చమురు రిటైలర్లకు క్యూ1లో కేంద్రం రూ. 11వేల కోట్లు
ముంబై: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ త్రైమాసికంలో సబ్సిడీలకు సంబంధించి రూ.11,000 కోట్లను కేంద్రం నుంచి పొందనున్నాయి. వీటిలో ఐఓసీ వాటా రూ. 6,076 కోట్లు. బీపీసీఎల్ వాటా రూ.2,407 కోట్లు. హెచ్‌పీసీఎల్ పొందే పరిమాణం రూ.2,517 కోట్లు. ఈ క్వార్టర్‌లో మూడు చమురు కంపెనీల నష్టం రూ.28,691 కోట్లు.
వీటిలో ప్రభుత్వ చెల్లింపులు కాకుండా అప్‌స్ట్రీమ్ సంస్థలు- ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్ 54 శాతం అంటే దాదాపు రూ.15,547 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో నికరంగా ఇంధన విక్రయ రిటైలర్లకు రూ.2,145 కోట్ల నష్టం మిగిలి ఉంటుంది. మూడు ఆయిల్ కంపెనీలు గిట్టుబాటు ధరకన్నా తక్కువకు రిటైల్ విక్రయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే.