Successor
-
హెజ్బొల్లా వారసుడు హషీం?
ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల ధాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కకావికలవుతోంది. ముఖ్యంగా అగ్ర నాయకత్వమంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్, తర్వాత టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్. ఇప్పుడు తాజాగా ఏకంగా సంస్థ అధినేత నస్రల్లా. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అగ్ర నేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో ఇద్దరు అగ్ర నేతలు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఈ మేరకు కథనం కూడా వెలువడింది. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్‌గా ఉన్నాడు. శుక్రవారం నాటి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్టు తొలుత వార్తలొచి్చనా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు తేల్చాయి. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే గాక సంస్థ జిహాద్ కౌన్సిల్లో కీలక సభ్యుడు కూడా. 2017 లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్బొల్లాకు కొమ్ముకాసే ఇరాన్‌తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయి. 2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ కూతురు జైనబ్‌కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారే. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడు. 1964లో దక్షిణ లెబనాన్‌లో పుట్టాడు. 1990ల్లో ఇరాన్ లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్బొల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్‌బొల్లా్ల చీఫ్ అయ్యాడు. రెండేళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సార థి అయ్యాడు. నాటినుంచే నస్రల్లా వారసునిగానూ గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్బొల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్ర నేతలతో పాటు ఇరాన్ మద్దతునూ హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
1984: రాజీవం
ఇందిర వారసునిగా గద్దెనెక్కిన రాజీవ్ 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. ఏకంగా 404 స్థానాల్లో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికలివి. ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డా సీట్లు మాత్రం రెండే దక్కాయి. అయితే ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్ బలం క్రమంగా తగ్గుతూ పోగా, బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ రావడం విశేషం... అభివృద్ధికి ప్రజామోదం 1984 అక్టోబర్ 31న ఇందిర హత్య యావత్ ప్రపంచాన్నీ షాక్‌కు గురి చేసింది. అదే రోజు సాయంత్రం రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా ఏడో లోక్‌సభ పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. 1984 డిసెంబర్ 24, 27, 28 తేదీల్లో 514 లోక్‌సభ స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న అసోం, పంజాబ్‌ల్లోని మిగతా స్థానాల్లో 1985లో ఎన్నికలు జరిగాయి. సానుభూతికి తోడు ఇందిర దూరదృష్టితో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. హరిత విప్లవంతో పంటల దిగుబడి భారీగా పెరిగింది. రక్షణ, ఆర్థిక రంగాల్లో కీలక నిర్ణయాలను జనం హర్షించారు. ఇందిర హయాంలోని 1980–85 ఆరో పంచవర్ష ప్రణాళికను అత్యంత విజయవంతమైనదిగా చెబుతారు. జీవన వ్యయం పెరిగినా ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి చేరింది. వీటన్నింటి ఫలస్వరూపంగా కాంగ్రెస్‌కు ఏకంగా 49.1 శాతం ఓట్లు, 404 సీట్లు దక్కాయి. నెహ్రూ, ఇందిర నాయకత్వంలోనూ ఇన్ని సీట్లు రాలేదు. యూపీలో కాంగ్రెస్ 85కు ఏకంగా 83 సీట్లను గెలుచుకుంది! బెంగాల్ మినహా పెద్ద రాష్ట్రాలన్నింట్లోనూ దుమ్ము రేపినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎనీ్టఆర్ స్థాపించిన తెలుగుదేశం ధాటికి ఆరింటితోనే సరిపెట్టుకుంది. టీడీపీ ఏకంగా 30 సీట్లు నెగ్గింది. బోఫోర్స్ మరక... రాజీవ్ హయాంలో పలు వివాదాలూ రేగాయి. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో అవినీతి మరక వాటిలో ముఖ్యమైనది. ఈ కాంట్రాక్ట్ కోసం గాను భారత రాజకీయ నాయకులకు బోఫోర్స్ కంపెనీ రూ.820 కోట్ల ముడుపులు చెల్లించినట్టు 1987 మేలో స్వీడిష్ రేడియో స్టేషన్ ప్రసారం చేసిన కథనం సంచలనం రేపింది. బోఫోర్స్ తరఫున మధ్యవర్తిత్వం వహించిన ఒట్టావియో ఖత్రోచికి రాజీవ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే జాతుల పోరుతో అట్టుడుకుతున్న శ్రీలంకలో శాంతి పేరుతో జోక్యంపైనా రాజీవ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరిట ఆయన పంపిన భారత సైన్యం ఎల్టీటీఈతో నేరుగా యుద్ధానికి దిగింది! ఈ పరిణామం అంతిమంగా రాజీవ్ హత్యకు దారితీసింది. నాడేం జరిగిందంటే..? ఇందిర హత్యకు గురైనప్పుడు రాజీవ్ పశి్చమబెంగాల్లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటున్న కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి తొలుత హత్య వార్త ఉదయం 9.30కు తెలిసింది. ఇందిరపై కాల్పులు జరిగాయని మాత్రం రాజీవ్‌కు చెప్పి విమానంలో ఢిల్లీ బయల్దేరదీశారు. కాక్‌పిట్‌లోకి వెళ్లిన రాజీవ్ కాసేపటికి బయటికొచ్చి ‘అమ్మ మరణించింది’ అని ప్రకటించారు. అందరూ మౌనం దాల్చారు. మరిన్ని విశేషాలు... ► బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో పార్టీ 7.74 శాతం ఓట్లు సాధించింది. ► బీజేపీ నెగ్గిన రెండు సీట్లలో ఒకటి హన్మకొండ. అక్కడ బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావును ఓడించారు. బీజేపీకి రెండో స్థానం గుజరాత్‌లోని మెహ్సానాలో దక్కింది. ► 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్ తీసుకొచ్చారు. ► ఓటు హక్కు వయో పరిమితిని 1988లో 21 ఏళ్ల నుంచి 18కి తగ్గించారు. ► ఎన్నికల్లో ఈవీఎంలు వాడేలా 1988లో చట్ట సవరణ చేశారు. సెబీని ఏర్పాటు చేశారు. ► 1989లో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీకి తోడు మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. ► విద్య ఆధునికీకరణకు జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టారు. నవోదయ విద్యాలయ వ్యవస్థ తెచ్చారు. ► కంప్యూటర్లు, విమానయాన పరిశ్రమ, రక్షణ, రైల్వేల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ► వృద్ధి రేటు పెంపే లక్ష్యంగా కొర్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు అందించారు. ► దేశంలో టెలికం, ఐటీ రంగ అభివృద్ధికి రాజీవే ఆద్యుడని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తర కొరియా: తెరపైకి కిమ్ చిన్నాన్న!
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేనందున తరువాతి అధ్యక్షుడు ఎవరనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. కిమ్ చిన్న చెల్లెలు కిమ్ యో జంగ్ సమర్థురాలిగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్ చిన్నాన్న కిమ్ ప్యాంగ్ ఇల్ (65) పేరు బయటికొచ్చింది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ వారసుల్లో ప్యాంగ్ ఇల్ చివరివాడు. ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షుడిగా ఆయనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ దేశంలోని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల అనంతరం రాజకీయంగా ఆయన పేరు వినిపిస్తుండటం గమనార్హం. (చదవండి: కిమ్ ఆరోగ్యంపై గందరగోళం) కావాలనే పక్క పెట్టేశారు 1970లో తన అన్న కిమ్ జోంగ్ ఇల్ చేతిలో ఓడిపోయిన తర్వాత.. కిమ్ ప్యాంగ్ ఇల్ హంగేరి, బల్గేరియా, ఫిన్లాండ్, పొలాండ్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో పలు దౌత్యపరమైన పదవుల్లో పనిచేశారు. ఏడాది క్రితం స్వదేశానికి తిరిగొచ్చారు. కిమ్ అనారోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. దేశానికి నాయకత్వం వహించే విషయమై కిమ్ ప్యాంగ్ ఇల్‌ను కావాలనే పక్కన పెట్టేశారని, ఆ దేశ మీడియా అతన్ని వెలుగులోకి రానీయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఉత్తర కొరియాలోని కొందరు మేధావులు మాత్రం.. వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ కుమారుడు అయినందున కిమ్ ప్యాంగ్ ఇల్ నిజమైన వారసుడు అని, కిమ్ జోంగ్ ఉన్ కానేకాదని చెప్తున్నారు. ఒకవేళ కిమ్ ప్రాణాలతో లేకపోతే.. ఇప్పుడైనా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. కాగా, కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు ఉత్తర కొరియా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన తదనానంతరం కిమ్ జోంగ్ ఉన్న పదవిని చేపట్టారు. మరోవైపు కరోనాకు భయపడే అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అజ్ఞాత జీవితం గడుపుతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. (చదవండి: కిమ్ ఎక్కడున్నారో తెలుసు: దక్షిణ కొరియా) -
‘ఆమె చాలా అందంగా ఉంటేనే లాభం’
టిబెట్ : ప్రముఖ బౌద్ధ ధర్మ గురువు దలైలామా ఇంటర్నెట్ వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా. దలైలామా వ్యాఖ్యల పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయంటూ నెజటిన్లు మండిపడుతున్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. in the end, yet another patriarch — Alan (@CityLondonAlan) June 28, 2019 -
రాణాకు నో చెప్పిన ఆర్బీఐ
సాక్షి,ముంబై: సీఎండీ నియామకం అంశంలో ప్రయివేటురంగ బ్యాంకు ఎస్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి తన నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. తాను ముందు ఆదేశించినట్టుగానే సీఈవో, ఎండీగా రాణా కపూర్ పదవి నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1నాటికి బ్యాంకు కొత్త సీఎండీ నియామాకం చేపట్టాలని పేర్కొంది. ఆర్బీఐ మరోసారి తన నిర్ణయాన్ని దృఢంగా ప్రకటించడంతో బ్యాంకు సీఎండీ మరింత కాలం కొనసాగాలని భావించిన రాణా కపూర్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు. బ్యాంకు ఉన్నతాధికారిగా కపూర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల పాటు పొడిగించాలని గతంలోనే వాటాదారులు కోరినప్పటికి ఆర్బీఐ ఆర్బీఐ నిరాకరించింది. 2019, జనవరి 31నాటికి కొత్త సీఎండీని ఎంపిక చేయాలని సెప్టెంబరు24న ఆదేశించింది. అయితే రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని , ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి మరింత సమయం కావాలని ఆర్బీఐని ఎస్‌బ్యాంకు కోరింది. అలాగే కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. తాజాగా ఈ అభ్యర్థనను కూడా ఆర్బిఐ తిరస్కరించింది. -
ఎట్టకేలకు అమ్మ వారసులపై స్పష్టత
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అమ్మ జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని చెన్నై జిల్లా కలెక్టర్ అన్భుసెల్వన్ స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోపు వేదనిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకుంటామన్నారు. వేద నిలయంలో రహస్య గదులు, అండర్ గ్రౌండ్లో ప్రత్యేక గదులు ఉన్నాయా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం నిరాకరించారు. చెన్నై పోయెగార్డెన్‌లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేదనిలయాన్ని స్మారక మందిరంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనం స్వాధీనానికి తగ్గ కసరత్తుల్ని చెన్నై జిల్లా కలెక్టర్ అన్భుసెల్వన్ చేపట్టారు. ఆయన నేతృత్వంలో ఇరవై మందితో కూడిన బృందం ఆ వేదనిలయంలో పరిశీలనలు జరుపుతూ వస్తున్నది. ఇప్పటికే ఆ భవనం, స్థలం వివరాలు, ఆస్తి విలువ లెక్కింపు తదితర ప్రక్రియలు ముగించారు. ఇక, ఆ నిలయంలోని రెండు గదుల్ని ఆదాయ పన్ను శాఖ వర్గాలు సీజ్ చేసి ఉండడంతో, అందులో ఏమున్నదోనన్న పరిశీలన సాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఆ నిలయంలో పరిశీలన అనంతరం అన్భు సెల్వన్ మీడియాతో మాట్లాడారు. జయలలిత ఆస్తులకు తామంటే తాము వారసులు అని ఆమె మేన కోడలు దీప, మేనళ్లుడు దీపక్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అలాగే, తానే అమ్మ బిడ్డనంటూ బెంగళూరుకు చెందిన అమృత తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జయలలితకు ప్రత్యక్షంగా ఎలాంటి వారసులు లేరని కలెక్టర్ అన్భుసెల్వన్ స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలిత నివాసం విలువ లెక్కింపు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, ఆ భవనాన్ని పూర్తిగా ప్రభుత్వం గుప్పెట్లోకి నాలుగు నెలల్లోపు తీసుకుంటామన్నారు. ఆ తదుపరి స్మారక మందిరంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని వివరించారు. ప్రత్యక్షంగా అమ్మకు వారసులు ఎవరు లేరని, అయినా, తమ నిబంధనల మేరకు అన్ని ప్రక్రియలు ముగించినానంతరం పబ్లిక్ నోటీసు జారీ చేయడం జరుగుతుందన్నారు. అప్పుడు ఎవరైనా ఆక్షేపణ వ్యక్తం చేసినా, ఆధారాలతో వచ్చినా ఆ సమయంలో అందుకు తగ్గ నిర్ణయాలతో లెక్కింపుకు తగ్గట్టు వెల కట్టడం జరుగుతుందన్నారు. ఆదాయ పన్ను శాఖ వర్గాలు తమకు సహకరిస్తామని చెప్పారని, ఆ రెండు గదుల్ని త్వరితగతిన తమకు అప్పగిస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, పలు ప్రశ్నల్ని సంధించగా ఆయన దాట వేత ధోరణి అనుసించారు. చివరగా వేదనిలయంలో రహస్య గదులు ఉన్నట్టు, పాతాళంలోనూ గదులు ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయే, వాటిని చూశారా అని ప్రశ్నించగా కాస్త తడబాటు అనంతరం ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోవడం గమనార్హం. -
పాక్ కొత్త ఆర్మీ చీఫ్ ను ఎంపిక చేసేశారా?
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ పదవీ కాలం మరో పన్నెండు రోజులే ఉండటంతో ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాలు పాక్ లో ఊపందుకున్నాయి. కొంతమంది పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కొత్త ఆర్మీ జనరల్ నియామకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. అయితే, నవాజ్ షరీఫ్ ఇప్పటికే ఆ నిర్ణయాన్ని తీసేసుకున్నారని ప్రముఖ జర్నలిస్టు ఘరిద్హా ఫరూఖీ అంటున్నారు. వాస్తవానికి రహీల్, నవాజ్ ల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలకు ఆయన పదవీ కాలం ముగియక ముందే కొత్త ఆర్మీ జనరల్ పేరును షరీఫ్ ప్రకటిస్తారని అందరూ భావించారు. పేరును ప్రకటించడం కాదు కదా షరీఫ్ కనీసం ఎవరితోనూ ఈ విషయంపై షరీఫ్ అధికారికంగా చర్చించ లేదు. దీనిపై స్పందించిన ఫరూఖీ తన సన్నిహితులైన పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్, హోంశాఖ మంత్రి చౌదరి నిసార్ లతో ఈ విషయంపై షరీఫ్ చర్చించారని కుండబద్దలు కొట్టారు. నవంబర్ 29న ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ తో పాటు చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీజేసీఎస్సీ)లో కూడా ఓ ఖాళీ ఏర్పడనుంది. దీంతో ఆ రెండు పోస్టులను భర్తీ చేసేందుకు షరీఫ్ ఆరుగురు సీనియర్ అధికారులను పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఆర్మీ చీఫ్ ను నియమించే సర్వధికారం కేవలం దేశ ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. ఇకపోతే సీజేసీఎస్సీలోని పోస్టును భర్తీ చేసేందుకు ప్రధానమంత్రి రక్షణ శాఖ సలహాను కోరవచ్చు. 1. లెఫ్టెనెంట్ జనరల్ జుబెర్ హయత్ ఈయన ప్రస్తుతం జనరల్ స్టాఫ్(సీజీఎస్) కు చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో పనిచేసిన అనుభవం హయత్ కు ఉంది. దీంతో ఈయన్ను సీజేసీఎస్సీ ఎంపిక చేసే అవకాశాలు పుష్కలం. 2.కార్ప్స్ కమాండర్ లెఫ్టెనెంట్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ అహ్మద్ ఈయన కూడా సీజీఎస్ కు చీఫ్ గా పనిచేశారు. నదీమ్ అహ్మద్ కు రహీల్ షరీఫ్ వద్ద మంచి పేరుంది. నవాజ్ షరీఫ్, రహీల్ ల మధ్య మంచి అనుబంధం లేకపోవడం వల్ల ఈయనకు ఆర్మీ చీఫ్ పదవి అవకాశాలు దక్కడం కష్టమే. 3. 31 కార్ప్స్ కమాండర్ లెప్టెనెంట్ జనరల్ జావేద్ ఇక్బాల్ రామ్ దే షరీఫ్ పరిశీలిస్తున్న పేర్లలో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందుకు ఈయన కుటుంబ నేపథ్యమే కారణం. జావేద్ ను ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేయడం ఒక రకంగా ప్రమాదకరమేనని పాక్ రాజకీయ వర్గాలు అంటున్నాయి. 4. లెఫ్టెనెంట్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఈయన ప్రస్తుతం జీహెచ్ క్యూలో ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టుకు అంత ప్రాధాన్యం లేకపోయినా ప్రస్తుత ఆర్మీ చీఫ్ రహీల్ కూడా ఈ స్ధానం నుంచే ఆర్మీ చీఫ్ గా ఎంపికయ్యారు. నియంత్రణ రేఖ వద్ద విధులను నిర్వహించే 10 కార్ప్స్ కమాండర్ గా కూడా బజ్వా విధులు నిర్వహించారు. భారత్-పాక్ సంబంధాలను దృష్టిలో ఉంచుకుంటే బజ్వాను ఆర్మీ చీఫ్ గా చేసే అవకాశం ఉంది. 5. లెఫ్టెనెంట్ జనరల్ నజీబుల్లా ఖాన్ జాయింట్ స్టాఫ్ క్వార్టర్స్ కు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. 2017జనవరితో ఈయన పదవీ కాలం ముగియనుంది. 6. లెఫ్టెనెంట్ జనరల్ మసూక్ అహ్మద్ మిలటరీ సలహాదారుగా, యూఎన్ శాంతి శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయన పదవీకాలం ముగిసినా ప్రభుత్వం పొడిగించడంతో అందులోనే కొనసాగుతున్నారు. -
ఆర్బీఐ గవర్నర్ ఎంపిక నేడే?
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఆసక్తికర చర్చకు దారితీసిన ఆర్బీఐ గవర్నర్ పదవిని అలంకరించే అభ్యర్థి ఎంపిక పై కేంద్ర ప్రభుత్వం నేడు (గురువారం) ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. దీంతో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎంపికపై గురువారం ఒక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 4 తో ముగియనుంది. రెండవసారి గవర్నర్ పదవిని చేపట్టబోననని రాజన్ స్పష్టం చేయడంతో ఈ పదవి ఎవర్ని వరించనుందనే అంశంపై పలు అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్ బీఐ గవర్నర్ సుబీర్ గోకర్న్, డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య తదితర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆనందీబెన్ వారసుడెవరు?
-
ఆనందీబెన్ వారసుడెవరు?
తెరపైకి నితిన్ పటేల్, రూపానీ, కేంద్రమంత్రి పురుషోత్తం అహ్మదాబాద్: గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటనతో ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీచేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆనందీబెన్ పటేల్ రాజీనామాను ఆమోదించటంతోపాటు కొత్త సీఎంనూ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. సీఎం రేసులో పలువురు ముఖ్యనేతల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, సౌరభ్ పటేల్, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, అసెంబ్లీ స్పీకర్ గణపత్ వసావా (గిరిజన నాయకుడు) జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్‌కు పార్టీలో మంచి పట్టుంది. దీనికి తోడు మోదీ పీఎం అయ్యాక.. గుజరాత్ సీఎం రేసులో నితిన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే.. పటేల్ సామాజిక వర్గానికి చెందినవాడైనా ఆ వర్గం యువత ఈయనపై పూర్తి వ్యతిరేకతతో ఉండటం.. నితిన్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జైన్ వర్గానికి చెందిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రూపానీకి మోదీ, అమిత్ షాతోపాటు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతారని ఈయనకు పేరుంది. గుజరాత్ ఇంధన మంత్రి సౌరభ్ పటేల్ పేరు కూడా సీఎం రేసులో వినబడుతోంది. ఈయన.. అంబానీ సోదరులకు దగ్గరి బంధువు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, స్పీకర్ గణపత్ వసావాలకూ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే.. గుజరాత్ బీజేపీ కార్యకర్తలు మాత్రం అమిత్ షా సీఎం అయితే.. పార్టీకి రాష్ట్రంలో ఎదురవుతున్న చిన్నాచితకా సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నారు. కాగా, బీజేపీ సీఎంగా ఆనందీబెన్ పటేల్‌ను తొలగించటం.. ఆమెను బలిపశువును చేయటమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
-
వారసుడిని చూడకుండానే..
⇒ దొంగరావిపాలెం వద్ద కల్వర్టును ఢీకొన్న కారు ⇒ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి ⇒ ఇద్దరికి తీవ్రగాయాలు ⇒ మృతులు విశాఖ లాసన్స్‌బే కాలనీ వాసులు ⇒ ఐదు రోజుల క్రితం జన్మించిన బిడ్డను చూసేందుకు వెళుతుండగా ప్రమాదం పెనుగొండ రూరల్: వారసుడు పుట్టాడనే ఆనందంతో బయల్దేరిన విశాఖలోని ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసింది. ఐదు రోజుల క్రితం జన్మించిన కుమారుడిని చూసేందుకు తహతహతో బయల్దేరిన తండ్రి, వారసుడిని చూడబోతున్నామన్న ఆనందంతో ఉన్న తాత, నానమ్మ మార్గమధ్యంలోనే కన్నుమూశారు. పశ్చిమగోదావిర జిల్లా పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద జాతీయరహదారిపై ఆదివారం వేకువజామున కారు కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీకి చెందిన చల్లా గంగునాయుడు(55), చల్లా పార్వతమ్మ(50) దంపతులు, వారి కుమారుడు చల్లా అరుణకుమార్(30) అక్కడిక్కడే మృతి చెందారు. అరుణకుమార్ చెల్లెలు చల్లా సునీత, స్నేహితుడు యు.చలపతికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి తాడేపల్లిగూడెం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అరుణకుమార్ డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వెళుతూ ఓవర్ టేక్ చేసే సమయంలోగానీ, కునుకు పట్టడంతోగాానీ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సునీత, చలపతిని తణుకు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రమాదం వేకువజాము 4, 5 గంటల మధ్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రామ శివారు కావడంతో ఇక్కడ జన సంచారం లేదు. అటుగా వెళుతున్న వాహనదారులు చూసి సమాచారం అందించడంతో పెనుగొండ ఎస్ఐ సీహెచ్.వెంకటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏడాది క్రితమే వివాహం విశాఖపట్నానికి చెందిన చల్లా అరుణకుమార్‌కు ఏడాది క్రితం నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన అరుసుమిల్లి కూర్మారావు రెండో కుమార్తె నళినితో వివాహమైంది. ఆమె ఐదు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలోని ప్రయివేటు ఆస్పత్రిలో ప్రసవించింది. కుమారుడు పుట్టాడు. శని, ఆదివారాలు సెలవు కావడంతో అందరికీ వెసులుబాటు ఉంటుందని కుమారుడిని చూడడానికి తల్లి, తండ్రి, చెల్లి, స్నేహితుడితో కారులో తాడేపల్లిగూడెంలోని ఆస్పత్రికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివాహమైన ఏడాదిలోనే అల్లుడిని కోల్పోయామంటూ కూర్మారావు కన్నీరుమున్నీరయ్యారు. పచ్చి బాలింతరాలైన కుమార్తెకు అల్లుడి మరణ వార్త ఎలా చెప్పాలంటూ విలవిల్లాడారు. ఉద్యోగంలో చేరకుండానే అరుణకుమార్ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ వద్ద విశాఖపట్నంలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేశాడు. అతని తండ్రి గంగునాయుడు కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీంతో అరుణకుమార్‌కు కేజీహెచ్‌లో ఉద్యోగం వచ్చింది. త్వరలో ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం మాసేశాడు. ఈ లోపునే దుర్ఘటన జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రమాదంలో కాళ్లు, మరో ప్రమాదంలో ప్రాణాలు చల్లా గంగునాయుడు జీవితం ప్రమాదాలతోనే గడిచిపోయింది. విశాఖపట్నం కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆయనకు ఐదేళ్ల కిత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కర్రల ఊతంతో మాత్రమే కదలగలడు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొడుకును ఉద్యోగంలో చేర్చాలని ఆశపడ్డారు. ఎట్టకేలకు కుమారుడికి కారుణ్య నియామకం కింద అనుమతులు వచ్చిన తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలన్న ఆశ తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వారసుడైన మనుమడిని కూడా చూడకుండానే వెళ్లిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. -
పదవులు వద్దు
- నా వారసుడు పార్టీలోకి రాడు - ప్రధాని మోడీకి విధేయులం - స్పష్టం చేసిన వైగో సాక్షి, చెన్నై: తనకు రాజ్యసభ పదవి వద్దే వద్దని, తన వారసుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఎండీఎంకే నేత వైగో తేల్చారు. ఆ పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు చర్చలు సాగారుు. ప్రధాని నరేంద్ర మోడీకి విధేయతను చాటుకుని ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా మరో ఉద్యమానికి సిద్ధమవుదామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు డీఎంకేలో ఏర్పడ్డ చీలికతో ఆవి ర్భవించిన పార్టీ ఎండీఎంకే. వైగో నేతృత్వంలోని ఈ పార్టీలోకి అప్పుడు డీఎంకే నుంచి పెద్ద సంఖ్యలో వలసలు వచ్చారు. పార్టీలో ఒకప్పుడున్న ముఖ్య నాయకుల్వెరూ ఇప్పుడు లేరు. అయినా డీలా పడకుండా పార్టీని వైగో నెట్టుకొస్తూ ఉన్నారు. అనివార్య కారణాలతో అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించినా, లోక్ సభ ఎన్నికల ద్వారా తన ఉనికి చాటుకునే యత్నం చేశారు. డిపాజిట్లు గల్లంతైనా, తన పయ నం మాత్రం ఆగదంటూ, ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడి గతంలో ఉద్యమాలు చేశారో, దాన్ని కొనసాగించేందుకు వైగో సిద్ధం అయ్యారు. ఎన్నికల సమయంలో బీజేపీ తమకు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీ లు, కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై పట్టు విడుపుగా ముందుకెళ్లేందుకు వైగో నిర్ణయించారు. అలాగే, ప్రధా ని మోడీకి విధేయతను చాటుకునే పనిలో పడ్డారు. ఉన్నత స్థాయి భేటీ: తాయగంలో గురువారం జిల్లా, డివిజన్, పార్టీ సలహా కమిటీ, రాష్ట్ర కమిటీ సమావేశాన్ని వైగో ఏర్పాటు చేశారు. రాత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి మాత్ర మే చర్చించారు. ఎన్నికల వేళ పొత్తు కుదుర్చునే సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలపై పట్టుబడదామని కొందరు నేతలు వాదించినా, వాటిని వైగో తిరస్కరించడం విశేషం. ఎన్నికల్లో ఓడిన తనకు రాజ్యసభ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నా, పుచ్చుకునేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏదో ఒక రాష్ట్రం తరపున రాజ్యసభకు వెళ్లి, ఆ రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. తనకు ఏ పదవులూ వద్దు అని, ఈలం తమిళుల సంక్షేమం, తమిళుల అభ్యున్నతి కోసం ప్రధాని మోడీతో కలసి పనిచేద్దామని, విధేయతను చాటుకుందామని సూచించారు. అవసరం అయితే, తమిళుల కోసం మరో ఉద్యమాన్ని చేపట్టి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దామని వివరించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలాన్ని పుంజుకుని రాష్ట్రంలో సత్తాను చాటుకుందామని, ఇందుకు ప్రతి ఒక్కరూ రెండేళ్లు మరింతగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. వారసుడు రాడు: ఎండీఎంకే నేత వైగో కుమారుడు దురై వయ్యాపురి. తండ్రికి సహకారంగా తరచూ కొన్ని కార్యక్రమాల్లో ఈయన కన్పిస్తుంటారేగానీ ప్రత్యక్ష రాజకీయల్లోకి రాలేదు. పార్టీలో ఎలాంటి జోక్యం ఉండదు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో విరుదునగర్‌లో క్రియాశీలక పాత్రను దురై వయ్యాపురి పోషించారు. దీంతో ఎండీఎంకేలోకి వారసుడొస్తున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. ఎండీఎంకే యువజన పగ్గాలు చేపట్టబోతున్నారని, వైగో తర్వాత ఆ పార్టీకి దురై వయ్యాపురి నేతృత్వం వహిస్తారన్నట్టుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటికీ ముగింపు పలికే విధంగా ఉన్నత స్థాయి భేటీలో వైగో స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. వయ్యాపురిని రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ కొందరు నేతలు ఇచ్చిన సూచనకు స్పందించిన వైగో, వయ్యాపురికి రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. విరుదునగర్‌లో తాను పోటీ చేసిన దృష్ట్యా, తనకు మద్దతుగా ప్రజల్లోకి వయ్యాపురి వచ్చాడేగానీ రాజకీయాల్లోకి రావాలన్న తలంపుతో మాత్రం కాదని వివరించారు. తన వారసుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని, తన కుటుంబానికి చెందిన వాళ్లెవరూ రారంటూ, ఎండీఎంకే కుటుంబ పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండంటూ పరోక్షంగా డీఎంకేను ఎత్తి చూపుతూ వ్యాఖ్యలు చేసినట్టుగా ఆపార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.