భారత ఉక్కు సంస్థ బృందం శనివారం కడప చేరుకున్నారు.
కడప : భారత ఉక్కు సంస్థ బృందం శనివారం కడప చేరుకున్నారు. సెయిల్ బృందం సభ్యులు తొమ్మిదిమంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాలను సెయిల్ బృందం పరిశీలించనుంది. కాగా రాష్ట్ర విభజనలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్న ప్రకటన అందరిలోనూ ఆశలు రేకెత్తిస్తోంది.