ఆర్సెలర్ మిట్టల్ చేతికి థిసెన్‌క్రప్ ‘అమెరికా స్టీల్ ప్లాంట్’
న్యూయార్క్: ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ తాజాగా అమెరికాలో మరో ఉక్కు ప్లాంటును కొనుగోలు చేస్తోంది. జర్మన్ సంస్థ థిసెన్‌క్రప్‌కి అమెరికాలో ఉన్న ప్లాంటును మరో కంపెనీ నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్‌తో కలిసి కొంటోంది.
ఈ డీల్ విలువ సుమారు 1.55 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ వెల్లడించాయి. అలబామా రాష్ట్రంలోని సదరు ప్లాంటులో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 5.3 మిలియన్ టన్నులు. ప్రధానంగా ఆటోమొబైల్, నిర్మాణ రంగాలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి.