steelplant
-
స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఉక్కుపాదం నోరు మెదపని కూటమి ప్రభుత్వం
-
విశాఖ విమల విద్యాలయం మూసివేత
ఉక్కునగరం/గాజువాక: స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉచిత తెలుగు మీడియం పాఠశాల.. ‘విశాఖ విమల విద్యాలయం’ హఠాత్తుగా మూతపడింది. పాఠశాలలు తెరుచుకునే ముందు రోజు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చింది. దీంతో సుమారు రెండు వేల మంది విద్యార్థులతో పాటు 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డున పడ్డారు. స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్లో తెలుగు విద్యార్థులు, నిర్వాసిత ప్రజల పిల్లల సౌకర్యార్థం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అభ్యర్థన మేరకు విశాఖకు చెందిన ఆర్సీఎం డయాసిస్ మిషన్ సంస్థ ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి బిల్డింగ్‌తో పాటు విద్యుత్, మంచినీటి సరఫరా, ఫీజులు, సిబ్బంది జీతాలను ఉక్కు యాజమాన్యమే చెల్లిస్తోంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు, నిత్యం కూలి పనులు చేసుకునే వారి పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఎంవోయూను రెన్యువల్ చేస్తారు. యాజమాన్యం ఏడాదికి సుమారు రూ.6 నుంచి 7 కోట్లు జీతాల రూపేణా చెల్లిస్తోంది. ఈ ఏడాది మే 31తో ఎంవోయూ గడువు ముగియనున్న నేపథ్యంలో గతేడాది అక్టోబర్ నుంచి మిషన్ ప్రతినిధులు ఎంవోయూ రెన్యువల్ కోసం అభ్యర్థన పంపారు. యాజమాన్యం ఎంవోయూ కొనసాగిస్తుందన్న ధీమాతో పాఠశాల యాజమాన్యం ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తి చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలు చేసింది. ఈ నెల 11న ఉక్కు యాజమాన్యం నుంచి పిడుగు లాంటి వార్త అందింది. పాఠశాల నిర్వహణకు బిల్డింగ్ ఇస్తామని సొంత ఫీజులతో పాఠశాల నిర్వహణకు సంబంధించి కొత్త ఎంవోయూ చేసుకుందామని తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యం హడావుడిగా ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు 13 నుంచి పాఠశాలకు రావొద్దని సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, పల్లా పెంటారావు తదితరులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.సొంతంగా నిర్వహించలేం గత 40 ఏళ్లుగా స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో పాఠశాల నడుస్తోంది. రెన్యువల్ కోసం అభ్యర్థించగా కొత్త ఎంవోయూకు సిద్ధమవమంటున్నారు. ఫీజులు వసూలు చేసుకుని జీతాలు చెల్లించుకోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలతో సమానంగా చెల్లించే మాకు సొంత ఫీజులతో పాఠశాల నిర్వహించే పరిస్థితి లేదు. – ఫాదర్ రత్నకుమార్, కరస్పాండెంట్ ఆర్సీఎం మిషన్ సీఎండీ బంగ్లా ముట్టడిస్తాం స్టీల్‌ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల పిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలను మూసివేయడం అన్యాయం. పాఠశాలను వెంటనే తెరిపించకపోతే సీఎండీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. రెండు వేల మంది పిల్లల అంశంపై అడ్మిన్, సీఎండీ బంగ్లాను ముట్టడిస్తాం. – బి.గంగారావు, 78వ వార్డు కార్పొరేటర్ పాఠశాల తెరిపిస్తాం హఠాత్తుగా పాఠశాలను మూసివేస్తే ఉపా«ధ్యాయులు, విద్యార్థులు రోడ్డున పడాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల సహకారంతో ఉక్కు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. పాఠశాలను తెరిపించే వరకూ వదిలే ప్రసక్తే లేదు. – పల్లా పెంటారావు, కార్మిక నాయకుడు మా పిల్లల పరిస్థితేంటి? కూలీ, నాలీ చేసుకుని బతుకులు సాగిస్తున్నాం. నా భర్త చనిపోతే నేను కూలి పనిచేసుకుంటూ నా కొడుకుని ఈ పాఠశాలలో చదివిస్తున్నాను. ఇప్పుడు పాఠశాల మూసేస్తామంటే ఎక్కడ చదవాలి? ఎవరు చేర్చుకుంటారు మాలాంటి పేదోళ్లను. – కృష్ణమ్మ, విద్యార్థి తల్లి మా చదువులు ఎలా? నేను పదో తరగతికి వచ్చాను. మేము చాలా పేదోళ్లం. మా తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్తోమత లేదు. ఇప్పుడు మా పరిస్థితేంటి? మా చదువులు మధ్యలో ఆగిపోవాల్సిందేనా? – 10వ తరగతి విద్యార్థిని ఆందోళన వద్దు ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభం విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని గాజువాక ఎంఈవోలు ఎం.సునీత, బి.విశ్వనాథం గురువారం ఓ ప్రకటనలో కోరారు. పాఠశాల మూసివేత వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లామని, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా జిల్లా విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఏం చేసిందో చెప్పగలదా?
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె
-
పేపర్లో కాదు..ప్రజల్లోకి వెళ్ళి చూడండి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనేది పేపర్లో కాదని, స్వయంగా ప్రజల మధ్యకు వెళ్ళి చూసి ప్రభుత్వానికి మద్దతు పలకాలని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్ష నేతల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు... కానీ పేదోళ్ల పిల్లల మాత్రం ఇంగ్లీష్ పాఠశాలలో చదవకూడదా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం నెరవేర్చుతున్నారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. అన్ని జిల్లాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు. -
కడప ఉక్కు కల సాకారం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ ప్రజల దశాబ్ధాల కల నేడు సాకారం కానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేశారు. ఇందుకోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. విభజన హామీ చట్టం ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రంతో పలుదఫాలు చర్చించి కీలకమైన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండీసీతో డిసెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా, ఎన్ఎండీసీ 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి అంగీకరించింది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. ఈ యూనిట్‌కు కేటాయించిన స్థలం నుంచే కడప–నంద్యాల రైల్వే ట్రాక్ ఉండటంతో పాటు ఏడు కిలోమీటర్ల దూరంలోనే 400 కేవీ సబ్‌స్టేషన్ కూడా ఉంది. ఇలా కీలకమైన అన్ని వనరులు సమకూరిన తర్వాతే శంకుస్థాపన చేస్తుండటం.. ఈ ప్రాజెక్టుపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఈ కర్మాగారానికి రూ.250 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి రాయితీల డిమాండ్ ఈ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు అదనంగా కేంద్రం నుంచి కూడా పలు రాయితీలను కోరుతోంది. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి తొలి ఏడేళ్లు ఐజీఎస్టీ మినహాయింపు, పదేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు, దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాల మినహాయింపులను కోరుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ రూపాయికే ఇవ్వనుంది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, భూమి కొనుగోలు లేదా లీజు ఫీజుపై 100 శాతం మినహాయింపు, ఏడేళ్లపాటు ఎస్జీఎస్టీ వంటి అనేక రాయితీలను ఆఫర్ చేస్తోంది. కడపలో అభివృద్ధి పరుగులు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే వైఎస్సార్ జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు వైద్యశాలలు, రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ సచివాలయ భవనాలతోపాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండటంతో జిల్లా దశ తిరిగినట్లేనని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ వల్ల స్థానికంగా వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది. సీఎం శంకుస్థాపనలు, ప్రారంబోఉత్సవాలు ఇలా.. ►23వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►కుందూనదిపై కుందూ – తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి, కర్నూలు – వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో నిరి్మస్తున్న రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద నిర్మించనున్న ఆనకట్టకు సంబంధించి దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►సాయంత్రం కడపలో రిమ్స్ పరిధిలో రూ.107 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, రూ.175 కోట్లతో నిర్మించే సూపర్ స్పెషాలిటీ విభాగం, రూ.40.80 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లకు శంకుస్థాపన చేస్తారు. ఇదే సందర్భంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత నిధులతో నిరి్మంచిన ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ప్రారంభిస్తారు. ►రూ.20 కోట్లతో కడపలో నిరి్మంచనున్న డి్రస్టిక్ట్ పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన. ►కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిరి్మంచిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ►24వ తేదీ రాయచోటి ప్రాంతంలో రూ.1,272 కోట్లతో ఎత్తిపోతల ద్వారా జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) – హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ నీవా సుజల స్రవంతి) అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయచోటి జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►25వ తేదీ పులివెందులలో రూ.347 కోట్లతో నిరి్మంచనున్న మెడికల్ కళాశాల, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూ.17.50 కోట్లతో నిరి్మంచిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. -
కడప స్టీల్ ప్లాంట్ శంకుస్ధాపన ఎన్నికలు స్టంటే
-
ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉధృతంగా ఉద్యమం
-
దీక్షల వల్ల ఉక్కు రాదు..తుక్కు రాదు
-
స్టీల్‌ప్లాంట్‌లో పీఎం ట్రోఫీ బృందం పర్యటన
ఉక్కునగరం: ప్రధానమంత్రి ట్రోఫీ బృందం శనివారం స్టీల్‌ప్లాంట్‌లో పర్యటించింది. సం.2014–15, సం. 2015–16 స్టీల్‌ప్లాంట్ పనితీరును పరిశీలించడానికి వచ్చిన బృందం ఉదయం ఉక్కు సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న అరుణోదయ ప్రత్యేక పాఠశాల సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి ఈడి(వర్క్స్) భవనంలోని మోడల్ రూమ్, అవార్డు గ్యాలరీలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా ప్రధాన ఉత్పత్తి యూనిట్లు, విస్తరణ యూనిట్లుకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా తిలకించారు. మధ్యాహ్నం యాజమాన్యంతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎండీ పి. మధుసూదన్ హుదూద్ వల్ల ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని వివరించారు. ఉద్యోగుల సంకల్పంతో అతి తక్కువ సమయంలో సాధారణ స్థాయికి వచ్చిన విషయాన్ని బందం దష్టికి తెచ్చారు. అదే విధంగా హుదూద్ వల్ల కోల్పోయిన హరిత వనాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టామన్నారు. దీనిపై కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో సాగుతున్న విస్తరణ, ఆధునీకరణ, ఉత్పత్తి స్థిరీకరణ పనులు సకాలంలో పూర్తి చేయగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాయంత్రం ఉక్కు అధికారులు సంఘం, కార్మిక సంఘాలు, విప్స్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సంఘాలతో నాయకులతో సమావేశమయ్యారు. రాత్రి ఉక్కు ఎంపీ హాలులో విస్టీల్ మహిళా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో ఉక్కు డైరెక్టర్లు పి.సి. మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్. ప్రసాద్, డి.ఎన్.రావు, రాయ్‌చౌదరి, ఈడి(వర్క్స్) కె.వి.రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కులో కూలిన కోక్ బకెట్
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ కోక్‌ఓవెన్స్ సీడీసీపీ–1లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కోక్ బకెట్ కుప్పకూలింది. అదష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..విభాగం ఛాంబర్ 4లో వేడి కోక్‌ను చల్లార్చడానికి సుమారు 25 టన్నుల కోక్‌ను బకెట్లో వేసి సుమారు 40 అడుగుల ఎత్తులో ఉన్న చాంబర్‌కు తరలిస్తున్నారు. ఎత్తుపైకి వెళ్లిన బకెట్ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. బకెట్ కింద ఉన్న ట్రాక్‌పై పyì నుజ్జయింది. వెంటనే కోక్ నుంచి మంటలు రావడంతో సిఐఎస్ఎఫ్ ఫైర్ విభాగం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చే శారు. ఈడీ నాగరాజన్, విభాగాదిపతి ఏకే సింగ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్, బకెట్ మరమ్మతు పనులు ప్రారంభించారు. బకెట్ మరమ్మతు పనులు పూర్తికావడానికి వారం రోజుల పడుతుందని తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన సిటు, ఇంటక్ నాయకులు నిర్వహణ లోపాల వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. -
రేణుకాచౌదరి భూముల్లో ఎర్రజెండాలు
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని బీసీఎం రోడ్ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉన్న ఎంపీ రేణుకా చౌదరి భూములతోపాటు, చెరువుబంజర్, మేడికుంట చెరువు భూముల్లో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య మాట్లాడుతూ రేణుకాచౌదరి మూడు దశాబ్దాల క్రితం ఆక్సికో కర్మాగారం నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం నుంచి 43 ఎకరాలు తీసుకున్నారని, నేటికీ కర్మాగారం నెలకొల్పకపోగా.. మామిడితోట సాగు చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ఆక్రమణలను అడ్డుకున్నారు. కోడ్ అమలులో ఉన్నందున ఆక్రమణలకు దిగవద్దని సూచించారు. తహసీల్దార్ విషయాన్ని సబ్ కలెక్టర్ కాళీచరణ్ ఎస్.కర్టేడ్ దృష్టికి తీసుకెళ్లగా భూములు సర్వే చేసి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. -
టీఎల్టీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఉక్కునగరం(విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ప్లాంట్, పవర్గ్రిడ్లు సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్మిషన్ లైన్ టవర్స్(టిఎల్‌టి) ప్రాజెక్ట్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆర్ఐఎన్ఎల్, పవర్‌గ్రిడ్ టీఎల్టీ ప్రైవేట్ లిమిటెడ్ 50:50 శాతం భాగస్వామ్యంలో టీఎల్టీ ఉత్పత్తిపై గతంలో ఎంఓయు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి 1.20 లక్షల టన్నుల టీఎల్టీలను ఉత్పత్తి చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్ బిసి గేటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ పనులకు స్టీల్‌ప్లాంట్ సీఎండి పి.మధుసూదన్, పవర్ గ్రిడ్ సీఎండీ ఆర్.ఎన్.నాయక్‌లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉక్కు కంపెనీ సీఎండీ పి. మధుసూదన్ మాట్లాడుతూ ప్రస్తుత వాణిజ్య పరిస్థితుల్లో ఇటువంటి సంయుక్త భాగస్వామ్య సంస్థల ఏర్పాటు ఆవశ్యకమన్నారు. ఈ ప్రాజెక్ట్ టీఎల్టీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పవర్‌గ్రిడ్ సీఎండీ నాయక్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఏడాదిలోగా పూర్తయి ఉత్పత్తి ప్రారంభించడం ఇరుసంస్థలకు లాభదాయకమన్నారు. కార్యక్రమంలో ఉక్కు సంస్థ డైరెక్టర్లు పి.సి.మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, డి.ఎన్.రావు, సివిఓ బి. సిద్దార్దకుమార్, పవర్‌గ్రిడ్ డైరక్టర్లు ఐ.ఎస్.ఝా, ఆర్.పి. శశ్మాల్, మెకాన్ డైరక్టర్ దీపక్ దత్తా తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ హబ్
హైదరాబాద్ : తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ప్రకటన చేసింది. చిత్తూరు జిల్లా మెగాసిటీ తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కుప్పంలో ఎయిర్ పోర్టు ఏర్పేడులో ఎన్ఐఎమ్జెడ్ ఐఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అపోలో హెల్త్ సెంటర్ హార్టికల్చర్ జోన్ మెగా ఫుడ్ పార్క్ మెట్రో రైలు ఆధ్మాత్మిక పర్యటక సర్క్యూట్ (శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం) ఐటీ హబ్‌గా తిరుపతి వైఎస్ఆర్ జిల్లా స్టీల్ ప్లాంట్ సిమెంట్ పరిశ్రమలు ఖనిజ ఆధారిత పరిశ్రమలు పారిశ్రామిక స్మార్ట్ సిటీ కడప ఎయిర్‌పోర్టును వాడుకలోకి తేవటం పుడ్ పార్కు ఉర్దూ యూనివర్శిటీ సోలార్ పవర్, విండ్ పవర్ గార్మెంట్ క్లస్టర్ కర్నూలు జిల్లా కర్నూలును స్మార్ట్ సిటీగా రూపొందించడం కొత్తగా విమానాశ్రయం అవుకు వద్ద కొత్త పారిశ్రామిక నగరం హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన టెక్స్టైల్ క్లస్టర్ కోయిలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్ ఐఐఐటీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కర్నూలులో సిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టూరిజం సర్క్యూట్ (గుహల, దేవాలయాలు, వన్యప్రాణులు) సోలార్, విండ్ పవర్ లైఫ్స్టాక్ రీసెర్చ్ అండ్ పాలిటెక్నిక్ సెంటర్ విత్తనోత్పత్తి కేంద్రం రైల్వే వ్యాగన్ల మరమ్మతుల కేంద్రం మైనింగ్ స్కూల్ ఫుడ్ పార్క్ అనంతపురం జిల్లా కరువు నివారణకు 100 శాతం డ్రిప్, తుంపర్ల సేద్యం ఉద్యానవన కేంద్రం సెంట్రల్ యూనివర్శిటీ ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం నూతన పారిశ్రామిక నగరం స్మార్ట్ సిటీ బీసీఐసీలో హిందుపూర్ టెక్స్టైల్ పార్క్ పుడ్‌పార్క్ ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ సోలార్, విండ్ పవర్ పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్ట్ హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేయడం రోడ్డు మార్గాల అనుసంధానం కర్నూలు-వినుకొండ వయా శ్రీశైలం ....... నాలుగు లైన్ల రోడ్డు కర్నూలు-నంద్యాల-గిద్దలూరు-గుంటూరు ........నాలుగు లైన్ల రోడ్డు నంద్యాల-పోరుమామిళ్ల-కృష్ణపట్నం........నాలుగు లైన్ల రోడ్డు రేణిగుంట-రాజంపేట-కడప..........నాలుగలైన్ల రోడ్డు -
వైఎస్ఆర్ జిల్లాకు సెయిల్ నిపుణుల కమిటీ
కడప : భారత ఉక్కు సంస్థ బృందం శనివారం కడప చేరుకున్నారు. సెయిల్ బృందం సభ్యులు తొమ్మిదిమంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాలను సెయిల్ బృందం పరిశీలించనుంది. కాగా రాష్ట్ర విభజనలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్న ప్రకటన అందరిలోనూ ఆశలు రేకెత్తిస్తోంది. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి థిసెన్‌క్రప్ ‘అమెరికా స్టీల్ ప్లాంట్’
న్యూయార్క్: ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ తాజాగా అమెరికాలో మరో ఉక్కు ప్లాంటును కొనుగోలు చేస్తోంది. జర్మన్ సంస్థ థిసెన్క్రప్కి అమెరికాలో ఉన్న ప్లాంటును మరో కంపెనీ నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్‌తో కలిసి కొంటోంది. ఈ డీల్ విలువ సుమారు 1.55 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ వెల్లడించాయి. అలబామా రాష్ట్రంలోని సదరు ప్లాంటులో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 5.3 మిలియన్ టన్నులు. ప్రధానంగా ఆటోమొబైల్, నిర్మాణ రంగాలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి.