సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ ప్రముఖ బ్యాంకు యాక్సిస్‌బ్యాంకు కొత్త సీఎండీగా అమితాబ్ చౌదరి (54) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారాన్ని అందించింది. డిసెంబరు 31నుంచి ప్రస్తుత సీఎండీ శిఖా శర్మ బాధ్యతలనుంచి తప్పుకున్న నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
అమితాబ్ జనవరి 1, 2019 నుంచి సీఈవో, ఎండీగా అమితాబ్ వ్యవహరిస్తారని యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది.జనవరి 1, 2019 -31 డిసెంబరు 2021 వరకు మూడేళ్లపాటు అమితాబ్ చౌదరిని మూడేళ్లపాటు ఆయన పదవీకాలంలో కొనసాగనున్నారు. 1987లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కరియర్ మొదలు పెట్టిన చౌదరి, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కు సీఎండీగా పనిచేశారు.
కాగా 2018 మే నాటికి మూడవసారి బ్యాంకు సీఎండీగా ఆమె పదవీ కాలం ముగియనుండగా, నాలుగవసారి కూడా ఎండీగా నియమించాలని యాక్సిస్ బ్యాంకు బోర్డు నిర్ణయించింది. అయితే భారీ నష్టాలు, నోట్లరద్దు సమయంలో చట్టవిరుద్ధంగా పాతనోట్లను మార్చిన ఆరోపణల నేపథ్యంలో శిఖాశర్మ పునర్నియామకంపై ఆర్‌బీఐ ప్రశ్నలు లేవనెత్తడంతో డిసెంబరు 31, 2018నుంచి బాధ‍్యతలనుంచి తప్పుకోనున్నట్టు ఏప్రిల్‌లో శిఖాశర్మ ప్రకటించారు. అయితే సీఎండీగా యాక్సిస్ బ్యాంకు అమితాబ్ చౌదరిని గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment