స్టీల్‌ప్లాంట్‌లో పీఎం ట్రోఫీ బృందం పర్యటన
స్టీల్‌ప్లాంట్‌లో పీఎం ట్రోఫీ బృందం పర్యటన
Published Sat, Jul 30 2016 9:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
ఉక్కునగరం: ప్రధానమంత్రి ట్రోఫీ బృందం శనివారం స్టీల్‌ప్లాంట్‌లో పర్యటించింది. సం.2014–15, సం. 2015–16 స్టీల్‌ప్లాంట్ పనితీరును పరిశీలించడానికి వచ్చిన బృందం ఉదయం ఉక్కు సిఎస్‌ఆర్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న అరుణోదయ ప్రత్యేక పాఠశాల సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి ఈడి(వర్క్స్) భవనంలోని మోడల్ రూమ్, అవార్డు గ్యాలరీలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా ప్రధాన ఉత్పత్తి యూనిట్లు, విస్తరణ యూనిట్లుకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా తిలకించారు. మధ్యాహ్నం యాజమాన్యంతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎండీ పి. మధుసూదన్ హుదూద్ వల్ల ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని వివరించారు. ఉద్యోగుల సంకల్పంతో అతి తక్కువ సమయంలో సాధారణ స్థాయికి వచ్చిన విషయాన్ని బందం దష్టికి తెచ్చారు. అదే విధంగా హుదూద్ వల్ల కోల్పోయిన హరిత వనాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టామన్నారు. దీనిపై కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో సాగుతున్న విస్తరణ, ఆధునీకరణ, ఉత్పత్తి స్థిరీకరణ పనులు సకాలంలో పూర్తి చేయగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాయంత్రం ఉక్కు అధికారులు సంఘం, కార్మిక సంఘాలు, విప్స్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సంఘాలతో నాయకులతో సమావేశమయ్యారు. రాత్రి ఉక్కు ఎంపీ హాలులో విస్టీల్ మహిళా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో ఉక్కు డైరెక్టర్లు పి.సి. మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్. ప్రసాద్, డి.ఎన్.రావు, రాయ్‌చౌదరి, ఈడి(వర్క్స్) కె.వి.రమణారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement