ్ జయంతి తేజ దశమి సందర్భంగా రాజస్థాన్‌లో సెలవు
» సెప్టెంబర్ 14 రెండో శనివారం దేశవ్యాప్తంగా హాలిడే
» సెప్టెంబర్ 15 ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
» సెప్టెంబర్ 16 ఈద్ ఈ మిలాద్ సందర్భంగా చాలా ప్రాంతాల్లో సెలవు
» సెప్టెంబర్ 17 ఇంద్ర జాతర సందర్భంగా సిక్కింలో హాలిడే
» సెప్టెంబర్ 18 శ్రీ నారాయణగురు జయంతి సందర్భంగా కేరళలో సెలవు
సెలవు రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. ఎక్కువ రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో పనులు ఉన్నవారు వీటికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నందున ఖాతాదారులు వీటిని విగియోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment