గువాహటి : అసోంలో దాదాపు రెండు నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న చమురుబావిలో బుధవారం మరోమారు ప్రమాదం చోటుచేసుకుంది. తిన్సుకియా జిల్లా బాఘ్‌జాన్‌లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా కంపెనీకి చెందిన ఐదోనెంబర్ చమురు బావిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేయడానికి వచ్చిన ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.(ప్రమాదకరంగా పశ్చిమ బెంగాల్ రవాణా)
కాగా, తొలుత మే 27న చమురు బావి నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో అరికట్టడానికి విదేశాల నుంచి నిపుణులను తెప్పించారు. అయితే జూన్9న గ్యాస్‌లీక్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని కిలోమీటర్ల వరకు దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ఐదో నెంబర్ బావి నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. నాటి నుంచి మంటలను అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఈ మంటలను అదుపు చేసే క్రమంలో ఇప్పటికే ఇద్దరు అగ్రిమాక సిబ్బంది మృతిచెందారు. (అమెరికా అధ్యక్షుడిపై ఉద్ధవ్ ఠాక్రే సెటైర్లు)
తాజాగా జరిగిన ప్రమాదంలో వీదేశీ నిపుణులకు గాయాలయ్యాయి. మంటలను ఆర్పే బ్లో అవుట్ ప్రివెంటర్‌ను చమురు బావి వద్ద పెట్టడానికి కంటే ముందు బావి స్పూల్ తెరవడానికి వెళుతుండగా మంటలు చెలరేగాయి. తాజా ఘటనతో మంటలను అదుపు చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment