
న్యూఢిల్లీ: దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ– ఆయిల్ ఇండియా చీఫ్‌గా రంజిత్ రాత్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ నియామకాల బోర్డ్ (పీఈఎస్‌బీ) ఒక ప్రకటన విడుదల చేసింది. 50 సంవత్సరాల రాత్ ప్రస్తుతం మినీరత్న కంపెనీగా గుర్తింపు పొందిన మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ (ఎంఈసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయిల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలకుగాను జరిగిన ఇంటర్వ్యూకు హాజరైన ఐదుగురు అభ్యర్థుల్లో రాత్ ఒకరు. ఆయిల్ ఇండియా ప్రస్తుత సీఎండీగా సుశీల్ చంద్ర మిశ్రా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. అటు తర్వాత రాత్ ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఇందుకు తొలుత ఆయన సచ్చీలతపై సీవీసీ, సీబీఐ వంటి అవినీతి నిరోధక శాఖల నుంచి క్లియరెన్స్‌లు ఇవ్వాలి. అటు తర్వాత రాత్ ఎంపికకు నియామకపు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment