సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మానిటరీ రివ్యూలో 25 పాయింట్ల రెపో రేట్ కట్ తరువాత దేశీయ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిప్ బ్యాంకు, కోటక్ మహీంద్ర , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై వినియోగదారులకు చెల్లించే వడ్డీరేటు స్వల్పంగా తగ్గించాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్ల కోసం ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై 10 -25 బిపిఎస్ మధ్య వడ్డీ రేట్లను తగ్గించింది. 61-90 రోజులు, 91-120 రోజులు, 121-184 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అదేవిధంగా, 390 రోజుల నుండి 2 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై కొత్త రేటు 7.10 శాతం నుండి 7 శాతానికి పడిపోయింది, 2-3 సంవత్సరాల డిపాజిట్లపై 20 బిపిఎస్ నుండి 7.3 శాతానికి తగ్గింది.
యాక్సిస్ బ్యాంకు
దేశీయ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ రూ .2 కోట్ల లోపు ఒక సంవత్సరం మెచ్యూరిటీలపై డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించామని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు, బ్యాంక్ ఇప్పుడు 1 సంవత్సరం డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ చెల్లించనుంది. ఈ సవరించిన రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
కోటక్ మహీంద్రా బ్యాంకు
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక అడుగు ముందుకు వేసి, బిల్ల డిపాజిట్ కాలాన్ని ఆఫర్‌లో ఉన్న మొత్తం పదవీకాలం 20 నుండి 18నెలలకు తగ్గించింది. 18 నెలలు- 2 సంవత్సరాల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు 7.10 శాతంగా ఉంది. గతంలో మూడు వేర్వేరు 391 రోజుల నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ 7.20 శాతంగా ఉంది. అదేవిధంగా, 2-3 సంవత్సరాల దేవిధంగా, 2-3 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లు ఇప్పుడు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించి ప్రస్తుతం 7శాత వడ్డీని చెల్లిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
హెచ్‌డీఎఫ్‌సీ కూడా డిపాజట్లపై వడ్డీరేటును తగ్గించింది. ఈ సవరించిన రేట్లు జూన్12నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 2కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై చెల్లించేవడ్డీరేటు 7.30శాతంగా ఉంది. 2-3 ఏళ్ల డిపాజిట్లపై 7.25 శాతానికి తగ్గించింది. 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5శాతం వడ్డీని చెల్లిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment