Oil Marketing Company
-
చమురు కంపెనీల లాభాలు మూడు రెట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరగనున్నాయి. రూ. 1 లక్ష కోట్లకు చేరనున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు తగ్గడం, దేశీయంగా రిటైల్ రేట్లు అధిక స్థాయిలో ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం.. 2017–2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఓఎంసీల నిర్వహణ లాభాలు సగటున రూ. 60,000 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 33,000 కోట్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని మూడు ప్రభుత్వ రంగ ఓఎంసీల మీద నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఆయిల్ కంపెనీలకు ప్రధానంగా రిఫైనింగ్ (ముడి చమురును శుద్ధి చేయడం), రిటైల్ బంకుల ద్వారా ఇంధనాలను మార్కెటింగ్ చేయడం ద్వారా రెండు మార్గాల్లో ఆదాయం వస్తుంది. నివేదికలో మరిన్ని అంశాలు.. ► రష్యా మీద ఆంక్షల నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్ పెరగడంతో 2023 ఆర్థిక సంవత్సరంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు సగటున బ్యారెల్‌కు 15 డాలర్లు పలికాయి. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పటికీ .. రిటైల్ ఇంధన ధరను ఆ స్థాయిలో పెంచకపోవడంతో, రిఫైనింగ్ మార్జిన్లు పటిష్టంగానే ఉన్నా.. మార్కెటింగ్‌పరంగా నష్టాలు నమోదు చేయాల్సి వచి్చంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత బలహీనపడింది. ► ఈసారి నిర్వహణ లాభాలు లీటరుకు రూ. 5–7 స్థాయికి చేరవచ్చని, స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 6–8 డాలర్ల స్థాయికి పరిమితం కావచ్చని నివేదిక పేర్కొంది. ► 2017–23 మధ్య కాలంలో ఆయిల్ కంపెనీలు తమ రిఫైనింగ్, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రూ. 3.3 లక్షల కోట్లు వెచి్చంచాయి. ఫలితంగా 2017లో రూ. 1.2 లక్షల కోట్లుగా ఉన్న వాటి స్థూల రుణ భారం 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.6 లక్షల కోట్లకు చేరింది. అయితే, లాభదాయకత తక్కువ స్థాయిలోనే కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓఎంసీల పెట్టుబడి వ్యయాలు రూ. 54,000 కోట్ల మేర ఉంటాయని అంచనా. ► ఈసారి క్రూడాయిల్ రేట్లు ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరిగినా లేక ముడిచమురు ధర తగ్గకుండా రిటైల్ రేట్లు తగ్గినా అంచనాలు మారిపోవచ్చు. -
డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే!: చమురు వ్యవహారాల మంత్రి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్‌పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో కూడా చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంసహా దేశంలో ద్రవ్యోల్బణం పెరక్కుండా ప్రభుత్వ పోరాటానికి సహాయం చేయడానికి చమురు మంత్రిత్వశాఖ తగిన ప్రయత్నాలన్నింటినీ చేస్తుంది. ఈ విషయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లతో కలిసి పనిచేస్తుంది. అవసరమైతే చమురు కంపెనీలకు వచ్చే నష్టాలకు ప్రభుత్వ నుంచి ఆర్థికపరమైన సహాయాన్నీ కోరుతుంది. ► జూన్ 2020 నుండి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో దేశీయ వంట గ్యాస్ (ఎల్పీజీ) అమ్మకంపై వచ్చిన నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం గత నెలలో మూడు సంస్థలకు రూ.22,000 కోట్లను ఒకేసారి గ్రాంట్‌గా అందించింది. అయితే రూ.28,000 కోట్లు ఇవ్వాలని చమురు మంత్రిత్వశాఖ కోరింది. ► అండర్ రికవరీ (రిటైల్ అమ్మకపు ధర– అంతర్జాతీయ ధర మధ్య వ్యత్యాసం) ప్రస్తుతం డీజిల్‌పై లీటరుకు రూ. 27 ఉంది. అయితే వాస్తవిక నగదు నష్టం (ముడి చమురు సేకరణ–ఇంధనంగా మార్చడం వల్ల కలిగే వాస్తవ వ్యయ ఆధారిత నష్టం) లీటరుకు ఇప్పటికీ దాదాపు రూ. 3–4గా ఉంది. ► మూడు ఇంధన రిటైల్ కంపెనీలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 19,000 కోట్లకు పైగా నికర నష్టాన్ని చవిచూశాయి. తదుపరి త్రైమాసికంలో కూడా నష్టాలను ఎదుర్కొంటాయన్న అంచనా ఉంది. ► భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ధర జూన్‌లో బ్యారెల్‌కు 116 డాలర్ల వరకు పెరిగింది, అయితే నవంబర్ నెలలో 92.25 డాలర్లకు తగ్గింది. తగ్గిస్తే... మే తర్వాత మొదటిసారి ద్రవ్యోల్బణం నియంత్రించడం, వినియోగదారులపై ధరల భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఈ ఏడాది మే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీనితో వ్యవస్థలో ఆ నెల్లో పెట్రోల్, డీజిల్ ధరలూ తగ్గాయి. మళ్లీ ధరలు తగ్గిస్తే అది మే తర్వాత మొదటిసారి అవుతుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సవరించాలి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు మే తర్వాత ఈ సరవణలు చేయడం లేదు. అంతర్జాతీయ ధరల తీవ్రత నేపథ్యంలో మే నెల్లో ధరలు తగ్గింపునకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకూ పెరిగాయి. -
చమురు రిటైలర్లకు క్యూ1లో కేంద్రం రూ. 11వేల కోట్లు
ముంబై: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ త్రైమాసికంలో సబ్సిడీలకు సంబంధించి రూ.11,000 కోట్లను కేంద్రం నుంచి పొందనున్నాయి. వీటిలో ఐఓసీ వాటా రూ. 6,076 కోట్లు. బీపీసీఎల్ వాటా రూ.2,407 కోట్లు. హెచ్‌పీసీఎల్ పొందే పరిమాణం రూ.2,517 కోట్లు. ఈ క్వార్టర్లో మూడు చమురు కంపెనీల నష్టం రూ.28,691 కోట్లు. వీటిలో ప్రభుత్వ చెల్లింపులు కాకుండా అప్‌స్ట్రీమ్ సంస్థలు- ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్ 54 శాతం అంటే దాదాపు రూ.15,547 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో నికరంగా ఇంధన విక్రయ రిటైలర్లకు రూ.2,145 కోట్ల నష్టం మిగిలి ఉంటుంది. మూడు ఆయిల్ కంపెనీలు గిట్టుబాటు ధరకన్నా తక్కువకు రిటైల్ విక్రయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. -
ఓఎన్జీసీ లాభం 44% అప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2013-14) (జనవరి-మార్చి)క్యూ4లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ 44% అధికంగా రూ. 4,889 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 3,387 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ కాలంలో డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటం వల్ల రూ. 3,098 కోట్లమేర మారకపు లాభాలు నమోదైనట్లు కంపెనీ చైర్మన్ దినేష్ కె.సరఫ్ చెప్పారు. దీంతోపాటు బావుల తవ్వకాలకు సంబంధించి రూ. 1,906 కోట్లను మాత్రమే రైటాఫ్ చేసినట్లు తెలిపారు. గతంలో ఇవి రూ. 4,127 కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వాటిల్లే ఆదాయ న ష్టాల భర్తీకిగాను రూ. 16,202 కోట్ల సబ్సిడీలు చెల్లించినట్లు చెప్పారు. గతంలో ఇవి రూ. 12,312 కోట్లు మాత్రమే. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీలకు డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై ఆదాయ నష్టాలు సంభవించే సంగతి తెలిసిందే. 32.78 డాలర్లు మాత్రమే: క్యూ4లో సబ్సిడీ చెల్లింపుల తరువాత బ్యారల్ ముడిచ మురు విక్రయాలపై 32.78 డాలర్లు మాత్రమే లభించినట్లు కంపెనీ తెలిపింది. ఇది అత్యంత కనిష్టంకాగా, స్థూలంగా 106.65 డాలర్ల చొప్పున బిల్లింగ్ చేసినట్లు వివరించింది. దీనిలో 73.87 డాలర్ల వరకూ సబ్సిడీ ఇచ్చినట్లు వెల్లడించింది. 2012-13 క్యూ4లో 40.97 డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది. కాగా, పూర్తి ఏడాదికి నికర లాభం 6% పుంజుకుని రూ. 22,095 కోట్లను తాకింది. ఈ కాలంలో రికార్డు స్థాయిలో రూ. 56,384 కోట్ల సబ్సిడీలను చెల్లించినట్లు సరఫ్ చెప్పారు. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 22.56 మిలియన్ టన్నుల నుంచి నామమాత్రంగా తగ్గి 22.25 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 2.7% క్షీణించి రూ. 375 వద్ద ముగిసింది.