
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ తాజాగా క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్‌లో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ. 48 కోట్లు వెచ్చించినట్లు ఏంఎజీ మీడియా మాతృ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్(ఏఈఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది.
రాఘవ్ బల్ ఏర్పాటు చేసిన డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను సొంతం చేసుకోనున్నట్లు గతేడాది మే నెలలో ఏఈఎల్ పేర్కొంది. తాజాగా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. న్యూస్ ప్లాట్‌ఫామ్.. బ్లూమ్‌బెర్గ్ క్వింట్(ప్రస్తుతం బీక్యూ ప్రైమ్)ను క్వింటిలియన్ బిజినెస్ మీడియా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రచురణ, ప్రకటనలు, బ్రాడ్‌క్యాస్టింగ్, విభిన్న మీడియా నెట్‌వర్క్‌ల కంటెంట్ పంపిణీ బిజినెస్‌లలోకి ప్రవేశించేందుకు ఏఎంజీ మీడియాను అదానీ గ్రూప్ ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment