Axis Bank Ltd
-
32,000 పైకి సెన్సెక్స్
కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి మరో ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం త్వరలోనే అందించగలదన్న ఆశలతో మంగళవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తారన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం కలసివచ్చింది. ముడి చమురు ధరలు 2 శాతం మేర తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగానైనా పుంజుకోవడం, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పుంజుకోవడం.... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 32,0000 పాయింట్లపైకి నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఈ రెండు సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఈ రెండు సూచీలు ఏడు వారాల గరిష్ట స్థాయిలకు చేరాయి. సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో 32,115 పాయింట్ల వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 9,381 పాయింట్ల వద్ద ముగిశాయి. 541 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే మొదలైంది. గంటలోపే నష్టాల్లోకి జారిపోయినా, మళ్లీ లాభాల్లోకి వచ్చింది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో కదలాడింది. ఆ తర్వాత లాభాలు జోరుగా పెరిగాయి. ఒక దశలో 84 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 457 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా 541 పాయింట్ల రేంజ్లో కదలాడింది. లాక్డౌన్ తొలగింపు, వ్యాపారాలు మళ్లీ పూర్వపు స్థాయిలకు రావడానికి తీసుకునే చర్యలపై ప్రస్తుత ర్యాలీ ఆధారపడి ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. షాంఘై, జపాన్ సూచీలు మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ►నికర లాభం నిరాశపరిచినా, నికర వడ్డీ మార్జిన్ పెరగడం, నిలకడైన వృద్ధి కారణంగా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 15 శాతం లాభంతో రూ.467 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ►సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. ►మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 29% వాటా కొనుగోలు చేయనుండటంతో యాక్సిస్ బ్యాంక్ షేర్ 7% లాభంతో రూ. 455 వద్దకు చేరింది. -
యాక్సిస్ బ్యాంక్ నష్టాలు రూ.1,388 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,388 కోట్ల నికర నష్టాలు(స్టాండ్అలోన్) వచ్చాయి. మొండి బకాయిలు, ఇతర అనిశ్చిత అంశాలకు కేటాయింపులు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.1,505 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఆదాయం రూ.18,324 కోట్ల నుంచి రూ.20,220 కోట్లకు పెరిగింది. ► అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,711 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.7,730 కోట్లకు పెరిగాయి. కరోనా అనిశ్చితిని తట్టుకోవడానికి రూ.3,000 కోట్ల కేటాయింపులు దీంట్లో ఉన్నాయి. ► కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 1,678 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,250 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► స్థూల మొండి బకాయిలు 5.26 శాతం నుంచి 4.86 శాతానికి, నికర మొండి బకాయిలు 2.06 శాతం నుంచి1.56 శాతానికి తగ్గాయి. ► గత క్యూ4లో నిర్వహణ లాభం 17 శాతం వృద్ధితో రూ.5,851 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.6,808 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.55 శాతంగా ఉంది. ► రిటైల్ రుణాలు 24 శాతం, కార్పొరేట్ రుణాలు11 శాతం పెరిగాయి. మొత్తం మీద రుణవృద్ధి 15 శాతంగా ఉంది. ► రిటైల్ రుణాలు 24%, కార్పొరేట్ రుణాలు11% పెరిగాయి. మొత్తం మీద రుణవృద్ధి 15%గా ఉంది. మార్కెట్ ముగిసిన తర్వాత çఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం బ్యాంక్ షేర్ 6.6 శాతం లాభంతో రూ.455 వద్ద ముగిసింది. చదవండి: 49 రోజుల తర్వాత లాక్డౌన్ పూర్తిగా.. -
యాక్సిస్ బ్యాంకునకు కరోనా షాక్
సాక్షి, ముంబై : దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కు కోవిడ్-19 షాక్ తగిలింది. మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 1,388 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అంతకు ముందు సంవత్సరం 1,505 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. తాజా ఫలితాలతో విశ్లేషకులు అంచనాలను బ్యాంకు తారుమారు చేసింది. విశ్లేషకులు 1,556 కోట్ల రూపాయల లాభాలను అంచనా వేశారు. మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. మరోవైపు నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 16 శాతం పెరిగి రూ. 25,206 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా ప్రొవిజన్లు నమోదయ్యాయి. గత ఏడాది 3,000 కోట్లు తో పోలిస్తే ఈ త్రైమాసికంలో 7,730 కోట్లుగా ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో యాక్సిస్ బ్యాంకు వెల్లడించింది. అయితే స్థూల బ్యాడ్ లోన్ల బెడద 4.86 శాతానికి తగ్గింది. మార్చిలో ముగిసిన త్రైమాసికంలో నికర ఎన్‌పిఎలు 1.56 శాతానికి తగ్గాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో 29 శాతం వాటాను కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ లైఫ్ మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యంతో బ్యాంక్ వాటా 30 శాతానికి చేరి, అతి పెద్ద వాటాదారుగా నిలవనుంది. ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఎఫ్ఎస్)ను మాక్స్ లైఫ్‌లో విలీనం కావడమే భాగస్వామ్యం యొక్క దీర్ఘకాలిక ఉద్దేశం. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్ మధ్య 70:30 జాయింట్ వెంచర్ ఏర్పాటుకానుంది. లావాదేవీ పూర్తి కావడానికి ఆరు నుండి తొమ్మిది నెలల కాలం పట్టునుందని, తద్వారా తమ వాటాదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించాలని భావిస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్, ఎంఎఫ్ఎస్ఎల్ ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఒప్పందానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సీసీఐ ఆమోదం లభించాల్సి వుంది. -
యాక్సిస్ బ్యాంకు లాభాలు రెట్టింపు
సాక్షి, ముంబై : దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు యాక్సిస్బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో మెరుగైన లాభాలను సాధించింది. నికర వడ్డీ ఆదాయం పెరగడంతో 2019 జూన్ 30 తో ముగిసిన మొదటి త్రైమాసికంలో (క్యూ1)లో దాదాపు రెట్టింపు లాభాలను సాధించింది. అయితే అధిక ప్రొవిజన్లు, స్లిప్పేజీల కారణంగా మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. మార్కెట్లు ముగిశాక ప్రకటించిన ఫలితాల్లో ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో యాక్సిస్ బ్యాంక్ రూ. 1370 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 701 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 95 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 5844 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 2711 కోట్ల నుంచి రూ. 3815 కోట్లను పెరిగాయి. అయితే స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 5.26 శాతం నుంచి 5.25 శాతానికి నీరసించాయి. నికర ఎన్పీఏలు సైతం 2.06 శాతం నుంచి 2.04 శాతానికి తగ్గాయి. స్థూల స్లిప్పేజెస్ రూ. 4798 కోట్లుగా నమోదయ్యాయి. మంగళవారం యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1.82 శాతం క్షీణించి 706.55 రూపాయల వద్ద ముగిసింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్: డిపాజిట్లపై వడ్డీరేటు కోత
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మానిటరీ రివ్యూలో 25 పాయింట్ల రెపో రేట్ కట్ తరువాత దేశీయ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిప్ బ్యాంకు, కోటక్ మహీంద్ర , హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై వినియోగదారులకు చెల్లించే వడ్డీరేటు స్వల్పంగా తగ్గించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్ల కోసం ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై 10 -25 బిపిఎస్ మధ్య వడ్డీ రేట్లను తగ్గించింది. 61-90 రోజులు, 91-120 రోజులు, 121-184 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అదేవిధంగా, 390 రోజుల నుండి 2 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై కొత్త రేటు 7.10 శాతం నుండి 7 శాతానికి పడిపోయింది, 2-3 సంవత్సరాల డిపాజిట్లపై 20 బిపిఎస్ నుండి 7.3 శాతానికి తగ్గింది. యాక్సిస్ బ్యాంకు దేశీయ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ రూ .2 కోట్ల లోపు ఒక సంవత్సరం మెచ్యూరిటీలపై డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించామని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు, బ్యాంక్ ఇప్పుడు 1 సంవత్సరం డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ చెల్లించనుంది. ఈ సవరించిన రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక అడుగు ముందుకు వేసి, బిల్ల డిపాజిట్ కాలాన్ని ఆఫర్లో ఉన్న మొత్తం పదవీకాలం 20 నుండి 18నెలలకు తగ్గించింది. 18 నెలలు- 2 సంవత్సరాల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు 7.10 శాతంగా ఉంది. గతంలో మూడు వేర్వేరు 391 రోజుల నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ 7.20 శాతంగా ఉంది. అదేవిధంగా, 2-3 సంవత్సరాల దేవిధంగా, 2-3 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లు ఇప్పుడు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించి ప్రస్తుతం 7శాత వడ్డీని చెల్లిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కూడా డిపాజట్లపై వడ్డీరేటును తగ్గించింది. ఈ సవరించిన రేట్లు జూన్12నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 2కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై చెల్లించేవడ్డీరేటు 7.30శాతంగా ఉంది. 2-3 ఏళ్ల డిపాజిట్లపై 7.25 శాతానికి తగ్గించింది. 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5శాతం వడ్డీని చెల్లిస్తుంది. -
అదరగొట్టిన యాక్సిస్ బ్యాంకు
సాక్షి,ముంబై : ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు మూడవ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనా వేసినదానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించింది. నికర లాభాల్లో ఏకంగా 131 శాతం పుంజుకుంది. గత ఏడాది డిసెంబరు 31తో ముగిసిన క్యూ3లో రూ.1681 కోట్ల నికరలాభాలను ఆర్జించింది. ఇది రూ.1197కోట్లుగా ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. నిరర్థక ఆస్తుల్లో స్వల్పంగా క్షీణత నమోదైంది. బ్యాంకు మాజీ సీఈవో శిఖా శర్మ ఆధ్వర్యంలో నికర లాభం, వడ్డీ లాభం సహా అన్ని విధాలుగా మెరుగైన ప్రదర్శనతో బ్యాంకు ఆకట్టుకుంది. నికర నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 2.54 నుంచి 2.36 (రూ.12233.3 కోట్లు) శాతానికి తగ్గగా, గ్రాస్ ఎన్పీఏ 5.9 నుంచి 5.7 (రూ.30854.70 కోట్లు)శాతానికి తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.5603.60 కోట్లు గా నమోదు చేసింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.47 శాతం, ప్రొవిజన్స్ రూ.3054 కోట్లు, రిటైల్ లోన్ బుక్ వృద్ధి 20 శాతంగా ఉన్నాయి. మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో రేపటి ట్రేడింగ్‌లో యాక్సిస్ బ్యాంకు కౌటర్లో లాభాలను అంచనావేస్తున్నారు ఎనలిస్టులు. -
యాక్సిస్ బ్యాంకు కొత్త సీఎండీ
-
యాక్సిస్ బ్యాంకు కొత్త సీఎండీ
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ ప్రముఖ బ్యాంకు యాక్సిస్బ్యాంకు కొత్త సీఎండీగా అమితాబ్ చౌదరి (54) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారాన్ని అందించింది. డిసెంబరు 31నుంచి ప్రస్తుత సీఎండీ శిఖా శర్మ బాధ్యతలనుంచి తప్పుకున్న నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. అమితాబ్ జనవరి 1, 2019 నుంచి సీఈవో, ఎండీగా అమితాబ్ వ్యవహరిస్తారని యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది.జనవరి 1, 2019 -31 డిసెంబరు 2021 వరకు మూడేళ్లపాటు అమితాబ్ చౌదరిని మూడేళ్లపాటు ఆయన పదవీకాలంలో కొనసాగనున్నారు. 1987లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కరియర్ మొదలు పెట్టిన చౌదరి, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కు సీఎండీగా పనిచేశారు. కాగా 2018 మే నాటికి మూడవసారి బ్యాంకు సీఎండీగా ఆమె పదవీ కాలం ముగియనుండగా, నాలుగవసారి కూడా ఎండీగా నియమించాలని యాక్సిస్ బ్యాంకు బోర్డు నిర్ణయించింది. అయితే భారీ నష్టాలు, నోట్లరద్దు సమయంలో చట్టవిరుద్ధంగా పాతనోట్లను మార్చిన ఆరోపణల నేపథ్యంలో శిఖాశర్మ పునర్నియామకంపై ఆర్బీఐ ప్రశ్నలు లేవనెత్తడంతో డిసెంబరు 31, 2018నుంచి బాధ్యతలనుంచి తప్పుకోనున్నట్టు ఏప్రిల్‌లో శిఖాశర్మ ప్రకటించారు. అయితే సీఎండీగా యాక్సిస్ బ్యాంకు అమితాబ్ చౌదరిని గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కస్టమర్లకు షాకిచ్చిన యాక్సిస్ బ్యాంక్
సాక్షి, ముంబై: ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. మార్జిన్ల బెడదతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకు రుణాలపై వడ్డీరేటును పెంచేందుకు నిర్ణయించింది. రుణాలపై వసూలు చేసే లెండింగ్ రేటుపై 5 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి 18నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది. దీంతో బ్యాంకు అందిస్తున్న వార్షిక ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి చేరింది. వార్షిక రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచామనీ, జనవరి 18 నుంచి అమల్లోకి వస్తోందని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపింది. అయితే లాకింగ్ పీరియడ్‌లో పాత రుణగ్రహీతలకు పాత వడ్డీరేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం ప్రభావం కొత్తగా రుణాలను తీసుకునేవారిపై పడనుంది. మరోవైపు వడ్డీరేటును పెంచుతున్న మొట్టమొదటి వాణిజ్య బ్యాంకుగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. దీంతో మూడు సంవత్సరాలలో మొదటిసారి వడ్డీ రేటు పెంచడం కొన్ని కీలక సంకేతాలను అందిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
మోడీ @100...సెన్సెక్స్@27,000
నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన మొదలై 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 27,000 పాయింట్లను అధిగమించింది. జీడీపీ జోష్, కరెంట్ ఖాతా లోటు కట్టడి, మోడీ సంస్కరణలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు... వెరసి వరుసగా 8వ రోజు సెన్సెక్స్ లాభాలు అందుకుంది. సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్టంగా 27,083కు చేరి చివరికి 152 పాయింట్ల లాభంతో 27,019 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ఒక దశలో 8,102ను తాకింది. ట్రేడింగ్ ముగిసేసరికి 55 పాయింట్ల లాభంతో 8,083 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, సెన్సెక్స్ 26,000 పాయింట్ల నుంచి 27,000కు చేరడానికి 40 ట్రేడింగ్ రోజులు తీసుకుంది. అంటే జూలై 7న 26,000ను తాకగా, సెప్టెంబర్ 2న 27,000ను దాటింది. ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రెండున్నరేళ్ల తరువాత జీడీపీ 5.7% వృద్ధిని సాధించగా, కరెంట్ ఖాతా లోటు 4.8% నుంచి 1.7%కు పడిపోవడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 34 బిలియన్ డాలర్లను ఇండియాలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు జపాన్ ప్రకటించడం మరింత బలాన్నిచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. కాగా, మోడీ పాలనలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో సెన్సెక్స్ 9 శాతం పెరగడం గమనార్హం. ఎఫ్ఐఐల జోరు..: సోమవారం రూ. 554 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 673 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కాగా, ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు వినియోగించే జనరిక్ ఔషధాన్ని జర్మనీ, స్వీడన్లలో విక్రయించేందుకు అనుమతి పొందిన సిప్లా 5.2% ఎగసింది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4-2% మధ్య పుంజుకోగా, సెసాస్టెరిలైట్, టాటా పవర్, హిందాల్కో, విప్రో 2-1% మధ్య నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 1,738 లాభపడగా, 1,250 తిరోగమించాయి. తమ గ్రూప్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు జపాన్ బ్యాంక్ ఇంటర్నేషనల్(జేబీఐసీ)తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న జీఎంఆర్ షేరు 3.5% బలపడి రూ. 26.65 వద్ద ముగిసింది. ఏడాది గరిష్టానికి 323 షేర్లు రోజురోజుకీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మార్కెట్ల బాటలో పలు షేర్లు సైతం లాభాలతో పరుగుతీస్తున్నాయి. ఇప్పటికే పలు స్టాక్స్ ఏడాది గరిష్టాలను తాకగా, తాజాగా ఈ జాబితాలో 323 కంపెనీలు చేరాయి. వీటిలో ఏసీసీ, భారతీ ఎయిర్టెల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, లుపిన్, ఐవోసీ, ఎంఅండ్ఎం, మారుతీ, టెక్ మహీంద్రా వంటి దిగ్గజాలుండటం విశేషం!